త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | కేసీఆర్‌పై జీరో ఎఫ్ఐఆర్..!

KCR | బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు పార్టీ కార్య‌క‌ర్త‌ల‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదు చేయాల‌ని సైఫాబాద్ పోలీసుల‌కు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత దేవ‌ని స‌తీశ్ మాదిగ ఫిర్యాదు చేశారు. నిన్న వ‌ర‌ద‌రాజుప‌ల్లెలో జ‌రిగిన ఘ‌ట‌న‌కు కేసీఆర్‌పై త‌క్ష‌ణ‌మే జీరో ఎఫ్ఐఆర్ న‌మోదు చేసి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Sep 9, 2026, 4.29 pm IST

KCR | కేసీఆర్‌పై జీరో ఎఫ్ఐఆర్..!
Advertisement
  • న‌మోదుకు దేవ‌ని స‌తీశ్ మాదిగ డిమాంండ్

KCR | త్రినేత్ర‌.న్యూస్ : బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు పార్టీ కార్య‌క‌ర్త‌ల‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదు చేయాల‌ని సైఫాబాద్ పోలీసుల‌కు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత దేవ‌ని స‌తీశ్ మాదిగ ఫిర్యాదు చేశారు. నిన్న వ‌ర‌ద‌రాజుప‌ల్లెలో జ‌రిగిన ఘ‌ట‌న‌కు కేసీఆర్‌పై త‌క్ష‌ణ‌మే జీరో ఎఫ్ఐఆర్ న‌మోదు చేసి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. సైఫాబాద్ పోలీసుల‌కు ఫిర్యాదు అనంత‌రం దేవ‌ని స‌తీశ్ మాదిగ మీడియాతో మాట్లాడారు.

శాస‌న‌స‌భ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ప‌ట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గా నిన్న 5 వేల మందిమి 3 వేల డ‌ప్పుల‌తో వ‌ర‌ద‌రాజుప‌ల్లె నుంచి కేసీఆర్ ఫామ్ హౌజ్ దాకా వెళ్లాం. త‌మ నిర‌స‌న‌ను అంద‌రూ చూశారు. ఈ కార్య‌క్ర‌మం ముగిసిన త‌ర్వాత‌.. మాల‌మాదిగ‌లు న‌డిచిన నేల మైల ప‌డ్డ‌ద‌ని చెప్పి.. కేసీఆర్ త‌న ప‌ని మ‌న‌షులు, కార్య‌క‌ర్త‌ల‌తో ప‌సుపు నీళ్ల‌తో శుద్ధి చేయించారు. మా ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే రాంలీలా మైదానంలో ప్ర‌సంగించిన త‌ర్వాత బీజేపీ కార్య‌క‌ర్త‌లు ఆ ప్రాంతాన్ని శుద్ధి చేశారు. మేం న‌డిచిన నేల మ‌లినం అయింద‌ని పసుపు నీళ్ల‌తో క‌డిగించారంటే.. ఇదేనా మీరు ద‌ళితుల‌కు ఇచ్చే గౌర‌వం. మేం ఏం పాపం చేసినం. ఇది మీకు న్యాయ‌మా..? అని దేవ‌ని స‌తీశ్ మాదిగ ప్ర‌శ్నించారు.

125 అడుగుల అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని పాల‌తో శుద్ధి చేస్తాం..

కేసీఆర్ ముట్టుకున్న 125 అడుగుల అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని రేపు పాల‌తో శుద్ధి చేసేందుకు సిద్ధ‌మ‌య్యాం.. ఇందుకు సీఎం రేవంత్ అనుమ‌తి ఇవ్వాలి. పాల‌తో శుద్ధి చేసేందుకు ఒక భారీ క్రేన్‌ను కూడా స‌మ‌కూర్చాల‌ని సీఎంకు దేవ‌ని స‌తీశ్ మాదిగ విజ్ఞ‌ప్తి చేశారు.

Advertisement
Advertisement