త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Prof. CNR Rao | పేరులో ఎక్స్‌ట్రా ‘F’.. భార‌తర‌త్న సీఎన్ఆర్ రావుకు ఈసీ నోటీసులు

Prof. CNR Rao | భారత ఎన్నికల సంఘం (ECI) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా ప్ర‌ముఖ శాస్త్ర‌వేత్త‌, భార‌త‌ర‌త్న (Bharat Ratna) ప్రొఫెస‌ర్ సీఎన్ఆర్ రావు (Prof. CNR Rao)కు నోటీసులు అంద‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

D

National | Published On Sep 9, 2026, 3.38 pm IST

Prof. CNR Rao | పేరులో ఎక్స్‌ట్రా ‘F’.. భార‌తర‌త్న సీఎన్ఆర్ రావుకు ఈసీ నోటీసులు
Advertisement

Prof. CNR Rao | త్రినేత్ర‌.న్యూస్ : భారత ఎన్నికల సంఘం (ECI) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా ప్ర‌ముఖ శాస్త్ర‌వేత్త‌, భార‌త‌ర‌త్న (Bharat Ratna) ప్రొఫెస‌ర్ సీఎన్ఆర్ రావు (Prof. CNR Rao)కు నోటీసులు అంద‌డం క‌ల‌క‌లం రేపుతోంది. బెంగ‌ళూరులో చేప‌ట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో ఆయ‌న పేరులోని ఓ అక్ష‌రం తేడా (name mismatch) ఉండ‌టంతో.. ఎన్నిక‌ల‌ అధికారులు నోటీసులు పంపారు.

పాత ఓట‌రు జాబితాలో రావు పేరు Prof CNR Rao అని ఉండ‌గా.. కొత్త జాబితాలో ఒక ఎఫ్ ఎక్స్‌ట్రా ప‌డింది. కొత్త జాబితాలో Proff CNR Rao అని ఉంది. దీంతో త‌మ గుర్తింపును ధృవీక‌రించుకునేందుకు విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని ఆయ‌న్ని ఆదేశించ‌డం దుమారం రేపుతోంది. ఈ మేర‌కు జాతీయ మీడియాలో వ‌రుస క‌థ‌నాలు వ‌స్తున్నాయి. అయితే, నోటీసు అందిందంటూ వ‌స్తున్న వార్త‌ల‌ను రావు కార్యాల‌యం ఖండించింది. త‌మ‌కు ఎలాంటి నోటీసు అంద‌లేద‌ని తెలిపింది. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ముఖ్య అధికారి కూడా ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు.

కాగా, భారత ఎన్నికల సంఘం (ECI) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ వివాదాస్ప‌ద‌మ‌వుతున్న‌ది. ఓటర్ల జాబితాను వంద‌ శాతం తప్పులు లేకుండా ప్రక్షాళన చేయడమే ల‌క్ష్యంతో ఈసీ చేప‌డుతున్న ఈ ప్ర‌క్రియ వ‌ల్ల సామాన్యుల‌తోపాటూ ప్ర‌ముఖుల‌కూ తిప్ప‌లు త‌ప్ప‌డం లేదు. ఇప్ప‌టికే ప‌లువురు ఎంపీల పేర్లు జాబితా నుంచి తొల‌గించ‌డం వివాదాస్ప‌ద‌మైన విష‌యం తెలిసిందే. ఓట‌ర్ల జాబితా రికార్డుల్లో పేరులో ఉన్న వ్య‌త్యాసం కార‌ణంగా సామాజిక కార్యకర్త, ప‌ద్మ‌శ్రీ పుర‌స్కార గ్ర‌హీత హరేకళ హ‌జ‌బ్బ‌కు కూడా నోటీసులు అందిన విష‌యం తెలిసిందే. అయితే ఆ స‌మ‌స్య ప‌రిష్కార‌మైన‌ట్లు క‌ర్ణాట‌క ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు.

Also Read..

మోదీ 25 ఏళ్ల ప్ర‌జా జీవితం.. బీజేపీ కీల‌క ప్ర‌క‌ట‌న‌

శాస‌న‌స‌భ రేవంత్ రెడ్డి రూల్ బుక్ ప్ర‌కారం న‌డుస్తుందా..?

కేటీఆర్‌పై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి ఎవిడెన్స్ సేకరించండి

Advertisement
Advertisement