Fauzi Movie | ‘ఫౌజీ’కి బ్రేక్.. సంక్రాంతి రేసులో నిలిచే ఛాన్స్..!
Fauzi Movie | డార్లింగ్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’పై ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. డిసెంబరు 3న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే అదే సమయంలో పలు క్రేజీ ప్రాజెక్టులు రిలీజ్‌కు రెడీ అవుతుండటంతో ‘ఫౌజీ’ వాయిదా పడుతుందనే టాక్ వినిపిస్తోంది.
Entertainment | Published On Sep 9, 2026, 4.37 pm IST
Fauzi Movie | డార్లింగ్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’పై ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. డిసెంబరు 3న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే అదే సమయంలో పలు క్రేజీ ప్రాజెక్టులు రిలీజ్‌కు రెడీ అవుతుండటంతో ‘ఫౌజీ’ వాయిదా పడుతుందనే టాక్ వినిపిస్తోంది. విశ్వక్‌సేన్ హీరోగా సాయికిరణ్ రెడ్డి దైదా తెరకెక్కిస్తున్న ‘లెగసీ’ డిసెంబర్ 4న విడుదల కానుంది. మరోవైపు నాగచైతన్య ‘వృషకర్మ’ డిసెంబర్ 3న, దుల్కర్ సల్మాన్ ‘శ్రీ శ్రీ’ డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో డిసెంబరు రిలీజ్ క్యాలెండర్ ఇప్పటికే బిజీగా మారింది. ఈ నేపథ్యంలో ‘ఫౌజీ’ని సంక్రాంతి 2027 బరిలోకి తీసుకురావాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం ‘ఫౌజీ’ షూటింగ్ కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో డిసెంబరు రిలీజ్ కంటే సంక్రాంతి సీజన్ అయితే సినిమాకు మరింత అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అయితే, ‘ఫౌజీ’ సంక్రాంతి బరిలోకి వస్తే అక్కడ కూడా పోటీ గట్టిగానే ఉండనుంది. చిరంజీవి ‘కాకా’, వెంకటేశ్ ‘జనవరి 12న విడుదల’, పీవీసీయూ ‘మహాకాళి’, ‘సంబరాల ఏటి గట్టు’, ‘జార్జ్ క్రిష్’ తదితర చిత్రాలు ఇప్పటికే సంక్రాంతి రేసులో ఉన్నాయి. దీంతో ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ మారితే.. ఇతర సినిమాల షెడ్యూల్స్‌పైనా ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక ‘ఫౌజీ’లో ఇమాన్వి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రభాస్ గతంలో ‘వర్షం’, ‘యోగి’, ‘ది రాజా సాబ్’ చిత్రాలతో సంక్రాంతి సీజన్‌లో సందడి చేశారు. మరి ‘ఫౌజీ’ కూడా 2027 సంక్రాంతి రేసులోకి వస్తుందా? లేక డిసెంబర్ 3నే థియేటర్లలోకి వస్తుందా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం అభిమానుల చూపంతా మేకర్స్ అధికారిక ప్రకటనపైనే ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ranabaali | సింగనమల బొబ్బిలి రణబాలిగా నీ అక్క..! విజయ్ పవర్ఫుల్ డైలాగ్‌తో రణబాలి టీజర్..!
సెప్టెంబర్ 9, 2026

Nivetha Thomas | ’శ్రీమతి’గా నివేదా థామస్.. ఫస్ట్‌లుక్ అదిరిపోయింది!
సెప్టెంబర్ 9, 2026

Ekta Ratod | టాలీవుడ్లోకి కన్నడ సోయగం ఏక్తా రాథోడ్.. తొలి సినిమాతో హిట్ కొట్టేనా..?
సెప్టెంబర్ 9, 2026
తాజావార్తలు
- ●Balmoor Venkat | పోలీసు నియామకాల్లో లాంగ్ జంప్ 4 మీటర్ల నుంచి 3.8 మీటర్లకు తగ్గించాలి
- ●Supreme Court | బీసీసీఐని జాతీయ క్రీడా చట్టం పరిధిలోకి ఎందుకు తీసుకురాకూడదు..? : సుప్రీంకోర్టు
- ●KCR | కేసీఆర్‌పై జీరో ఎఫ్ఐఆర్..!
- ●TTD | వైభవోపేతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
- ●Sudden Sweating | వ్యాయామం చేయకున్నా చెమటలు అతిగా పడుతున్నాయా.. జాగ్రత్త, అది గుండె పోటుకు సంకేతం కావచ్చు..
- ●Singireddy Niranjan Reddy | ప్రశ్నిస్తారనే భయంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్

Balmoor Venkat | పోలీసు నియామకాల్లో లాంగ్ జంప్ 4 మీటర్ల నుంచి 3.8 మీటర్లకు తగ్గించాలి

Supreme Court | బీసీసీఐని జాతీయ క్రీడా చట్టం పరిధిలోకి ఎందుకు తీసుకురాకూడదు..? : సుప్రీంకోర్టు

KCR | కేసీఆర్‌పై జీరో ఎఫ్ఐఆర్..!

TTD | వైభవోపేతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు



