Dhanteras 2026 | ధన్‌తేరస్‌కు బంగారం కొనాలనుకుంటున్నారా? గోల్డ్ వాల్ట్ గురించి తెలుసుకోండి!
Dhanteras 2026 | ధన్‌తేరస్ సందర్భంగా బంగారం కొనుగోలు చేయడం భారతీయులకు సంప్రదాయంగా వస్తోంది. పండుగ వేళ పసిడి కొంటే సంపద పెరుగుతుందనే నమ్మకంతో చాలామంది బంగారంపై పెట్టుబడి పెడుతుంటారు. అయితే ఆభరణాలు, నాణేల రూపంలో బంగారం కొనుగోలు చేసేటప్పుడు స్వచ్ఛతను నిర్ధారించుకోవడం, భద్రంగా దాచుకోవడం, అవసరమైనప్పుడు విక్రయించడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
Dhanteras 2026 | ధన్‌తేరస్ సందర్భంగా బంగారం కొనుగోలు చేయడం భారతీయులకు సంప్రదాయంగా వస్తోంది. పండుగ వేళ పసిడి కొంటే సంపద పెరుగుతుందనే నమ్మకంతో చాలామంది బంగారంపై పెట్టుబడి పెడుతుంటారు. అయితే ఆభరణాలు, నాణేల రూపంలో బంగారం కొనుగోలు చేసేటప్పుడు స్వచ్ఛతను నిర్ధారించుకోవడం, భద్రంగా దాచుకోవడం, అవసరమైనప్పుడు విక్రయించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. వీటికి ప్రత్యామ్నాయంగా సాంకేతికత ఆధారిత పెట్టుబడి మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి. అలాంటి వాటిలో ధన్ యాప్ అందిస్తున్న ‘గోల్డ్ వాల్ట్’ ఒకటి. దీని ద్వారా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) కాంట్రాక్టుల ద్వారా భౌతిక బంగారం, వెండిని కొనుగోలు చేసి సురక్షితంగా నిల్వ చేసుకోవచ్చు.
అసలేంటి గోల్డ్ వాల్ట్?
గోల్డ్ వాల్ట్ అనేది ఎంసీఎక్స్ మార్కెట్ ధరలకు అనుసంధానమై భౌతిక బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు ధన్ యాప్ అందిస్తున్న పెట్టుబడి సదుపాయం. సాధారణ డిజిటల్ గోల్డ్‌కు ఇది భిన్నం. ఇందులో నేరుగా ఎక్స్ఛేంజ్ కాంట్రాక్టుల ద్వారా లావాదేవీలు జరుగుతాయి. సెబీ నియంత్రణ పరిధిలోని కమోడిటీ మార్కెట్ వ్యవస్థ ద్వారా కొనుగోలు, సెటిల్‌మెంట్ ప్రక్రియ పూర్తవుతుంది. ఇది ఎలా పని చేస్తుందంటే.. గోల్డ్ వాల్ట్ సదుపాయాన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు వినియోగదారుడికి కమోడిటీ రసీదుల హోల్డింగ్ ఖాతా (ComRIS) ఏర్పాటు అవుతుంది. షేర్లను డీమ్యాట్ ఖాతాలో ఉంచినట్లే.. ఈ ఖాతాలో బంగారానికి సంబంధించిన రసీదులు ఉంటాయి. వినియోగదారుడు యాప్‌లో అందుబాటులో ఉన్న ఎంసీఎక్స్ కాంట్రాక్టుల ప్రకారం కొనుగోలు ఆర్డర్ ఇవ్వాలి. అది ఎక్స్ఛేంజ్‌లో అమలవుతుంది. ఈ ప్రక్రియలో కాంట్రాక్ట్ గడువు, మార్జిన్, రోజువారీ మార్క్ టు మార్కెట్ (MTM) సర్దుబాట్లు, డెలివరీ నిబంధనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. సెటిల్‌మెంట్ పూర్తయ్యాక కొనుగోలు చేసిన బంగారం కమోడిటీ రసీదుల రూపంలో ఖాతాలో జమవుతుంది. ఈ బంగారం ఎంసీఎక్స్ ఆమోదించిన భద్రతా వాల్ట్‌లో నిల్వ ఉంటుంది. ధన్ వివరాల ప్రకారం, బంగారానికి బీమా రక్షణ కూడా ఉంటుంది. అవసరమైనప్పుడు యాప్ ద్వారా రిజిస్టర్డ్ చిరునామాకు ఫిజికల్ డెలివరీ కోరేందుకు అవకాశం ఉంది.
స్వచ్ఛత ప్రమాణాలు ఇవే..
బంగారం కొనుగోలులో స్వచ్ఛత అత్యంత కీలకం. ఎంసీఎక్స్ కాంట్రాక్టులకు నిర్దిష్ట ప్రమాణాలు ఉన్నాయి. ఒక గ్రాము గోల్డ్ పెటల్, 8 గ్రాముల గోల్డ్ గినియా, 10 గ్రాముల గోల్డ్ టెన్ కాంట్రాక్టులు 999 స్వచ్ఛత ప్రమాణంతో ఉంటాయి. వంద గ్రాముల గోల్డ్ మినీ, ఒక కిలో బంగారం కాంట్రాక్టులు 995 స్వచ్ఛత ప్రమాణంతో ఉంటాయి. పెట్టుబడిదారులకు ప్రయోజనాల విషయానికి వస్తే.. గోల్డ్ వాల్ట్‌లో బంగారం కొనుగోలు చేయడంతో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఎంసీఎక్స్ లైవ్ ధరలకు అనుగుణంగా లావాదేవీలు జరగడం వల్ల ధరల్లో పారదర్శకత ఉంటుంది. మార్కెట్ ధరపై అదనపు మార్కప్ ఉండదని సంస్థ చెబుతోంది. బంగారాన్ని ఇంట్లో లేదా వ్యక్తిగత లాకర్‌లో భద్రపరచుకోవాల్సిన అవసరం ఉండదు. అవసరమైనప్పుడు భౌతిక డెలివరీ తీసుకోవచ్చు. ధన్‌తేరస్ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను కూడా సంస్థ ప్రకటించింది. 2026 అక్టోబర్ 19 నుంచి నవంబర్ 13 వరకు గోల్డ్ వాల్ట్‌లో బంగారం, వెండి కొనుగోళ్లపై జీరో బ్రోకరేజ్ ఆఫర్ అందిస్తోంది. అయితే ఇందుకు ఒక నిబంధన ఉంది. ఈ సమయంలో కొనుగోలు చేసిన కాంట్రాక్టులను గడువు ముగిసే వరకు కొనసాగించి, భౌతిక సెటిల్‌మెంట్ పూర్తిచేయాలి. ఆ తర్వాత కొనుగోలుపై చెల్లించిన బ్రోకరేజ్‌ను సంస్థ తిరిగి చెల్లిస్తుంది.
ఈ ఛార్జీలు తెలుసుకోవాలి..
గోల్డ్ వాల్ట్‌లో పెట్టుబడి పెట్టే ముందు బంగారం మార్కెట్ ధర ఒక్కటే కాకుండా ఇతర ఖర్చులను కూడా లెక్కించాలి. సాధారణ రోజుల్లో ఒక్కో ఆర్డర్‌పై రూ.20 బ్రోకరేజ్ ఉంటుంది. వీటితో పాటు ఎక్స్ఛేంజ్ ఛార్జీలు, సెబీ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీ, భౌతిక సెటిల్‌మెంట్ ఛార్జీలు సుమారు 0.1 శాతం, ప్యాకేజింగ్ ఖర్చులు వర్తించవచ్చు. బంగారం కొనుగోలుపై 3 శాతం జీఎస్టీ, సంబంధిత సేవా ఛార్జీలపై 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, బంగారం పరిమాణాన్ని బట్టి వార్షిక నిల్వ ఛార్జీలు ఉంటాయి. ఇంటికి డెలివరీ కోరితే రవాణా ఖర్చులు కూడా చెల్లించాలి. ఆర్డర్ ఇచ్చే సమయంలో బంగారం పూర్తి విలువతో పాటు, చట్టబద్ధమైన ఛార్జీలు, పన్నులు, సెటిల్‌మెంట్ విలువలో మార్పుల కోసం అదనపు మొత్తాన్ని తాత్కాలికంగా బ్లాక్ చేస్తారు. ఇందులో బులియన్ విలువలో సుమారు 5 శాతం మొత్తాన్ని ఛార్జీల కోసం ముందుగా కేటాయిస్తారు. ఇది అదనపు ఛార్జీగా భావించకూడదు. వాస్తవంగా వర్తించే ఖర్చులే తుది లెక్కలో పరిగణనలోకి వస్తాయి.
పరిమితులూ ఉన్నాయి..
గోల్డ్ వాల్ట్‌లో రూ.100, రూ.500 వంటి చిన్న మొత్తాలతో ఇష్టానుసారంగా పెట్టుబడి పెట్టడం సాధ్యం కాదు. ఎక్స్ఛేంజ్ నిర్ణయించిన కాంట్రాక్టుల ప్రకారమే కొనుగోలు చేయాలి. ఇవి ఒక గ్రాము నుంచి ఒక కిలో వరకు వివిధ పరిమాణాల్లో అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా, ఇది సాధారణంగా యాప్‌లో డబ్బు పెట్టి వెంటనే బంగారం పొందే విధానం కాదు. ఎంసీఎక్స్ కాంట్రాక్టుల గడువు, రోజువారీ ధరల మార్పులు, సెటిల్‌మెంట్ ప్రక్రియను అర్థం చేసుకోవాలి. డెలివరీకి ముందు అవసరమైన నిధులు ఖాతాలో లేకపోతే కొనుగోలు ఆర్డర్ రద్దయ్యే అవకాశం కూడా ఉంటుంది. మొత్తంగా ధన్‌తేరస్ సందర్భంగా బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి గోల్డ్ వాల్ట్ ఒక ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడుతుంది. అయితే పెట్టుబడి పెట్టే ముందు కాంట్రాక్టుల నిబంధనలు, స్వచ్ఛత, బ్రోకరేజ్, జీఎస్టీ, నిల్వ, డెలివరీ ఛార్జీలను పరిశీలించాలి. కేవలం లైవ్ మార్కెట్ ధరను చూసి నిర్ణయం తీసుకోకుండా మొత్తం ఖర్చును లెక్కించిన తర్వాతే ముందడుగు వేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Ration | నేటి నుంచి నవంబర్ కోటా రేషన్ బియ్యం పంపిణీ
- ●Wedding Feast | పెండ్లి విందులో ఫుడ్ పాయిజనింగ్.. కొత్త జంట సహా 30 మందికి అస్వస్థత
- ●Plane Crash | కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది దుర్మరణం
- ●Traffic Restrictions | హైదరాబాద్‌లో అమిత్‌షా పాదయాత్ర.. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
- ●Omar Abdullah | 14 రోజుల్లో తేల్చకుంటే కూల్చుడే.. ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వానికి 25 మంది ఎమ్మెల్యేల అల్టిమేటం
- ●TVS | సంగిశెట్టి శ్రీనివాస్‌కు మల్లావఝల సదాశివుడు స్మారక పురస్కారం

Ration | నేటి నుంచి నవంబర్ కోటా రేషన్ బియ్యం పంపిణీ

Wedding Feast | పెండ్లి విందులో ఫుడ్ పాయిజనింగ్.. కొత్త జంట సహా 30 మందికి అస్వస్థత

Plane Crash | కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది దుర్మరణం

Traffic Restrictions | హైదరాబాద్‌లో అమిత్‌షా పాదయాత్ర.. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ట్రాఫిక్ ఆంక్షలు






