largest Bar in Hyderabad | హైదరాబాద్ లో అతిపెద్ద బార్.. ఎక్కడుందో తెలుసా
largest Bar in Hyderabad | మద్యం ప్రియులకు కిక్కిచ్చే న్యూస్ ఇది. హైదరాబాద్‌లోనే అతిపెద్ద బార్ ఓపెనైంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఈ బార్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
largest Bar in Hyderabad | త్రినేత్ర.న్యూస్: మద్యం ప్రియులకు కిక్కిచ్చే న్యూస్ ఇది. హైదరాబాద్‌లోనే అతిపెద్ద బార్ ఓపెనైంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఈ బార్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఐఎస్‌బీ రోడ్డులోని పాత ఫిషర్‌మ్యాన్స్ వార్ఫ్ పక్కన ‘బిట్వీన్ బ్రూవరీ’ పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. సుమారు ఎకరం విస్తీర్ణంలో పలు లెవల్స్‌లో ఇండోర్, అవుట్‌డోర్ సీటింగ్‌తో చూడ చక్కగా తీర్చిదిద్దారు. దాదాపు 1,500 మంది సామర్థ్యంతో హైదరాబాద్‌లోనే అతిపెద్ద బార్ కావడం విశేషం.
హైదరాబాద్‌లోని బ్రాడ్‌వే బ్రూవరీస్‌ను నిర్వహిస్తున్న గ్రూపే దీన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ అందిస్తున్న వివిధ రకాల బీర్లలో నార్త్‌ఈస్ట్ ఐపీఏ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఎక్కువ చేదు లేకుండా మంచి ఫ్లేవర్‌తో ఉండటం దీని ప్రత్యేకత.
ఫుడ్ మెనూలో ఫ్లేకీ పఫ్-పేస్ట్రీ క్రస్ట్‌తో తయారు చేసే కీమా పిజ్జా, కొరియాండర్ చికెన్, పనీర్ వంటకాలు తెగ ఆకట్టుకుంటున్నాయి. చికెన్ 65 స్పైసీ ఫ్లేవర్‌ను ఇష్టపడేవారికి మరో ఎంపికగా అందుబాటులో ఉంది.
భారీ సీటింగ్ సామర్థ్యం, ఇండోర్-అవుట్‌డోర్ వాతావరణం మద్యం ప్రియులను తెగ ఆకర్షిస్తోంది. ఒక్కసారైనా అక్కడికెళ్లి ఆస్వాదించాలనేలా ఏర్పాట్లు చేశారు. విభిన్నమైన ఫుడ్ అండ్ బేవరేజ్ మెనూతో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో పనిచేసే ఉద్యోగులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ‘బిట్వీన్ బ్రూవరీ’ కొత్త హ్యాంగ్‌అవుట్ స్పాట్‌గా మారే అవకాశం ఉంది. ఇక మరోవైపు చిన్నాచితకా కష్టసుఖాలను ఏంచక్కా నెమరేసుకోవచ్చు. నగరంలో ఇప్పటివరకు ఏర్పాటైన బార్‌లలో ఇది వేరే లెవల్ అని చెప్పాల్సిందే.
సంబంధిత వార్తలు

Vardhannapeta | మార్చురీలో శవాన్ని పీక్కతిన్న ఎలుకలు.. ఎక్కడో తెలుసా..?
సెప్టెంబర్ 20, 2026

Sanath Nagar TIMS | సనత్ నగర్ టిమ్స్‌లో చోరీ.. కేసు నమోదు
సెప్టెంబర్ 20, 2026

K Shobha Reddy | సీఎం అపాయింట్మెంట్ కావాలంటే గెస్ట్ హౌస్‌కు రావాలి.. మహిళా పారిశ్రామికవేత్తకు వేధింపులు
సెప్టెంబర్ 20, 2026
తాజావార్తలు
- ●Sanath Nagar TIMS | సనత్ నగర్ టిమ్స్‌లో చోరీ.. కేసు నమోదు
- ●K Shobha Reddy | సీఎం అపాయింట్మెంట్ కావాలంటే గెస్ట్ హౌస్‌కు రావాలి.. మహిళా పారిశ్రామికవేత్తకు వేధింపులు
- ●CPI Narayana | వరంగల్ ఎయిర్‌పోర్టుకు మాజీ ప్రధాని పీవీ పేరు పెట్టాలి : సీపీఐ నారాయణ
- ●Super El Niño | భారత్‌కు ‘సూపర్ ఎల్‌నినో’ ముప్పు
- ●Saurav Gurjar | పెళ్లి పేరుతో మోసం.. రెజ్లర్ సౌరవ్ గుర్జార్ అరెస్ట్
- ●Car hits Boy | హైదరాబాద్.. కారు ఢీకొని ఐదేళ్ల బాలుడు మృతి

Sanath Nagar TIMS | సనత్ నగర్ టిమ్స్‌లో చోరీ.. కేసు నమోదు

K Shobha Reddy | సీఎం అపాయింట్మెంట్ కావాలంటే గెస్ట్ హౌస్‌కు రావాలి.. మహిళా పారిశ్రామికవేత్తకు వేధింపులు

CPI Narayana | వరంగల్ ఎయిర్‌పోర్టుకు మాజీ ప్రధాని పీవీ పేరు పెట్టాలి : సీపీఐ నారాయణ

Super El Niño | భారత్‌కు ‘సూపర్ ఎల్‌నినో’ ముప్పు





