K Shobha Reddy | సీఎం అపాయింట్‌మెంట్ కావాలంటే గెస్ట్ హౌస్‌కు రావాలి.. మహిళా పారిశ్రామికవేత్తకు వేధింపులు
K Shobha Reddy | అడ్వర్టైజింగ్ రంగంలో కాంట్రాక్ట్ కోసం న్యాయబద్ధంగా అవకాశం ఇవ్వమని అడిగితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడైన ఒక వ్యక్తి గెస్ట్ హౌస్‌కు రావాలని పిలిచాడంటూ కె.శోభా రెడ్డి( K Shobha Reddy ) అనే మహిళా వ్యాపారవేత్త ఆవేదన వ్యక్తం చేశారు.
K Shobha Reddy | త్రినేత్ర.న్యూస్ : అడ్వర్టైజింగ్ రంగంలో కాంట్రాక్ట్ కోసం న్యాయబద్ధంగా అవకాశం ఇవ్వమని అడిగితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడైన ఒక వ్యక్తి గెస్ట్ హౌస్‌కు రావాలని పిలిచాడంటూ కె.శోభా రెడ్డి( K Shobha Reddy ) అనే మహిళా వ్యాపారవేత్త ఆవేదన వ్యక్తం చేశారు. గెస్ట్ హౌస్‌కు రావు, కనీసం నా బీఎండబ్ల్యూ కారులో 15 నిమిషాలు నన్ను ఆనందపరుచు అంటూ సీఎం సన్నిహితుడు వేధించాడని ఆమె తెలిపారు. ఎవరి పేర్లు చెప్పలేను కానీ ఇలాంటి అంశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అంటూ బాధితురాలు పోస్టు పెట్టారు. సీఎం అపాయింట్‌మెంట్ ఇప్పిస్తే నాకేంటి? అని సదరు వ్యక్తి ప్రశ్నించాడని ఆమె వాపోయింది. అవసరమైతే వీధుల్లో ముష్టి ఎత్తుకుని బతుకుతాను కానీ పని కోసం ఇలాంటి తప్పుడు పనులు చేయను అని బదులు ఇచ్చాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
బాధితురాలి పోస్టు సారాంశం ఇలా..
గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమస్కారం,
గత మూడేళ్లుగా, నేను అవుట్‌డోర్ అడ్వర్టైజింగ్ రంగంలో కేవలం ఒక చట్టబద్ధమైన, నిష్పక్షపాతమైన వ్యాపార అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. ఇటీవల, రెగ్యులర్ టెండర్లు పిలిచే వరకు తాత్కాలికంగా అవకాశం కల్పించాలని కోరుతూ రాబడి పంపకాల ప్రతిపాదనలను కూడా ప్రభుత్వానికి సమర్పించాను.
అయినప్పటికీ, కొన్ని ప్రకటనల నిర్మాణాలపై నోటీసులు జారీ చేసినా, నిబంధనల ఉల్లంఘనలు పరిష్కారం కాకపోయినా అవి అలాగే కొనసాగుతున్నాయి. మరోవైపు, కొన్ని నిర్దిష్ట కేసులలో పైలట్ ప్రాజెక్ట్‌లకు, G.O.Ms.No.68 నుండి మినహాయింపులు/సడలింపులు కూడా మంజూరు చేశారు.
అయితే, అన్నింటికంటే నన్ను తీవ్రంగా కలచివేసిన విషయం ఒకటి ఉంది. నా నిజాయితీతో కూడిన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా మీకు అత్యంత సన్నిహితుడిగా భావించే ఒక వ్యక్తిని నేను సంప్రదించాను. కానీ, నా సమస్యను చర్చించడానికి నన్ను నేరుగా ఒక గెస్ట్ హౌస్‌కు రమ్మని కోరడం జరిగింది. ఒక బహిరంగ వేదికపై ఎవరి పేరును ప్రస్తావించడానికి లేదా వ్యక్తిగత ఆరోపణలు చేయడానికి నేను ఇష్టపడటం లేదు.
కానీ, చట్టబద్ధమైన వ్యాపార అవకాశం కోసం ప్రయత్నిస్తున్న ఒక మహిళా పారిశ్రామికవేత్తగా, ఇటువంటి అధికారిక విషయాలను కేవలం సరైన, పారదర్శకమైన, గౌరవప్రదమైన మార్గాల ద్వారా మాత్రమే నిర్వహించాలని నేను బలంగా నమ్ముతున్నాను.
నేను ఎటువంటి ప్రత్యేకత ఆశించడం లేదు.. నాకు కావలసిందల్లా చట్టబద్ధమైన అవకాశం, సమానమైన గుర్తింపు, ఆత్మగౌరవం మాత్రమే. ఈ విషయంలో తగిన న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను.
ఇట్లు
కే శోభా రెడ్డి
Namaste Hon’ble Chief Minister Sir,
For the past three years, I have been seeking only a lawful and fair opportunity to work in the outdoor advertising sector.
Recently, I submitted revenue-sharing proposals seeking a temporary opportunity until regular tenders are called. Yet,…
— shobhareddykalvala (@shobhareddyk) September 19, 2026
తాజావార్తలు
- ●CPI Narayana | వరంగల్ ఎయిర్‌పోర్టుకు మాజీ ప్రధాని పీవీ పేరు పెట్టాలి : సీపీఐ నారాయణ
- ●Super El Niño | భారత్‌కు ‘సూపర్ ఎల్‌నినో’ ముప్పు
- ●Saurav Gurjar | పెళ్లి పేరుతో మోసం.. రెజ్లర్ సౌరవ్ గుర్జార్ అరెస్ట్
- ●Car hits Boy | హైదరాబాద్.. కారు ఢీకొని ఐదేళ్ల బాలుడు మృతి
- ●Volvo Car | సూర్యాపేటలో వోల్వో కారులో మంటలు.. వైద్యుడు సజీవదహనం
- ●Payal Mehta | సీఎన్ఎన్ - న్యూస్ 18 అసిస్టెంట్ ఎడిటర్ పాయల్ మెహతా కన్నుమూత

CPI Narayana | వరంగల్ ఎయిర్‌పోర్టుకు మాజీ ప్రధాని పీవీ పేరు పెట్టాలి : సీపీఐ నారాయణ

Super El Niño | భారత్‌కు ‘సూపర్ ఎల్‌నినో’ ముప్పు

Saurav Gurjar | పెళ్లి పేరుతో మోసం.. రెజ్లర్ సౌరవ్ గుర్జార్ అరెస్ట్

Car hits Boy | హైదరాబాద్.. కారు ఢీకొని ఐదేళ్ల బాలుడు మృతి



