త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dil Raju | వినాయ‌క నిమ‌జ్జ‌నం వేడుక‌ల్లో భార్య‌తో కలిసి దిల్‌రాజు తీన్‌మార్ డ్యాన్స్‌

వినాయ‌క నిమ‌జ్జ‌నం వేడుక‌ల్లో దిల్‌రాజు తీన్ మార్ డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టాడు. భార్య తేజ‌స్వినితో క‌లిసి స్టెప్పులు వేశాడు. ఈ వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

N

Entertainment | Published On Sep 20, 2026, 1.19 pm IST

Dil Raju | వినాయ‌క నిమ‌జ్జ‌నం వేడుక‌ల్లో భార్య‌తో కలిసి దిల్‌రాజు తీన్‌మార్ డ్యాన్స్‌
Advertisement

Dil Raju |  వినాయ‌క నిమ‌జ్జ‌నం వేడుక‌ల్లో భార్య‌తో క‌లిసి నిర్మాత దిల్‌రాజు డ్యాన్స్ చేశాడు. దిల్‌రాజు ఆఫీస్‌లో వినాయ‌క నిమ‌జ్జ‌నం వేడుక‌లు శ‌నివారం రాత్రి జ‌రిగాయి. ఈ వేడుక‌లో త‌న భార్య‌, కొడుకుతో క‌లిసి దిల్‌రాజు పాల్గొన్నారు. హ‌వా హ‌వా అనే బాలీవుడ్ సాంగ్‌కు దిల్‌రాజు తీన్ మార్ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టాడు. దిల్‌రాజు డ్యాన్స్ చేస్తోన్న స‌మ‌యంలో ఎంక‌రేజ్ చేస్తూ అత‌డి భార్య తేజ‌స్విని క‌నిపించింది. ఆ త‌ర్వాత తేజ‌స్విని త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి డ్యాన్స్ చేసింది.

హుషారుగా...

మ‌రో వీడియోలో జీపు న‌డుపుతూ దిల్‌రాజు క‌నిపించ‌గా ప‌క్క‌నే కొడుకు చేతి ప‌ట్టుకొని తేజ‌స్విని డ్యాన్స్ చేస్తూ హుషారుగా కనిపించింది. ఈ వీడియోలు వైర‌ల్ అవుతోన్నాయి. దిల్‌రాజు డ్యాన్స్‌పై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. యంగ్ హీరోల‌కు ధీటుగా స్టెప్పులు వేశాడ‌ని అంటున్నారు.

రెండు సినిమాలు...

వ‌రుస ప‌రాజ‌యాల‌తో నిర్మాత‌గా సినిమాల వేగాన్ని త‌గ్గించారు దిల్‌ఱాజు. ప్ర‌స్తుతం ర‌వితేజ, హ‌సిత్ గోలి మూవీతో పాటు స‌ల్మాన్‌ఖాన్‌తో ఓ బాలీవుడ్ సినిమాను నిర్మిస్తున్నారు.

Advertisement
Advertisement