త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sugar Price Hike | చక్కెర ధరల పెరుగుదలకు ఇథనాల్ కారణం కాదు.. స్ప‌ష్టం చేసిన కేంద్ర ప్ర‌భుత్వం..!

Sugar Price Hike | దేశంలో చక్కెర ధరలు పెరగడానికి ఇథనాల్‌ తయారీ కోసం చక్కెరను మళ్లిస్తున్నారన్న ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. చక్కెర ధరల పెరుగుదలకు ఇథనాల్‌ ఉత్పత్తితో సంబంధం లేదని స్పష్టం చేసింది. ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఈ అంశంపై వివరణ ఇచ్చింది.

P

National | Published On Aug 21, 2026, 9.50 pm IST

Sugar Price Hike | చక్కెర ధరల పెరుగుదలకు ఇథనాల్ కారణం కాదు.. స్ప‌ష్టం చేసిన కేంద్ర ప్ర‌భుత్వం..!
Advertisement

Sugar Price Hike | దేశంలో చక్కెర ధరలు పెరగడానికి ఇథనాల్‌ తయారీ కోసం చక్కెరను మళ్లిస్తున్నారన్న ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. చక్కెర ధరల పెరుగుదలకు ఇథనాల్‌ ఉత్పత్తితో సంబంధం లేదని స్పష్టం చేసింది. ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఈ అంశంపై వివరణ ఇచ్చింది. దేశీయ చక్కెర ఉత్పత్తి అంచనాల మేరకు లేకపోవడం, పండుగల సీజన్‌లో వినియోగం పెరగడం, పంటలకు జరిగిన నష్టం, అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలో ఏర్పడిన ఇబ్బందులు ధరలపై ప్రభావం చూపాయని కేంద్రం తెలిపింది. కొందరు వ్యాపారులు చక్కెరను అక్రమంగా నిల్వ చేయడం కూడా ధరల పెరుగుదలకు కారణమైందని పేర్కొంది. గత నెల రోజుల్లో చక్కెర ధరలు గణనీయంగా పెరిగాయి. జూలై 20న కిలో చక్కెర సగటు ధర రూ.48గా ఉండగా.. ఆగస్టు 20 నాటికి రూ.55కు పైగా చేరింది. కొన్ని ప్రాంతాల్లో హోల్‌సేల్‌ మార్కెట్‌లో కిలో ధర రూ.65 దాటగా.. రిటైల్‌ మార్కెట్‌లో రూ.70కుపైగా పలుకుతోంది.

ఇథనాల్‌ కోసం మళ్లింపు తగ్గింది..

చక్కెర ధరల పెరుగుదలకు ఇథనాల్‌ ఉత్పత్తే కారణమన్న వాదనలో వాస్తవం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన గణాంకాలను కూడా వెల్లడించింది. 2022-23లో దేశంలో ఉత్పత్తైన చక్కెరలో 12 శాతం వరకు ఇథనాల్‌ తయారీకి మళ్లించగా.. 2025-26లో ఈ వాటా 9 శాతానికి తగ్గిందని తెలిపింది. అంతేకాకుండా దేశంలో తయారవుతున్న ఇథనాల్‌లో దాదాపు మూడో వంతు మొక్కజొన్న తదితర ధాన్యాల ఆధారంగానే ఉత్పత్తి అవుతోందని కేంద్రం వివరించింది. దీంతో చక్కెరను ఇథనాల్‌ తయారీకి మళ్లించడం వల్లే మార్కెట్‌లో కొరత ఏర్పడి ధరలు పెరిగాయన్న ఆరోపణకు ఆధారం లేదని పేర్కొంది.

ధరల నియంత్రణకు చర్యలు

చక్కెర ధరలను కట్టడి చేసి దేశీయ మార్కెట్‌లో సరఫరాను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో భాగంగా చక్కెర నిల్వలపై పరిమితులు విధించినట్లు తెలిపింది. మార్కెట్‌లో సరఫరా కొరత లేకుండా చేసేందుకు దిగుమతులకూ వెసులుబాటు కల్పించింది. సుంకం లేని లేదా తక్కువ సుంకంతో చక్కెరను దిగుమతి చేసుకునేందుకు అనుమతులు మంజూరు చేసినట్లు కేంద్రం తెలిపింది. దేశీయ లభ్యత పెరిగే కొద్దీ ధరలపై ఒత్తిడి తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement
Advertisement