త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

LIC Dividend | మోదీ ప్రభుత్వానికి ఎల్‌ఐసీ బోనాంజా.. రూ.12,207 కోట్ల డివిడెండ్‌

LIC Dividend | ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వానికి రూ.12,207 కోట్ల డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ మేరకు ఎల్‌ఐసీ ఎండీ, సీఈఓ ఆర్ దొరైస్వామి బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు డివిడెండ్ చెక్కును అందజేశారు.

P

Business | Published On Jul 29, 2026, 4.10 pm IST

LIC Dividend | మోదీ ప్రభుత్వానికి ఎల్‌ఐసీ బోనాంజా.. రూ.12,207 కోట్ల డివిడెండ్‌
Advertisement
  • ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు చెక్కు అందజేత..
  • యూనియన్ బ్యాంక్‌, న్యూ ఇండియా అష్యూరెన్స్‌ నుంచి డివిడెండ్లు

LIC Dividend | ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వానికి రూ.12,207 కోట్ల డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ మేరకు ఎల్‌ఐసీ ఎండీ, సీఈఓ ఆర్ దొరైస్వామి బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు డివిడెండ్ చెక్కును అందజేశారు. అలాగే, ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.2,853 కోట్ల డివిడెండ్ చెక్కును అందించింది. బ్యాంకు ఎండీ, సీఈఓ ఆశీష్ పాండే ఈ చెక్కును ఆర్థిక మంత్రికి అందజేశారు. అలాగే ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థ న్యూ ఇండియా అష్యూరెన్స్ చైర్మన్, ఎండీ గిరిజా సుబ్రహ్మణియన్ రూ.211 కోట్ల డివిడెండ్ చెక్కును నిర్మలా సీతారామన్‌కు అందించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరుపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరాలు వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తుల (జీఎన్‌పీఏ) నిష్పత్తి రికార్డు స్థాయిలో 1.93 శాతానికి తగ్గిందని తెలిపింది. నికర ఎన్‌పీఏ 0.39 శాతానికి పడిపోవడం ద్వారా ఒత్తిడిలో ఉన్న ఆస్తులు చారిత్రాత్మక కనిష్ఠ స్థాయికి చేరాయని పేర్కొంది. అదే సమయంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సమిష్టి నికర లాభం 11.1 శాతం పెరిగి రూ.1.98 లక్షల కోట్లకు చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. వరుసగా నాలుగో ఏడాది లాభాలను నమోదు చేయడం గమనార్హమని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆస్తుల నాణ్యత మెరుగుపడటం, రుణాల వృద్ధి, ఆదాయం పెరగడం, పాలనా సంస్కరణలు, సమర్థవంతమైన రిస్క్ మేనేజ్‌మెంట్ చర్యలు ఈ ఫలితాలకు ప్రధాన కారణాలని వివరించింది. మార్చి 31, 2026 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం వ్యాపారం రూ.283.3 లక్షల కోట్లకు చేరి, గత ఏడాదితో పోలిస్తే 12.8 శాతం వృద్ధి నమోదు చేసింది. అలాగే అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు 90 శాతానికి పైగా ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియోను కొనసాగించడం వాటి ఆర్థిక పటిష్ట‌తకు నిదర్శనమని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Advertisement
Advertisement