Governor Shiv Pratap Shukla | విశ్వసనీయ వార్తలతోనే ప్రజాస్వామ్యం బలోపేతం : గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
Governor Shiv Pratap Shukla | డిజిటల్ యుగంలో వార్తల వేగం కంటే వాస్తవికత, నిష్పక్షపాతం, విశ్వసనీయతకే మీడియా ప్రాధాన్యమివ్వాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. ముందుగా వాస్తవ నిర్ధారణ చేసి.. ఆ తర్వాతే వార్తను ప్రసారం చేయాలని జర్నలిస్టులకు సూచించారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ తొలి జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు.
Governor Shiv Pratap Shukla | డిజిటల్ యుగంలో వార్తల వేగం కంటే వాస్తవికత, నిష్పక్షపాతం, విశ్వసనీయతకే మీడియా ప్రాధాన్యమివ్వాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. ముందుగా వాస్తవ నిర్ధారణ చేసి.. ఆ తర్వాతే వార్తను ప్రసారం చేయాలని జర్నలిస్టులకు సూచించారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ తొలి జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. మీడియా ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభమే కాకుండా సమాజానికి కళ్లు, చెవులు, ప్రజల గొంతుక అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జర్నలిస్టులను ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, సామాజిక భద్రత, వృత్తిపరమైన అభివృద్ధికి ఫెడరేషన్ కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ వంటి సాంకేతికతలు జర్నలిజానికి కొత్త అవకాశాలు కల్పిస్తున్నప్పటికీ.. డీప్‌ఫేక్‌లు, ఏఐ రూపొందించిన వీడియోలు, తప్పుడు సమాచారం సవాళ్లు విసురుతున్నాయని చెప్పారు. సోషల్ మీడియా ప్రభావంతో జెన్ జీ ఆలోచనా విధానంలో మార్పులు వస్తున్న నేపథ్యంలో యువతకు వాస్తవ, విశ్వసనీయ సమాచారాన్ని అందించడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమన్నారు. సోషల్ మీడియా ట్రెండ్స్, ఫేక్ న్యూస్‌కు లోనుకాకుండా ప్రజా ప్రయోజనమే లక్ష్యంగా వార్తలు అందించాలని సూచించారు. సంచలనాత్మకత, వైరల్ కంటెంట్ కంటే విశ్వసనీయత, నైతిక ప్రమాణాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఫేక్ న్యూస్‌ను ఎదుర్కొనేందుకు డిజిటల్, ఏఐ లిటరసీతోపాటు ఫ్యాక్ట్‌చెకింగ్‌పై ఫెడరేషన్ విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. తప్పుడు సమాచారాన్ని అరికట్టడం ప్రభుత్వం ఒక్కదాని బాధ్యత కాదని.. మీడియా, సాంకేతిక సంస్థలు, పౌరుల సమష్టి బాధ్యత అని స్పష్టం చేశారు.
‘నశా ముక్త్ భారత్’, ‘టీబీ ముక్త్ భారత్’ వంటి జాతీయ కార్యక్రమాలను ప్రజా ఉద్యమాలుగా మలచడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఫెడరేషన్ రాజకీయాలకు అతీతంగా సమ్మిళిత, ప్రజాస్వామ్య వేదికగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం దానకిశోర్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎస్ విజయ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వీ. రమేశ్, ‘ద హిందూ’ గ్రూప్ పబ్లిషింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఎన్ రామ్, ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ అధ్యక్షుడు గౌతమ్ లాహిరీ తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Dasoju Sravan | ఏక్తా మాల్ టెండర్లలో భారీ అవకతవకలు : దాసోజు శ్రవణ్
- ●Dasoju Sravan | ఆదిలాబాద్ సీసీఐని అదానీకి కట్టబెట్టే కుట్ర: దాసోజు శ్రవణ్
- ●Minister Srihari | రాజకీయ కక్షతోనే సీఎం అమెరికా పర్యటనను అడ్డుకున్నారు : మంత్రి వాకిటి శ్రీహరి
- ●Tollywood | పెద్ద సినిమాలకే టికెట్ ధరల పెంపు - తెలంగాణ సర్కార్ కొత్త జీవోపై ప్రొడ్యూసర్ గిల్డ్ రియాక్షన్
- ●Telangana | వేటు వేస్తారా.. సర్దిచెబుతారా
- ●Telangana Congress | అసమ్మతి జ్వాల

Dasoju Sravan | ఏక్తా మాల్ టెండర్లలో భారీ అవకతవకలు : దాసోజు శ్రవణ్

Dasoju Sravan | ఆదిలాబాద్ సీసీఐని అదానీకి కట్టబెట్టే కుట్ర: దాసోజు శ్రవణ్

Minister Srihari | రాజకీయ కక్షతోనే సీఎం అమెరికా పర్యటనను అడ్డుకున్నారు : మంత్రి వాకిటి శ్రీహరి

Tollywood | పెద్ద సినిమాలకే టికెట్ ధరల పెంపు - తెలంగాణ సర్కార్ కొత్త జీవోపై ప్రొడ్యూసర్ గిల్డ్ రియాక్షన్



