Dasoju Sravan | ఆదిలాబాద్ సీసీఐని అదానీకి కట్టబెట్టే కుట్ర: దాసోజు శ్రవణ్
Dasoju Sravan | ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమను బ్రౌన్ ఫీల్డ్ కింద సులభంగా పునరుద్ధరించాల్సింది పోయి తెరవెనుక అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు.
Dasoju Sravan | త్రినేత్ర.న్యూస్: ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమను బ్రౌన్ ఫీల్డ్ కింద సులభంగా పునరుద్ధరించాల్సింది పోయి తెరవెనుక అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి విస్మరించి, మోదీ అజెండాను అమలు చేస్తూ ఆదిలాబాద్ భవిష్యత్తును అదానీకి తాకట్టు పెట్టేందుకు పరోక్షంగా సహకరిస్తున్నారని విమర్శించారు. కేటీఆర్, జోగు రామన్న మార్గదర్శకత్వంలో ఆదిలాబాద్ సీసీఐ సాధన కోసం, కార్మికుల పక్షాన జరిగే ఏ పోరాటానికైనా బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్‌లో "సీసీఐ పునరుద్ధరణ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత" అనే అంశంపై శుక్రవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి జోగు రామన్నతో కలిసి దాసోజు పాల్గొని మాట్లాడారు.
నీళ్లు, నదులు, అడవులు, నేషనల్ హైవ్‌లు, వందేళ్లకు సరిపడా సున్నపురాయి నిల్వలు ఉన్నప్పటికీ, పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆదిలాబాద్ జిల్లా అనాదరణకు గురవుతోంది. విభజన చట్టంలోని హామీలను గాలికొదిలేసిన బీజేపీ ప్రభుత్వం... ఏపీకి పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్, అమరావతి రాజధాని నిర్మాణానికి రూ. 15,000 కోట్ల గ్రాంట్, విశాఖపట్నం, తిరుపతి, తదితర ప్రాంతాలకు ఐఐఎం, ఐఐటీ, ఎన్ఐటీ, ఎయిమ్స్, సెంట్రల్ యూనివర్సిటీలు వంటి అనేక సంస్థలను కేటాయించింది.
14, 15వ ఆర్థిక సంఘాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవడానికి దాదాపు రూ. 50,000 కోట్ల నుంచి లక్ష కోట్ల రూపాయల ఫిస్కల్ డెఫిసిట్‌ను గ్రాంట్ల రూపంలో సమకూర్చింది. బ్రౌన్ ఫీల్డ్ కింద సులభంగా పునరుద్ధరించాల్సిన సీసీఐ పరిశ్రమను తెరవెనుక అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. రాష్ట్ర విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించింది అని దాసోజు మండిపడ్డారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Minister Srihari | రాజకీయ కక్షతోనే సీఎం అమెరికా పర్యటనను అడ్డుకున్నారు : మంత్రి వాకిటి శ్రీహరి
- ●Tollywood | పెద్ద సినిమాలకే టికెట్ ధరల పెంపు - తెలంగాణ సర్కార్ కొత్త జీవోపై ప్రొడ్యూసర్ గిల్డ్ రియాక్షన్
- ●Telangana | వేటు వేస్తారా.. సర్దిచెబుతారా
- ●Telangana Congress | అసమ్మతి జ్వాల
- ●Jupally Krishna Rao | టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి.. వైరల్
- ●Supreme Court | ఏడాది ప్రాక్టీస్ చేస్తే చాలు న్యాయసేవలోకి.. యువ న్యాయవాదులకు సుప్రీంకోర్టు ఊరట..!

Minister Srihari | రాజకీయ కక్షతోనే సీఎం అమెరికా పర్యటనను అడ్డుకున్నారు : మంత్రి వాకిటి శ్రీహరి

Tollywood | పెద్ద సినిమాలకే టికెట్ ధరల పెంపు - తెలంగాణ సర్కార్ కొత్త జీవోపై ప్రొడ్యూసర్ గిల్డ్ రియాక్షన్

Telangana | వేటు వేస్తారా.. సర్దిచెబుతారా

Telangana Congress | అసమ్మతి జ్వాల



