Arvind Kejriwal | ఈ20 పెట్రోల్ ధరలు తగ్గించాలి.. ఆగస్టు 4న ప్రధాని నివాసం ముట్టడికి పిలుపునిచ్చిన కేజ్రీవాల్
Arvind Kejriwal | కేంద్రం అనుసరిస్తున్న ఈ20 (E20) పెట్రోల్ విధానంపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మరోసారి తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఈ20 పెట్రోల్ విధానానికి వ్యతిరేకంగా ఆగస్టు 4న ప్రధాని నివాసం ముట్టడికి పిలుపునిచ్చారు.
Arvind Kejriwal | కేంద్రం అనుసరిస్తున్న ఈ20 (E20) పెట్రోల్ విధానంపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మరోసారి తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంతో ముడిపెట్టారు. అమెరికాను సంతోష పెట్టేందుకే ఈ విధానాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపించారు. న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో అరవింద్ కేజ్రీవాల్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. ఈ20 పెట్రోల్ విధానానికి వ్యతిరేకంగా ఆగస్టు 4న ప్రధాని నివాసం ముట్టడికి పిలుపునిచ్చారు.
కేంద్రం అనుసరిస్తున్న ఈ20 (E20) పెట్రోల్ విధానానికి వ్యతిరేకంగా రెండు లక్షలకు పైగా ప్రజలు సంతకాలు చేసిన లేఖలను అందజేసేందుకు ఈనెల 4న ప్రధాన మంత్రి నివాసం వరకూ (PM Modi House) పాదయాత్ర చేపట్టనున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. "భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంలో భాగంగానే ప్రభుత్వం ప్రజలపై బలవంతంగా ఈ20 ఇంధనాన్ని రుద్దుతోంది. దీని కారణంగా దేశంలోకి ఇథనాల్ దిగుమతులు భారీగా పెరుగుతున్నాయి. ఈ20 ఇంధనం వాహనాలకు నష్టం కలిగించదని వాదిస్తూ ప్రభుత్వం ఉదహరిస్తున్న ఆ అధ్యయన నివేదికలను బహిర్గతం చేయాలి" అని అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.
అదే సమయంలో ప్రజలు తమకు నచ్చిన పెట్రోల్‌ను ఎంచుకునే వీలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పెట్రోల్ బంకుల్లో ఈ20 ఇంధనం, స్వచ్ఛమైన పెట్రోల్‌లలో ఏదో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం వినియోగదారులకు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ20 మిశ్రమ పెట్రోల్ ధరలను తగ్గించాలని కోరారు.
Also Read..
E20 లేకపోతే పెట్రోల్ ధర రూ.125కు చేరేది : కేంద్రం
కశ్మీర్‌కు రాష్ట్ర హోదా అడిగినప్పుడే ఉగ్రదాడులు ఎందుకు?
బ్రేకప్ రూమర్లపై అనుపమ రియాక్షన్ - నన్ను ప్రశ్నించే హక్కు ఎవరికి లేదంటూ కామెంట్స్
తాజావార్తలు
- ●Singareni Apprenticeship | సింగరేణిలో అప్రెంటిస్‌లు.. ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, డిప్లొమా చేసినవారు అర్హులు
- ●Constable Suicide | ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ఆత్మహత్య
- ●Lake Development | CSR నిధులతో చెరువులను అభివృద్ధి చేద్దాం: ఎంఏయూడీ
- ●Cristiano Ronaldo | పదేండ్లుగా డేటింగ్.. ఎట్టకేలకు వివాహబంధంలోకి రొనాల్డో
- ●SBI Recruitment | SBI జూనియర్ అసోసియేట్స్ రిక్రూట్మెంట్.. 9,124 పోస్టులకు దరఖాస్తులు షురూ
- ●‘హస్తం’ గూటిలో ‘గులాబీ’ల త్రిశంకు స్వర్గం: అభివృద్ధి ఆశలు.. గౌరవం గల్లంతు: ఫిరాయింపు నేతల రాజకీయ తంటాలు!

Singareni Apprenticeship | సింగరేణిలో అప్రెంటిస్‌లు.. ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, డిప్లొమా చేసినవారు అర్హులు

Constable Suicide | ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ఆత్మహత్య

Lake Development | CSR నిధులతో చెరువులను అభివృద్ధి చేద్దాం: ఎంఏయూడీ

Cristiano Ronaldo | పదేండ్లుగా డేటింగ్.. ఎట్టకేలకు వివాహబంధంలోకి రొనాల్డో






