Double bedroom house fraud | లక్షన్నర ఇవ్వండి. డబుల్ బెడ్ రూం ఇల్లు ఇప్పిస్తా
Double bedroom house fraud | తనకు లక్షన్నర ఇస్తే డబుల్ బెడ్ రూం ఇల్లు ఇప్పిస్తానని నకిలీ పత్రాలు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠా సభ్యుడిని పోలీసులు ఆట కట్టించారు. అబ్రామ్ మోడల్ స్కూల్ ఇన్‌ఛార్జ్ ఆస్మా సుల్తానాతో పాటు 50 మందికి పైగా అమాయకులను మోసం చేసిన సయ్యద్ సల్మాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- నకిలీ పత్రాలు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
- 52 నకిలీ, ఫోర్జరీ పత్రాలు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
Double bedroom house fraud | త్రినేత్ర.న్యూస్: తనకు లక్షన్నర ఇస్తే డబుల్ బెడ్ రూం ఇల్లు ఇప్పిస్తానని నకిలీ పత్రాలు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠా సభ్యుడిని పోలీసులు ఆట కట్టించారు. అబ్రామ్ మోడల్ స్కూల్ ఇన్‌ఛార్జ్ ఆస్మా సుల్తానాతో పాటు 50 మందికి పైగా అమాయకులను మోసం చేసిన సయ్యద్ సల్మాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొబైల్ ఫోన్‌తో పాటు 52 నకిలీ, ఫోర్జరీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
టాస్క్‌ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ప్రకారం వివరాలిలా ఉన్నాయి. చాంద్రాయణగుట్టలోని బార్కస్‌కు చెందిన సయ్యద్ సల్మాన్ పదో తరగతి వరకు చదివాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువును మధ్యలోనే ఆపివేశాడు. అనంతరం కొన్ని నెలలు మీసేవ కేంద్రంలో పనిచేసి, ఆ తర్వాత కిషన్‌బాగ్‌లోని అబ్రామ్ మోడల్ స్కూల్‌లో హెల్పర్‌గా చేరాడు. అక్కడ స్కూల్ ఇన్‌ఛార్జ్ ఆస్మా సుల్తానాతో పరిచయం ఏర్పడింది. తన ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు, ప్రభుత్వ డబుల్ బెడ్‌రూమ్ (2BHK) ఇళ్లు ఇప్పిస్తానని నమ్మించి అమాయక ప్రజల నుండి డబ్బులు వసూలు చేయాలని పథకం వేశాడు. కలెక్టరేట్ కార్యాలయ అధికారులతో తనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని నమ్మబలికేవాడు. వారి ద్వారా 2BHK ఇళ్లు కేటాయింపజేస్తానని ఆస్మా సుల్తానాను నమ్మించాడు.
ఆమెను నమ్మించి వివిధ విడతల్లో రూ.1,50,000 వసూలు చేశాడు. ప్రాసెసింగ్ కోసం అవసరమని చెప్పి ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను సేకరించాడు. అనంతరం ప్రభుత్వ ముద్రలతో కూడిన నకిలీ 2BHK అలాట్‌మెంట్ ఆర్డర్ కాపీలను సృష్టించి బాధితులకు అందజేశాడు. ఇదే రీతిలో 50 మందికి పైగా అమాయకులను మోసం చేసి రూ.లక్షలు వసూలు చేసి తన వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నాడు.
పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ (జూబ్లీహిల్స్ జోన్) బృందం, మొఘల్‌పురా పోలీసులతో కలిసి ఉమ్మడి ఆపరేషన్ చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఆపరేషన్‌లో జూబ్లీహిల్స్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సి.హెచ్.యాదేందర్, సబ్-ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ జాహిద్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●MP Vaddiraju | పార్లమెంట్ సభ్యులతో బ్యాడ్మింటన్ కోర్టులో ఎంపీ వద్దిరాజు
- ●GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్
- ●MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- ●DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?
- ●స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!
- ●Uttam Kumar Reddy | ఎల్‌నినో నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి

MP Vaddiraju | పార్లమెంట్ సభ్యులతో బ్యాడ్మింటన్ కోర్టులో ఎంపీ వద్దిరాజు

GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్

MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?





