KTR | అపొజిషన్ బాగుంది మహేశన్నా : కేటీఆర్
KTR | ఈ రెండున్నరేండ్లలో నా పొజిషన్లలో చాలా హ్యాపీగా ఉన్నాను.. అపొజిషన్ బాగుంది మహేశన్నా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చమత్కరించారు. అట్ల అని ఇక్కడే ఉంటా అని కాదు.. కాకపోతే బాగుంది అని ఆయన పేర్కొన్నారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : ఈ రెండున్నరేండ్లలో నా పొజిషన్లలో చాలా హ్యాపీగా ఉన్నాను.. అపొజిషన్ బాగుంది మహేశన్నా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చమత్కరించారు. అట్ల అని ఇక్కడే ఉంటా అని కాదు.. కాకపోతే బాగుంది అని ఆయన పేర్కొన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన నవ తెలంగాణ 11వ వార్షికోత్సవంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ హద్దులు దాటకపోతే బాగుంటుందని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కానీ ఎవరు గీయాలి హద్దులు ప్రభుత్వాలా..? మరి హద్దు ఎవరు గీస్తారు..? ట్రెడిషనల్ మీడియాను ఎలాగూ మేనేజ్ చేశారు. మీ వార్తలు రాస్తాం.. అప్పుడప్పుడు పాజిటివ్‌గా, అప్పుడప్పుడు నెగిటివ్‌గా, కొన్నిసార్లు ఉన్నవిఉన్నట్టుగా రాస్తాం.. కానీ యాడ్స్ ఆపకండి అని అడిగే పరిస్థితి వచ్చింది. స్వేచ్ఛకు పరిమితులు పెడితే అది వాక్ స్వాతంత్య్రం ఎట్ల అవుతుంది. స్వేచ్ఛకు పరిమితులు ఉండకూడదు. వాక్ స్వాతంత్య్రం ఇచ్చాం కాబట్టి వాక్ భూషణలతో దాడి చేయండి.. వాడివేడి మాటలతో బూతులు తిట్టండి అని కాదు అని కేటీఆర్ అన్నారు.
నేను కూడా రెండున్నరేండ్లుగా పేపర్లు చదవడం లేదు..
ఇవాళ సోషల్ మీడియా లేకపోతే ప్రభుత్వాల్లో చలనం వచ్చేది కాదు. జవాబుదారీ తనం కూడా వచ్చే పరిస్థితి లేదు. మనం ఆలోచించాల్సింది ఏంటంటే.. కొత్తతరం పిల్లలు ఏం కోరుకుంటున్నారు. ఎందుకంటే 2029 నాటికి లార్జెస్ట్ ఓటింగ్ బ్లాక్ విల్ బీ జెన్ జీ. 50 శాతానికి పైగా ఈ పిల్లలే ఓట్లు వేయబోతున్నారు. ఈ పిల్లలే దేశాన్ని నడపబోతున్నారు. మీడియా పరంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే.. ఈ పిల్లలు ఏం కోరుకుంటున్నారు..? ఎక్కడ్నుంచి సమాచారం సేకరిస్తున్నారనేది కూడా చెప్పాలి. ఇవాళ్టి తరం పేపర్లు చదవడం లేదు. నేను కూడా రెండున్నరేండ్లుగా పేపర్లు చదవడం లేదు.. టీవీలు చూడడం లేదు అని కేటీఆర్ అన్నారు.
అట్లా అని ఇక్కడే ఉంటా అని కాదు
మీరు, లేదా సీఎం కొన్ని సందర్భాల్లో భాష నియంత్రణలో ఉంటే బాగుటుందని మహేశన్న అన్నారు. మహేషన్న నేనైతే గత రెండున్నరేండ్లుగా చాలా హ్యాపీగా ఉన్నాను నా పోజిషన్లలో.. అపోజిషన్ బాగుంది. అట్లా అని ఇక్కడే ఉంటా అని కాదు. కాకపోతే బాగుంది. కాకపోతే ముఖ్యమంత్రి గారే కంఫర్టబుల్‌గా ఉన్నట్టు అనిపించట్లేదు. మీరు పెద్దలు.. ఇలాంటి వేదికలు అరుదుగా పంచుకునేటివి ఉంటాయి.. మీరు చెప్పండి సీఎంకు అని కేటీఆర్ సూచించారు.
రక్తాలు కావాలి.. ఇంకోటి కావాలి ఇంకోటి కావాలి అంటే
తమిళనాడులో జరిగిన ఓ సమావేశంలో నేను, సీఎం ఎదురెదురుగా కూర్చున్నాం. మహేశ్ కుమార్ కూడా ఉన్నారు. ఆ సమావేశంలో నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని సమర్థిస్తూ మాట్లాడాను. రాష్ట్ర సరిహద్దులు దాటిన తర్వాత ఆయన మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన చెప్పింది కరెక్ట్.. దాన్ని సమర్థిస్తున్నానని చెప్పి తమిళనాడులో నేను మాట్లాడాను. రాష్ట్ర సరిహద్దులు దాటిన తర్వాత మన రాష్ట్రాన్ని, మన ముఖ్యమంత్రిని కించపరుచుంటే మనమే పది మందిలో చులకన అవుతాం. అలా హద్దులు దాటం. కానీ రాష్ట్రం లోపల కూడా అదే పద్ధతి ఉంటే బాగుంటది. అంతేకానీ ఇక్కడకు రాగానే రక్తాలు కావాలి.. ఇంకోటి కావాలి ఇంకోటి కావాలి అంటే మాకు కూడా స్పందించక తప్పని పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ పరిస్థితి మారింది అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
న్యూస్‌లో రీల్స్ వస్తున్నయ్..
ఒకప్పుడు న్యూస్ రీల్ అనేది ఉండేది. సినిమా థియేటర్లలో న్యూస్ రీల్ వేసేది. ప్రపంప వ్యాప్తంగా జరిగిన న్యూస్ అన్నింటిని ఒక రీల్ రూపంలో ఎంటర్‌టైన్‌మెంట్ కంటే ముందు చూపించేది. అది న్యూస్ రీల్ జమానా.. ఇప్పుడేమో న్యూస్‌లో రీల్స్ వస్తున్నయ్. సీన్ రివర్స్ అయింది. మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం మారకపోతే మనం కూడా అవుట్‌డేట్ అయిపోతం అని కేటీఆర్ అన్నారు.
సంబంధిత వార్తలు

KCR | కేసీఆర్‌కు మళ్లీ నోటీసులివ్వండి.. న్యాయవాదికి భూపాలపల్లి కోర్టు ఆదేశం
ఆగస్టు 12, 2026

CM Revanth Reddy | ఆ మూడు ప్రాజెక్టులకు ఎన్డీఎస్ఏ సూచనలు పాటించండి.. ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోయండి
ఆగస్టు 12, 2026

TGSWREIS | గురుకుల విద్యార్థులకు సువర్ణావకాశం.. ఉచితంగా నీట్ 2027 లాంగ్ టర్మ్ కోచింగ్.. వివరాలివే..!
ఆగస్టు 12, 2026
తాజావార్తలు
- ●Indian National Sweet Jalebi | రసగుల్లా, గులాబ్ జామున్ సరే.. మరి జిలేబీని ఇంగ్లీష్‌లో ఏమంటారు? 99% మందికి ఈ సీక్రెట్ తెలియదు!
- ●Toxic Yash Success Story | కేవలం రూ.300తో బెంగళూరుకు.. టీలు అమ్మే స్థాయి నుంచి రూ.4000 కోట్ల 'రామాయణ' వరకు.. రాకీ భాయ్ ఇన్స్పైరింగ్ స్టోరీ!
- ●IIT Placements Crisis | ఐఐటీ చదివినా నో జాబ్.. టాపర్లకు కూడా ప్లేస్‌మెంట్స్ కరవు.. అసలు కారణాలివే..!
- ●Kalyana Lakshmi & Shaadi Mubarak | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు షాక్.. ఆ చెల్లింపులపై తెలంగాణ హైకోర్టు స్టే!
- ●Enugula Rakesh Reddy | పెళ్లి పనులు ఒకరు చేస్తే.. మంగళహారతి పట్టిన వాళ్లు ఆ పెళ్లి మేమే చేశాం అన్నట్లుంది
- ●Bhadrachalam-Vizag Road Corridor | భద్రాచలం టు విశాఖపట్నం హైవే: రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ ప్రశ్నకు నితిన్ గడ్కరీ ఆన్సర్ ఇదే

Indian National Sweet Jalebi | రసగుల్లా, గులాబ్ జామున్ సరే.. మరి జిలేబీని ఇంగ్లీష్‌లో ఏమంటారు? 99% మందికి ఈ సీక్రెట్ తెలియదు!

Toxic Yash Success Story | కేవలం రూ.300తో బెంగళూరుకు.. టీలు అమ్మే స్థాయి నుంచి రూ.4000 కోట్ల 'రామాయణ' వరకు.. రాకీ భాయ్ ఇన్స్పైరింగ్ స్టోరీ!

IIT Placements Crisis | ఐఐటీ చదివినా నో జాబ్.. టాపర్లకు కూడా ప్లేస్‌మెంట్స్ కరవు.. అసలు కారణాలివే..!

Kalyana Lakshmi & Shaadi Mubarak | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు షాక్.. ఆ చెల్లింపులపై తెలంగాణ హైకోర్టు స్టే!



