Jagannath Rath Yatra | పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి.. తొక్కిసలాట జరిగి ఒకరు మృతి, 200 మందికి గాయాలు
Jagannath Rath Yatra | పవిత్ర పూరీ (Puri) జగన్నాథ రథయాత్ర (Jagannath Rath Yatra)లో అపశ్రుతి చోటు చేసుకుంది. భక్తులు భారీగా తరలిరావడంతో అక్కడ తొక్కిసలాట (Stampede) చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఊపిరాడక ఒకరు మృతి చెందగా.. సుమారు 200 మందికిపైగా గాయపడ్డారు.
Jagannath Rath Yatra | పవిత్ర పూరీ (Puri) జగన్నాథ రథయాత్ర (Jagannath Rath Yatra)లో అపశ్రుతి చోటు చేసుకుంది. భక్తులు భారీగా తరలిరావడంతో అక్కడ తొక్కిసలాట (Stampede) చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఊపిరాడక ఒకరు మృతి చెందగా.. సుమారు 200 మందికిపైగా గాయపడ్డారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడు కటక్‌కు చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. కాగా, గతేడాది కూడా రథయాత్రలో తొక్కిసలాట జరిగి కనీసం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. గుడించా ఆలయం వద్ద జరిగిన ఈ ఘటనలో దాదాపు 50 మంది భక్తులు గాయపడ్డారు.
ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పూరీ జగన్నాథుని రథయాత్ర (Jagannath Rath Yatra) గురువారం ఘనంగా ప్రారంభమైంది. రథయాత్రను కనులారా వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. దీంతో పూరీ (Puri) క్షేత్రం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేల సంఖ్యలో భక్తులు ‘జై జగన్నాథ్’, ‘హరిబోల్’ నినాదాలతో రథం వెంట నడుస్తూ ముందుకు సాగారు.
Also Read..
ఆక్సిజన్ ఓఎస్‌కు గుడ్‌బై.. వన్‌ప్లస్ ఫోన్లలో ఇక కలర్‌ఓఎస్, ఇండియా నుంచి ఎగ్జిట్ పై కూడా క్లారిటీ..
శ్రీలీలను రిజెక్ట్ చేస్తున్న హీరోలు - ధమాకా బ్యూటీని వెంటాడుతోన్న బ్యాడ్ లక్
వైద్యుల నిర్లక్ష్యం.. అప్పుడే పుట్టిన పసికందుకు తీవ్ర గాయం
సంబంధిత వార్తలు

Stampede | శ్రావణ సోమవారం.. ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు భక్తులు మృతి
ఆగస్టు 17, 2026

Mahaprabhu Jagannath | మహాప్రభు జగన్నాథ్ మూవీ రిలీజ్‌పై సుప్రీంకోర్టుకు మేకర్స్
జులై 16, 2026

Jagannath Rath Yatra | జగన్నాథుని రథాలు.. భక్తి వైభవానికి ప్రతీకలు.. ! నందిఘోష్, తాళధ్వజం, దేవదళన విశేషాలు ఇవే..!
జులై 16, 2026
తాజావార్తలు
- ●Telangana | దక్షిణ కొరియాలో తెలంగాణ ఉన్నతస్థాయి అధికారుల బృందం పర్యటన
- ●వైన్, విస్కీల సీక్రెట్ బాక్స్: అసలు ఈ 'ఓక్' మ్యాజిక్ ఏంటి భయ్యా?
- ●Vemula Prashanth Reddy | కాంగ్రెస్ పాలన 1,000 అబద్ధాల 'దగాపాలన'
- ●Toxic Movie | ముగ్గురు భామలకు ‘టాక్సిక్’.. యశ్ సినిమాతో తలకిందులైన అంచనాలు..!
- ●Traffic Restrictions | రేపు నల్లగొండ ఎక్స్ రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు..
- ●Rajanna Temple | శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి

Telangana | దక్షిణ కొరియాలో తెలంగాణ ఉన్నతస్థాయి అధికారుల బృందం పర్యటన

వైన్, విస్కీల సీక్రెట్ బాక్స్: అసలు ఈ 'ఓక్' మ్యాజిక్ ఏంటి భయ్యా?

Vemula Prashanth Reddy | కాంగ్రెస్ పాలన 1,000 అబద్ధాల 'దగాపాలన'

Toxic Movie | ముగ్గురు భామలకు ‘టాక్సిక్’.. యశ్ సినిమాతో తలకిందులైన అంచనాలు..!



