త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gmail | యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌.. జీమెయిల్‌లో ఏఐని ఇక కావ‌ల్సిన విధంగా ఉప‌యోగించుకోవ‌చ్చు..

Gmail | గూగుల్ తన జీమెయిల్‌లోని జెమినీ ఆధారిత హెల్ప్ మీ రైట్ (Help Me Write) ఫీచర్‌కు కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ అప్‌డేట్‌తో వినియోగదారులు ఏఐ రూపొందించిన ఈమెయిల్ డ్రాఫ్ట్‌లను తమకు నచ్చిన విధంగా మరింత క‌చ్చితంగా సవరించుకోవ‌చ్చు.

S

Technology | Published On Jul 16, 2026, 5.00 pm IST

Gmail | యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌.. జీమెయిల్‌లో ఏఐని ఇక కావ‌ల్సిన విధంగా ఉప‌యోగించుకోవ‌చ్చు..
Advertisement

Gmail | గూగుల్ తన జీమెయిల్‌లోని జెమినీ ఆధారిత హెల్ప్ మీ రైట్ (Help Me Write) ఫీచర్‌కు కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ అప్‌డేట్‌తో వినియోగదారులు ఏఐ రూపొందించిన ఈమెయిల్ డ్రాఫ్ట్‌లను తమకు నచ్చిన విధంగా మరింత క‌చ్చితంగా సవరించుకోవ‌చ్చు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ముందే నిర్ణయించిన ఎడిటింగ్ ఆప్షన్‌లకే గ‌త ఫీచ‌ర్‌ పరిమితమై ఉండగా, ఇప్పుడు వినియోగదారులు తమ సొంత టెక్స్ట్ సూచనలను ఇచ్చి డ్రాఫ్ట్‌ను మార్చుకోవచ్చు. అలాగే ఏఐ చేసిన మార్పులను అన్‌డూ, రీడూ చేసే కొత్త కంట్రోల్స్‌ను కూడా గూగుల్ అందించింది. ఈ ఫీచర్ ప్రస్తుతం దశలవారీగా విడుదల‌వుతోంది. అర్హత ఉన్న వినియోగదారులందరికీ జూలై 20 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని గూగుల్ తెలిపింది. ఈ మేర‌కు గూగుల్ త‌న బ్లాగ్ పోస్టులో వివ‌రాల‌ను వెల్ల‌డించింది.

ప్రాంప్ట్ బార్ ద్వారా సూచ‌న‌లు..

జీమెయిల్‌లోని హెల్ప్ మీ రైట్ ఇప్పుడు డ్రాఫ్ట్‌ను ఎలా మార్చాలనుకుంటున్నారో వినియోగదారులు నేరుగా ప్రాంప్ట్ బార్ ద్వారా వివరించవచ్చు. మొదట జెమినీ ఒక ఈమెయిల్ డ్రాఫ్ట్‌ను రూపొందించిన తర్వాత, దానిలో చేయాలనుకున్న మార్పులను మరో ప్రాంప్ట్ రూపంలో ఇవ్వొచ్చు. ఆ సూచనల ఆధారంగా జెమినీ ఈమెయిల్‌ను తిరిగి సవరించి కొత్త వెర్షన్‌ను అందిస్తుంది. ఇప్పటి వరకు ఈ ఫీచర్‌లో పాలిష్, ఫార్మలైజ్, షార్టెన్ వంటి ముందే నిర్ణయించిన ఎడిటింగ్ ఆప్ష‌న్లు మాత్రమే ఉండేవి. తాజా అప్‌డేట్‌తో వినియోగదారులు మరింత ప్రత్యేకమైన మార్పులను చేయ‌వచ్చు. ఉదాహరణకు, ఈమెయిల్‌లోని ఒక నిర్దిష్ట భాగంలో మిస్ అయిన సమాచారాన్ని క‌ల‌ప‌డం, సందేశంలో డెడ్‌లైన్ చేర్చడం లేదా తమ అవసరాలకు అనుగుణంగా ఇతర మార్పులు చేయాలని సూచించవచ్చు. అలాగే డ్రాఫ్ట్‌ను సవరించే సమయంలో ఏఐ చేసిన మార్పులను వెనక్కి తీసుకోవడానికి లేదా మళ్లీ అమలు చేయడానికి అన్‌డూ, రీడూ సపోర్ట్‌ను కూడా జీమెయిల్ అందిస్తోంది.

ఎవ‌రెవ‌రికి అందుబాటులో..

ఈ ఫీచర్ అర్హత ఉన్న వినియోగదారులకు డిఫాల్ట్‌గా ఎనేబుల్ అవుతుందని గూగుల్ తెలిపింది. గూగుల్ వర్క్‌స్పేస్ వినియోగదారుల విషయంలో అడ్మినిస్ట్రేటర్లు జీమెయిల్‌లో జెమినీ ఫర్ వర్క్‌స్పేస్, వర్క్‌స్పేస్ ఇంటెలిజెన్స్ యాక్సెస్ రెండింటినీ ప్రారంభించి ఉండాలి. ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎండ్ యూజర్లు ప్రత్యేకంగా దాన్ని ఆన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ అప్‌డేట్‌ను గూగుల్ ఇప్పటికే రాపిడ్ రిలీజ్, షెడ్యూల్డ్ రిలీజ్ డొమైన్‌లలో విడుదల చేస్తోంది. జూలై 20 నాటికి మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురానుంది. బిజినెస్ స్టార్టర్, బిజినెస్ స్టాండర్డ్, బిజినెస్ ప్లస్, ఎంటర్‌ప్రైజ్ స్టార్టర్, ఎంటర్‌ప్రైజ్ స్టాండర్డ్, ఎంటర్‌ప్రైజ్ ప్లస్, ఫ్రంట్‌లైన్ ప్లస్, గూగుల్ ఏఐ ప్రో ఫర్ ఎడ్యుకేషన్, ఏఐ ఎక్స్‌పాండెడ్ యాక్సెస్ కస్టమర్లు, అలాగే గూగుల్ ఏఐ ప్లస్, ప్రో, అల్ట్రా సబ్‌స్క్రైబర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.

Advertisement
Advertisement