Sreeleela | శ్రీలీలను రిజెక్ట్ చేస్తున్న హీరోలు – ధమాకా బ్యూటీని వెంటాడుతోన్న బ్యాడ్ లక్
ధమాకా బ్యూటీ శ్రీలీలను బ్యాడ్‌లక్ వెంటాడుతోంది. ఇప్పటికే డిజాస్టర్లతో టాలీవుడ్‌కు దూరమైన ఈ బ్యూటీకి కోలీవుడ్‌లోనూ లక్కు కలిసిరావడం లేదు. అజిత్ హీరోగా ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటించాల్సింది. కానీ ఆమెను పక్కనపెట్టిన మేకర్స్ కయదు లోహర్‌ను ఫైనల్ చేశారు.
Entertainment | Published On Jul 16, 2026, 5.29 pm IST
Sreeleela | ఇకప్పుడు చేతిలో ఐదారు సినిమాలతో టాలీవుడ్‌లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా వెలుగొందింది శ్రీలీల. కానీ ఇప్పుడు ఆఫర్ల కోసం వెయిటింగ్‌లో ఉంది. టాలీవుడ్‌లో కమ్‌బ్యాక్ కష్టంగా మారడంతో తమిళంతో పాటు బాలీవుడ్‌లపై దృష్టిసారిస్తోంది. అక్కడ కూడా ఈ అమ్మడిని బ్యాడ్‌లక్ వెంటాడుతోంది. ఈ ముద్దుగుమ్మ పేరు చెబితేనే హీరోలు భయపడిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. హీరోయిన్‌గా శ్రీలీలను రిజెక్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన అఖిల్ అక్కినేని లెనిన్ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటించాల్సింది. సినిమాను ధమాకా బ్యూటీ అంగీకరించింది. అఖిల్, శ్రీలీలపై లుక్ టెస్ట్ కూడా చేశారు. షూటింగ్ మొదలయ్యే టైమ్‌కు శ్రీలీలను పక్కనపెట్టిన మేకర్స్ భాగ్యశ్రీ బోర్సేకు ఛాన్స్ ఇచ్చారు. లెనిన్ మూవీ భాగ్యశ్రీ బోర్సే కెరీర్‌కు ఓ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.
అనగనగా ఒక రాజు...
ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై వంద కోట్ల వసూళ్లను రాబట్టిన అనగనగా ఒక రాజులో హీరోయిన్‌గా ఫస్ట్ ఛాయిస్ శ్రీలీలనే. అధికారికంగా ప్రకటించి ఆ తర్వాత ఆమెను సినిమా నుంచి తప్పించారు. శ్రీలీల ప్లేస్‌లో మీనాక్షి హీరోయిన్‌గా కనిపించింది. లెనిన్, అననగనా ఒక రాజుతో... ఒకే ఏడాది రెండు సూపర్ హిట్ సినిమాలను మిస్సయ్యింది శ్రీలీల. ఇవే కాకుండా విజయ్ దేవరకొండ కింగ్డమ్, వరుణ్ ధావన్ బాలీవుడ్ మూవీ హై జవానీతో ఇష్క్ హోనా హై సినిమాల్లో కూడా శ్రీలీలనే హీరోయిన్‌గా నటించాల్సింది. చివరి నిమిషంలో మేకర్స్ ఆమెకు షాకిచ్చారు.
అజిత్ సినిమాలో...
తాజాగా మరో ఆఫర్ కూడా శ్రీలీల నుంచి చేజారినట్లు సమాచారం. అజిత్ హీరోగా ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తమిళంలో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ రాబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా కయదు లోహర్‌ను మేకర్స్ ఇటీవల ఫైనల్ చేశారు. తొలుత శ్రీలీలను కథానాయికగా తీసుకోవాలని అజిత్, ఆధిక్ రవిచంద్రన్ అనుకున్నారట. కానీ వరుస డిజాస్టర్ల కారణంగా ధమాకా బ్యూటీని కాదని కయదు లోహర్‌కు అవకాశం ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. ఈ సినిమా నుంచి శ్రీలీలను పక్కనపెట్టడానికి తమిళ మూవీ పరాశక్తి రిజల్ట్ కూడా ఓ కారణమని అంటున్నారు. శివకార్తికేయన్ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాతోనే శ్రీలీల తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన నిర్మాతలను నిండా ముంచేసింది. తొలి సినిమాతోనే శ్రీలీలపై ఐరెన్ లెగ్ అనే ముద్ర పడటంతో అజిత్ సినిమా ఆఫర్ చేజారినట్లు సమాచారం.ప్రస్తుతం తమిళంలో ధనుష్ ఓం సినిమాలో నటిస్తోంది శ్రీలీల. ఇందులో సెకండ్ హీరోయిన్‌గా కనిపించబోతుంది. మెయిన్ హీరోయిన్‌గా సాయిపల్లవి కనిపించబోతుంది. ఈ సినిమాపైనే శ్రీలీల శ్రీలీల బోలెడు ఆశలు పెట్టుకుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Baby Girl | 200 ఏళ్ల తర్వాత.. ఆ ఇంట ఆడబిడ్డ జననం
- ●Mokila | మోకిలా, బాచుపల్లిలో.. ఒక్కో ప్లాట్ ధర ఎంతో తెలుసా?
- ●Telangana | దక్షిణ కొరియాలో తెలంగాణ ఉన్నతస్థాయి అధికారుల బృందం పర్యటన
- ●వైన్, విస్కీల సీక్రెట్ బాక్స్: అసలు ఈ 'ఓక్' మ్యాజిక్ ఏంటి భయ్యా?
- ●Vemula Prashanth Reddy | కాంగ్రెస్ పాలన 1,000 అబద్ధాల 'దగాపాలన'
- ●Toxic Movie | ముగ్గురు భామలకు ‘టాక్సిక్’.. యశ్ సినిమాతో తలకిందులైన అంచనాలు..!

Baby Girl | 200 ఏళ్ల తర్వాత.. ఆ ఇంట ఆడబిడ్డ జననం

Mokila | మోకిలా, బాచుపల్లిలో.. ఒక్కో ప్లాట్ ధర ఎంతో తెలుసా?

Telangana | దక్షిణ కొరియాలో తెలంగాణ ఉన్నతస్థాయి అధికారుల బృందం పర్యటన

వైన్, విస్కీల సీక్రెట్ బాక్స్: అసలు ఈ 'ఓక్' మ్యాజిక్ ఏంటి భయ్యా?






