SSC Recruitment | 3003 పోస్టులతో SSC నోటిఫికేషన్.. పది పాసైతే చాలు!
SSC Recruitment | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉండే ఉద్యోగాలను భర్తీ చేసే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. 3003 ఖాళీలతో ఫేజ్-14 నోటిఫికేషన్ (SSC Recruitment) విడుదల చేసింది.
SSC Recruitment | త్రినేత్ర.న్యూస్: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉండే ఉద్యోగాలను భర్తీ చేసే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. 3003 ఖాళీలతో ఫేజ్-14 నోటిఫికేషన్ (SSC Recruitment) విడుదల చేసింది. ఇందులో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ల్యాబ్ అటెండెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, డాటా ఎంట్రీ ఆపరేటర్, ఫీల్డ్ అసిస్టెంట్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్, రీసెర్చ్ అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్ వంటి పోస్టులు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు గడువు మే 4న ముగియనుంది. ఒకే పరీక్ష ద్వారా వివిధ కేంద్ర శాఖల్లో కొలువు సాధించే అవకాశం కల్పించింది. రాతపరీక్ష, స్కిల్ టెస్టు ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి ప్రారంభ వేతనమే నెలకు రూ.18 వేల నుంచి రూ.1,50,000 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది.
మొత్తం పోస్టులు: 3003
ఇందులో జనరల్ 1534, ఎస్సీ 346, ఎస్టీ 185, ఓబీసీ 667, ఈడబ్ల్యూఎస్ 271 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
- పదో తరగతి పూర్తి చేసిన వారికి.. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ల్యాబ్ అటెండెంట్, ప్యూన్, వర్క్‌షాప్, అటెండెంట్, లైబ్రరీ అటెండెంట్ పోస్టులు కేటాయించారు.
- ఇంటర్‌కి.. లోయర్ డివిజన్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ లెర్నింగ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
- డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు.. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్, రీసెర్చ్ అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ వంటి ఖాళీలు కేటాయించారు.
అర్హతలు
మెట్రిక్యులేషన్ లెవల్ పోస్టులకు పదో తరగతి, హయ్యర్ సెకండరీ లెవల్ పోస్టులకు ఇంటర్, గ్రాడ్యుయేట్ లెవల్ పోస్టులకు డిగ్రీ పూర్తిచేయాలి.
వయస్సు- పోస్టులను బట్టి వయసు మారుతూ ఉంటుంది. పదో తరగతి పూర్తి చేసిన వారికి 18 నుంచి 25 ఏండ్లు, ఇంటర్ చేసిన వారికి 18 నుంచి 27 ఏండ్లు, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు 18 నుంచి 30 ఏండ్లు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ
రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా. కంప్యూటర్ బేస్డ్ రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. చివరిగా నైపుణ్య పరీక్ష. ఇది అన్ని పోస్టులకు ఉండదు. టైపింగ్, డేటా ఎంట్రీ, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అవసరమైన పోస్టులకు మాత్రమే ఈ టెస్ట్ నిర్వహిస్తారు.
పరీక్ష విధానం
పరీక్ష మెుత్తం ఆన్‌లైన్ విధానంలోనే ఉంటుంది. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. 100 ప్రశ్నలకు మొత్తం 200 మార్కులకు ఉంటాయి. 60 నిమిషాల్లో పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి అరమార్కు నెగిటివ్ ఉంటుంది. రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి ప్రశ్నలు అండుగుతారు. ప్రతి విభాగం నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి.
- రీజనింగ్- సిట్టింగ్ అరేంజ్మెంట్, కోడింగ్-డీ కోడింగ్, బ్లడ్ రిలేషన్స్, సిరీస్
- జనరల్ అవేర్‌నెస్- కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్- పర్సంటేజీలు, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, యావరేజస్, రేషియో.
- ఇంగ్లీష్- గ్రామర్, సినోనిమ్స్, ఆంటోనిమ్స్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, స్పెల్లింగ్స్‌పై ప్రశ్నలుంటాయి
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, కరీంనరగ్, ఏపీలోని విజయవాడ, విశాఖ, తిరుపతి, కర్నూలు వంటి ప్రధాన నగరాల్లో ఉంటాయి. దరఖాస్తు చేసుకునేటప్పుడు 3పరీక్షా కేంద్రాలను ఎంచుకోవాలి.
దరఖాస్తు విధానం
- ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. డిగ్రీ ఇలా మూడింటికీ అర్హత ఉంటే విడివిడిగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో స్థాయికి ఒక్కో ఫీజు చెల్లించాలి. దరఖాస్తు తప్పుల సవరణకు మే 11 నుంచి 13 వరకు అవకాశం కల్పించారు.
దరఖాస్తులకు చివరితేదీ: మే 4
అప్లికేషన్ ఫీజు: రూ.100, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు.
పరీక్ష: 2026 జూన్‌లో
వెబ్‌సైట్: ssc.gov.in
మరిన్ని వివరాలకు..
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






