TGPSC | ఒకేరోజు రెండు పరీక్షలు ఉన్న అభ్యర్థులకు టీజీపీఎస్సీ ఊరట.. AEE ఎగ్జామ్ తేదీ మార్పు
TGPSC | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పరీక్ష రాసే అభ్యర్థులకు ఊరటనిచ్చింది. పరీక్ష తేదీని (Exam Date) మారుస్తూ నిర్ణయం తీసుకున్నది.
TGPSC | త్రినేత్ర న్యూస్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పరీక్ష రాసే అభ్యర్థులకు ఊరటనిచ్చింది. పరీక్ష తేదీని (Exam Date) మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 6న జరగాల్సిన ఈ పరీక్షను ఒక రోజు ఆలస్యంగా నవంబర్ 7న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే నవంబర్ 6న ఎస్ఎస్సీ జూనియర్ ఇంజినీర్ (SSC JE), ఏఈఈ పరీక్షలు ఉన్న అభ్యర్థులకు ఇది వర్తిస్తుందని తెలిపింది. ఒకే రోజు రెండు పరీక్షలు ఉన్నవారు.. ఎస్ఎస్ఎస్సీ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్‌ను తమకు పంపించాలని, అదే రోజున వారు రాయాల్సిన ఏఈఈ పరీక్షను 7వ తేదీకి మారుస్తామని వెల్లడించింది.
అసలేం జరిగిందంటే..
రోడ్లు, భవనాల శాఖలో ఏఈఈ (సివిల్) పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నవంబర్ 6, 7 తేదీల్లో పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేసింది. సరిగ్గా అదే సమయంలో SSC JE పరీక్షలు నవంబర్ 2 నుంచి 6 వరకు జరగనున్నాయి. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు, టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) చైర్మన్‌తో చర్చలు జరిపారు. వీలైనంత వరకు తెలంగాణ అభ్యర్థులకు ఎస్ఎస్ఎస్సీ పరీక్షను నవంబర్ 4 లేదా 5 వ తేదీల్లో సర్దుబాటు చేస్తామని ఎస్ఎస్ఎస్సీ చైర్మన్ హామీ ఇచ్చారు. అయినప్పటికీ, కొందరు అభ్యర్థులకు SSC JE (సివిల్) హాల్ టికెట్లలో పరీక్ష తేదీ నవంబర్ 6గానే వచ్చింది. దీంతో ఆ అభ్యర్థులు ఒకేరోజు రెండు పరీక్షలు రాయాల్సి వస్తున్నది.
దీంతో చాలామంది అభ్యర్థులు ఒకే రోజు రెండు ముఖ్యమైన పరీక్ష రాయాల్సి వస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఏఈఈ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని.. ఒకే రోజు రెండు పరీక్షలు ఉన్న అభ్యర్థులకు ఉపశమనం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది.
వారికి మరుసటి రోజు..
నవంబర్ 6వ తేదీనే ఎస్ఎస్ఎస్సీ జేఈ పరీక్ష పడిన అభ్యర్థులు ఆ వివరాలను తమకు తమకు సమర్పించాలని సూచించింది. వారి ఏఈఈ పరీక్షను నవంబర్ 7వ తేదీకి మారుస్తామని (సాధ్యమైనంత వరకు) వెల్లడించింది. దీనికోసం అభ్యర్థులు పరీక్ష తేదీ నవంబర్ 6 అని చూపే SSC JE (సివిల్) హాల్ టికెట్ కాపీ, టీజీపీఎస్సీ ఏఈఈ (సివిల్) నోటిఫికేషన్‌కు అప్లై చేసిన దరఖాస్తు కాపీ, టీజీపీఎస్సీ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) IDని అక్టోబర్ 30 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని తెలిపింది. ఈ పత్రాలను నేరుగా TGPSC కార్యాలయంలోని 'హెల్ప్ డెస్క్' వద్ద గానీ, లేదా helpdesk@tgpsc.gov.inకు ఇమెయిల్ ద్వారా గానీ పంపవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించడానికే ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ, అభ్యర్థులు ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఈ ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు కమిషన్ స్పష్టం చేసింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Horoscope | అక్టోబర్ 27 రాశిఫలాలు.. ఈ రాశివారికి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం!
- ●Tummidihetti Barrage Project | మహారాష్ట్ర ప్రయోజనాలే మా ప్రయారిటీ
- ●Anupama Parameswaran | అచ్చ తెలంగాణ యాసలో - భోగి కోసం అనుపమ పరమేశ్వరన్ డబ్బింగ్
- ●Needala Prapancham book launch | సమాజ డొల్లతనాన్ని ఎండగట్టిన 'నీడల ప్రపంచం': రవీంద్రభారతిలో తిర్మల్ పుస్తకావిష్కరణ
- ●Malavika Mohanan | రెడ్ డ్రెస్‌లో రాజాసాబ్ హీరోయిన్ హాట్ షో
- ●KTR Legal Notice Eenadu | కేటీఆర్ పాస్‌పోర్ట్ వ్యవహారం: లీగల్ నోటీసుకు 'ఈనాడు' బదులు.. తప్పుపై వివరణ, విచారం!

Horoscope | అక్టోబర్ 27 రాశిఫలాలు.. ఈ రాశివారికి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం!

Tummidihetti Barrage Project | మహారాష్ట్ర ప్రయోజనాలే మా ప్రయారిటీ

Anupama Parameswaran | అచ్చ తెలంగాణ యాసలో - భోగి కోసం అనుపమ పరమేశ్వరన్ డబ్బింగ్

Needala Prapancham book launch | సమాజ డొల్లతనాన్ని ఎండగట్టిన 'నీడల ప్రపంచం': రవీంద్రభారతిలో తిర్మల్ పుస్తకావిష్కరణ






