SSC JE Recruitment | కేంద్ర ప్రభుత్వ శాఖల్లో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు.. 1748 పోస్టులతో SSC JE నోటిఫికేషన్
SSC JE Recruitment | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా జూనియర్ ఇంజినీర్ (Junior Engineer) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. మొత్తం 1748 పోస్టులతో ఎస్ఎస్ఎసీ నోటిఫికేషన్ (SSC JE Recruitment) విడుదల చేసింది.
SSC JE Recruitment | త్రినేత్ర.న్యూస్: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా జూనియర్ ఇంజినీర్ (Junior Engineer) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. మొత్తం 1748 పోస్టులతో ఎస్ఎస్ఎసీ నోటిఫికేషన్ (SSC JE Recruitment) విడుదల చేసింది. అర్హత కలిగినవారు సెప్టెంబర్ 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో సైంటిఫిక్ అసిస్టెంట్ (IMD), సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, టెలికమ్ విభాగాల్లో జేఈ (JE) పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రతినెల రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు జీతం వస్తుంది.
మొత్తం పోస్టులు: 1748
అర్హతలు: సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ కమ్యూనిక్స్, కంప్యూటర్ సైన్స్, టెలికమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో ఇంజినీరింగ్ లేదా మూడేండ్ల డిప్లొమా చేసి ఉండాలి. సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుకు ఫిజిక్స్ సబ్జెక్టుతో డిగ్రీ చేసి ఉండాలి. అభ్యర్థులు 30 ఏండ్ల లోపువారై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, డ్యాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా. రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.
పేపర్-1లో 100 ప్రశ్నలు అడుగుతారు. 100 మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. 2 గంటల్లో పరీక్ష పూర్తిచేయాలి.
- జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్- 50 ప్రశ్నలు, 100 మార్కులు
- జనరల్ అవేర్‌నెస్- 50 ప్రశ్నలు, 100 మార్కులు
- సంబంధిత ఇంజినీరింగ్ లేదా టెక్నికల్ సబ్జెక్టు నుంచి- 100 ప్రశ్నలు, 100 మార్కులు
పేపర్-2.. మొత్తం 300 మార్కులకు ఉంటుంది. 2 గంటల్లో పరీక్ష రాయాలి. ఇందులో సంబంధిత ఇంజినీరింగ్ లేదా టెక్నికల్ సబ్జెక్టు నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి తప్పు జవాబుకు 1 కోత విధిస్తారు.
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 22
ఫిజు చెల్లింపునకు చివరితేదీ: సెప్టెంబర్ 23
అప్లికేషన్ ఫీజు: రూ.100, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు ఎలాంటి ఫీజు లేదు.
రాతపరీక్ష: అక్టోబర్ లేదా నవంబర్‌లో పేపర్-1, డిసెంబర్‌లో పేపర్-2
వెబ్‌సైట్: ssc.gov.in
సంబంధిత వార్తలు

SSC CPO Recruitment | డిగ్రీ అర్హతతో ఢిల్లీ పోలీస్, సీఏపీఎఫ్లో 1871 ఎస్ఐ ఉద్యోగాలు
సెప్టెంబర్ 11, 2026

RRB Recruitment | రైల్వేలో 560 పారా మెడికల్ ఉద్యోగాలు.. ఆర్ఆర్బీ నోటిఫికేషన్
సెప్టెంబర్ 10, 2026

SSC CHSL | ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 2536 పోస్టులతో SSC CHSL నోటిఫికేషన్
సెప్టెంబర్ 9, 2026
తాజావార్తలు
- ●Surabhi Vanidevi | క్యూర్ బిల్లును మమ అనిపించారు
- ●Xi Jinping Skips Modi Dinner | మోదీ ఇచ్చిన డిన్నర్‌కు జిన్‌పింగ్ డుమ్మా: సదస్సుకు వచ్చి విందుకు ఎందుకు పోలేదు?
- ●Deshapathi Srinivas | రేవంత్‌ది విజన్ లేని పాలనే కాదు.. వజన్ లేని పాలన కూడా
- ●Daman Tourism | ఒకప్పుడు ‘మందు’ అడ్డా.. ఇప్పుడో అద్భుతం: ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్!
- ●Nagarjuna | పర్యావరణ హితం కోసం సీడ్ గణేషుడినే పూజించండి - అక్కినేని నాగార్జున పిలుపు
- ●TRS | టీఆర్ఎస్లోకి నాగోబా ఆలయ ప్రధాన పూజారి.. అక్టోబర్‌లో ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ

Surabhi Vanidevi | క్యూర్ బిల్లును మమ అనిపించారు

Xi Jinping Skips Modi Dinner | మోదీ ఇచ్చిన డిన్నర్‌కు జిన్‌పింగ్ డుమ్మా: సదస్సుకు వచ్చి విందుకు ఎందుకు పోలేదు?

Deshapathi Srinivas | రేవంత్‌ది విజన్ లేని పాలనే కాదు.. వజన్ లేని పాలన కూడా

Daman Tourism | ఒకప్పుడు ‘మందు’ అడ్డా.. ఇప్పుడో అద్భుతం: ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్!



