త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Police Recruitment | పోలీసు శాఖలో 1,534 ఉద్యోగాలు.. నేటి నుంచి ద‌ర‌ఖాస్తులు షురూ

Police Recruitment | పోలీసు శాఖలోని పలు విభాగాల్లో ఖాళీల భర్తీకి ఆంధ్ర‌ప‌ద్రేశ్‌ రాష్టస్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (SLPRB) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 1,534 పోస్టులకు ద‌ర‌ఖాస్తులు (Police Recruitment) ఆహ్వానిస్తున్న‌ది.

G

National | Published On Nov 27, 2026, 6.46 am IST

Police Recruitment | పోలీసు శాఖలో 1,534 ఉద్యోగాలు.. నేటి నుంచి ద‌ర‌ఖాస్తులు షురూ
Advertisement

Police Recruitment | త్రినేత్ర న్యూస్‌: పోలీసు శాఖలోని పలు విభాగాల్లో ఖాళీల భర్తీకి ఆంధ్ర‌ప‌ద్రేశ్‌ రాష్టస్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (SLPRB) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 1,534 పోస్టులకు ద‌ర‌ఖాస్తులు (Police Recruitment) ఆహ్వానిస్తున్న‌ది. ఇందులో సబ్‌ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) 378, పోలీసు కానిస్టేబుల్ (పీసీ) 1,156, ఇతర విభాగాల పోస్టులు ఉన్నాయి. ఆస‌క్తి, అర్హ‌త క‌లిగినవారు న‌వంబ‌ర్ 27 సాయంత్రం 5 గంటల నుంచి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అధికారిక వెబ్‌సైట్ slprb.ap.gov.in లో డిసెంబ‌ర్ 16 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయి. ఫిజిక‌ల్ ఫిట్‌నెస్‌, రాత‌ప‌రీక్ష ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేశారు.

మొత్తం పోస్టులు: 1534

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (సివిల్‌)- 253
రిజర్వ్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ (ఏఆర్‌)- 116
స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (పురుషులు) - 9

కానిస్టేబుల్‌ పోస్టులు

ఎస్‌సీటీ పీసీ (సివిల్‌)- 542
ఎస్‌సీటీ పీసీ (ఏఆర్‌)- 285
ఫైర్‌మెన్‌ (స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌)- 158
వార్డర్స్‌ (పురుషులు) (జైళ్లు, కరెక్షనల్‌ సర్వీసెస్‌ విభాగం)- 150
వార్డర్స్‌ (మహిళలు) (జైళ్లు, కరెక్షనల్‌ సర్వీసెస్‌ విభాగం)- 21

అర్హ‌త‌లు: ఎస్ఐ పోస్టులకు డిగ్రీ, కానిస్టేబుల్ పోస్టుల‌కు ఇంట‌ర్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్య‌ర్థులు 18 నుంచి 24 ఏండ్లలోపు వ‌య‌స్కులై ఉండాలి.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, శ‌రీర దారుఢ్య ప‌రీక్ష‌, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా.
కానిస్టేబుల్‌ పోస్టులకు ప్రిలిమినరీ రాత పరీక్ష 2027 జనవరి 31న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు.
ఎస్ఐ పోస్టులకు ఫిబ్రవరి 28న పరీక్ష ఉంటుంది. ఎస్సై పోస్టులకు పేపర్‌–1 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, పేపర్‌–2 మధ్యా­హ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు.

ఎస్ఐ (పీటీవో, కమ్యూనికేషన్‌), ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీలో సైంటిఫిక్‌ అసిస్టెంట్లు, పోలీసు కానిస్టేబుల్‌ (కమ్యూనికేషన్‌), కానిస్టేబుల్‌ (డ్రైవర్, మెకానిక్‌), డ్రైవర్‌ ఆపరేటర్‌ (ఎస్డీఆర్‌ఎఫ్‌ఎస్‌) పోస్టులకు దరఖాస్తుల తేదీలు, ఇతర వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెలిపింది.

దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో
అప్లికేష‌న్ ఫీజు: రూ.300, ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు రూ.150
దరఖాస్తులు ప్రారంభం: న‌వంబ‌ర్ 27 సాయంత్రం 5 గంటల నుంచి
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: డిసెంబర్‌ 16 సాయంత్రం 5 గంటల వరకు
వెబ్‌సైట్‌: https://slprb.ap.gov.in

Advertisement
Advertisement