SSC GD Exam | SSC GD కానిస్టేబుల్ పరీక్ష వాయిదా..
SSC GD Exam | స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అలర్ట్. ఎస్ఎస్సీ జీడీ (SSC GD) కానిస్టేబుల్ నియామక పరీక్ష (SSC GD Exam) వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23న పరీక్ష జరగాల్సి ఉంది.
SSC GD Exam | త్రినేత్ర.న్యూస్: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అలర్ట్. ఎస్ఎస్సీ జీడీ (SSC GD) కానిస్టేబుల్ నియామక పరీక్ష (SSC GD Exam) వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23న పరీక్ష జరగాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్‌ను వాయిదా వేస్తున్నట్లు ఎస్ఎస్సీ ప్రకటించింది. మళ్లీ పరీక్షను ఎప్పుడు నిర్వహిస్తామనేది SSC అధికారిక వెబ్‌సైట్ ssc.gov.inలో త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. అదేవిధంగా ఈ నియామక పరీక్షకు అభ్యర్థులకు సెల్ఫ్-స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం లేదని పేర్కొంది.

ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ ఎగ్జామ్ తేదీకి రెండు మూడు రోజుల ముందు విడుదల అవుతుంది. అభ్యర్థులు వెంటనే వారి లాగిన్ వివరాలను నమోదు చేసి అడ్మిట్ కార్డ్ లేదా సిటీ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా సీఏఎస్ఎఫ్, అస్సా రైఫిల్స్‌లో మొత్తం 25,487 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తారు. దరఖాస్తు ప్రక్రియ 2025 డిసెంబర్ 31న ముగిసింది. పోస్టుల వారీగా నియామక వివరాలు..
- బీఎస్ఎఫ్- 616 పోస్టులు
- సీఐఎస్ఎఫ్- 14595 ఖాళీలు
- సీఆర్‌పీఎఫ్- 5490 పోస్టులు
- ఎస్ఎస్‌బీ- 1764 పోస్టులు
- ఐటీబీపీ- 1293 పోస్టులు
- ఏఆర్- 1706 పోస్టులు
- ఎస్ఎస్ఎఫ్- 23 పోస్టులు
సంబంధిత వార్తలు

BJP Ramchandar Rao | ఇకనుంచి ఏ పరీక్ష పేపర్ లీకైనా 10 ఏండ్ల జైలు.. 15 కోట్ల ఫైను
జులై 25, 2026

Ex Agniveers | మాజీ అగ్నివీరులకు 50% రిజర్వేషన్లు.. ఎలాంటి పరీక్షలూ లేకుండానే పారామిలటరీ దళాల్లో చేరొచ్చు
జులై 22, 2026

NSUI Rally | నీట్ ప్రశ్నపత్రం లీక్.. ట్యాంక్‌బండ్ వద్ద ఎన్ఎస్యూఐ భారీ ర్యాలీ
జూన్ 13, 2026
తాజావార్తలు
- ●Chiranjeevi | మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ - గబ్బర్‌సింగ్ నటుడికి ఆర్థిక సాయం
- ●Smart Ration Cards | వచ్చే నెలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..!
- ●Rashmika Mandanna | కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో రష్మిక మందన్న - తొలి తెలుగు హీరోయిన్గా అరుదైన ఘనత
- ●Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..
- ●Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?

Chiranjeevi | మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ - గబ్బర్‌సింగ్ నటుడికి ఆర్థిక సాయం

Smart Ration Cards | వచ్చే నెలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..!

Rashmika Mandanna | కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో రష్మిక మందన్న - తొలి తెలుగు హీరోయిన్గా అరుదైన ఘనత

Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..



