త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SSC CPO Recruitment | డిగ్రీ అర్హ‌త‌తో ఢిల్లీ పోలీస్‌, సీఏపీఎఫ్‌లో 1871 ఎస్ఐ ఉద్యోగాలు

SSC CPO Recruitment | ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్ (CAPF)లో సబ్-ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల‌ (Sub-Inspector) నియామకాల‌కు నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. మొత్తం 1871 పోస్టుల‌ను భ‌ర్తీ (SSC CPO Recruitment) చేస్తున్న‌ది.

G

National | Published On Sep 11, 2026, 9.24 am IST

SSC CPO Recruitment | డిగ్రీ అర్హ‌త‌తో ఢిల్లీ పోలీస్‌, సీఏపీఎఫ్‌లో 1871 ఎస్ఐ ఉద్యోగాలు
Advertisement

SSC CPO Recruitment | త్రినేత్ర‌.న్యూస్‌: ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్ (CAPF)లో సబ్-ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల‌ (Sub-Inspector) నియామకాల‌కు నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. మొత్తం 1871 పోస్టుల‌ను భ‌ర్తీ (SSC CPO Recruitment) చేస్తున్న‌ది. దీనిద్వారా ఢిల్లీ పోలీసు (Delhi Police) విభాగంతో పాటు కేంద్ర సాయుధ బలగాలైన బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీలో సబ్-ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు ఉన్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులైనవారు ఈ ఉద్యోగాల‌కు అర్హులు. ఆస‌క్తి క‌లిగిన‌వారు సెప్టెంబరు 30 వ‌ర‌కు అధికారిక వెబ్‌సైట్ https://ssc.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత‌రీక్ష‌, ఫిజిక‌ల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగాల‌కు ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ప్ర‌తి నెల రూ.35,400 నుంచి రూ.1,12,400 వ‌రకు అందుకోచ్చు.

మొత్తం ఖాళీలు: 1871

  • సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ (జీడీ)- 13202
  • ఢిల్లీ పోలీసు విభాగంలో సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్)- 317 (పురుషులు 205, మహిళలు 112)
  • సబ్-ఇన్‌స్పెక్టర్ (ఫైర్‌) సీఏపీఎఫ్‌- 234 (పురుషులు మాత్ర‌మే)

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణుల‌వ్వాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. సీఏపీఎఫ్‌లో ఎస్‌ఐ (ఫైర్) పోస్టుకు సైన్స్ (ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌) డిగ్రీ లేదా సంబంధిత ఇంజినీరింగ్‌లో 3 ఏళ్ల డిప్లొమా ఉండాలి. ఢిల్లీ పోలీస్ ఎస్‌ఐ (పురుషులు) పోస్టులకు ఫిజికల్ టెస్ట్ సమయానికి ఎల్‌ఎంవీ (మోటార్ సైకిల్, కార్) లైసెన్స్ ఉండాలి. 2026 ఆగ‌స్టు 1 నాటికి సీఏపీఎఫ్‌-ఎస్‌ఐ (ఢిల్లీ పోలీస్‌)- 20 నుంచి 25 ఏండ్లు, సీఏపీఎఫ్‌ ఎస్‌ఐ(ఫైర్‌)కు- 18 నుంచి 30 ఏండ్ల‌ మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ

సీబీటీ రాత పరీక్ష, శారీరక దారుఢ్య పరీక్ష (పీఈటీ) లేదా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (సీఎస్‌టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా. రాత‌ప‌రీక్ష‌లో రెండు పేప‌ర్లు ఉంటాయి.

పేప‌ర్‌-1లో.. 100 ప్ర‌శ్న‌లు అడుగుతారు. 100 మార్కులకు ఉంటుంది. గంట‌లో ప‌రీక్ష పూర్తి చేయాలి. జ‌న‌ర‌ల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజ‌నింగ్ నుంచి 25 ప్ర‌శ్న‌లు, జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ అండ్ జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ 25, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25, ఇంగ్లిష్ కాంప్రెహెన్ష‌న్ 25 చొప్పున ప్ర‌శ్న‌లు అడుగుతారు. ప్ర‌తి సెక్ష‌న్‌కు 15 నిమిషాలు కేటాయించారు.

పేప‌ర్‌-2లో.. 160 ప్ర‌శ్న‌లు అడుగుతారు. 200 మార్కులు ఉంటాయి. 2 గంట‌ల్లో ప‌రీక్ష పూర్తి చేయాలి. జ‌న‌ర‌ల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజ‌నింగ్ నుంచి 20 ప్ర‌శ్న‌లు, జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ అండ్ జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ 20, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 20 (ప్ర‌తి సెక్ష‌న్‌కు 20 నిమిషాలు.. అంటే గంట‌లో పూర్తి చేయాలి), ఇంగ్లిష్ కాంప్రెహెన్ష‌న్ 10 చొప్పున ప్ర‌శ్న‌లు అడుగుతారు (గంట‌లో రాయాలి). ప్ర‌తి ప్ర‌శ్న‌కు 2 మార్కులు కేటాయించారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు ఫీజు: రూ.100, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తుల‌కు చివరి తేదీ: సెప్టెంబ‌ర్ 30
దరఖాస్తు సవరణ తేదీలు: అక్టోబ‌ర్ 08 నుంచి 10 వరకు
వెబ్‌సైట్‌: https://ssc.gov.in

మ‌రిన్ని వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి..

Advertisement
Advertisement