SSC CHSL | ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 2536 పోస్టులతో SSC CHSL నోటిఫికేషన్
SSC CHSL | కేంద్ర కొలువుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగార్థులకు శుభవార్త. భారత ప్రభుత్వంలోని వివిధ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ (CHSL) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
SSC CHSL | త్రినేత్ర.న్యూస్: కేంద్ర కొలువుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగార్థులకు శుభవార్త. భారత ప్రభుత్వంలోని వివిధ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ (CHSL) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా 2,536 పోస్టులను (SSC CHSL) భర్తీ చేస్తున్నది. ఇందులో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) పోస్టులు న్నాయి. ఇంటర్మీడియట్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆసక్తి కలిగినవారు ఎస్ఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in ద్వారా అక్టోబర్ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఉద్యోగం పొందినవారికి ఎల్‌డీసీ, జేఎస్‌ఏ పోస్టులకు రూ.19,900 నుంచి రూ.63,200, డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.25,500 నుంచి రూ.81,100, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్-ఎకు రూ.29,200 నుంచి రూ.92,300 ప్రతినెల జీతం వస్తుంది.
మొత్తం ఖాళీలు: 2,536
1. లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA)
2. డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO)
3. డేటా ఎంట్రీ ఆపరేటర్ (గ్రేడ్-ఏ)
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. డీఈఓ, డీఈఓ గ్రేడ్-ఏ పోస్టుల కోసం అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా తత్సమానం నుంచి గణితం ఒక సబ్జెక్టుగా సైన్స్ స్ట్రీమ్‌లో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 2026 అక్టోబర్ 1 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 1999 ఆగస్టు 2 నుంచి 2008 ఆగస్టు 1 మధ్య జన్మించిన వారై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ద్వారా. రాతపరీక్ష రెండు భాగాలుగా (టైర్-1, టైర్-2) ఉంటుంది.
టైర్-1 పరీక్షకు.. 200 మార్కులు ఉంటాయి. 100 ప్రశ్నలు అడుగుతారు. గంట వ్యవధిలో పరీక్ష పూర్తిచేయాలి. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కులు కోత విధిస్తారు.
- ఇంగ్లిష్ లాంగ్వేజ్- 25 ప్రశ్నలు, 50 మార్కులు
- జనరల్ ఇంటెలిజెన్స్- 25 ప్రశ్నలు, 50 మార్కులు
- క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్- 25 ప్రశ్నలు, 50 మార్కులు
- జనరల్ అవేర్‌నెస్- 25 ప్రశ్నలు, 50 మార్కులు
టైర్-2 పరీక్ష.. 405 మార్కులకు ఉంటుంది. నాలుగు సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్‌లో తప్పనిసరిగా అర్హత సాధించాలి. మొదటి సెక్షన్లకు నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు జవాబుకు 1 మార్క్ కోత విధిస్తారు. ఇందులో మ్యాథమేటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యుల్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు ఫీజు: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు లేదు
దరఖాస్తుకు చివరి తేదీ: 2026 అక్టోబర్ 7
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 2026 అక్టోబర్ 8
అప్లికేషన్ కరెక్షన్ విండో: అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 16
వెబ్‌సైట్: ssc.gov.in
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Horoscope | సెప్టెంబర్ 9 రాశిఫలాలు.. అతిగా విశ్లేషించి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు!
- ●రాజకీయం వేడెక్కాలి.. రాష్ట్రం కాదు: అధికార పక్షం దూకుడుపై విశ్లేషణ!
- ●Osmania University | బేగంపేట నిఖితకు ఐదు గోల్డ్ మెడల్స్
- ●Fire Accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం
- ●MLA Sanjay | డీసీపీ శిల్పవల్లి గారు.. సీఎం అంటే సంస్కారహీనుడు.. నీకు ఏమైందమ్మా సంస్కారం..?
- ●Vinod Kumar | రానున్న రోజుల్లో కేబినెట్ నుంచి ఇంకెంత మంది పోతారో..?

Horoscope | సెప్టెంబర్ 9 రాశిఫలాలు.. అతిగా విశ్లేషించి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు!

రాజకీయం వేడెక్కాలి.. రాష్ట్రం కాదు: అధికార పక్షం దూకుడుపై విశ్లేషణ!

Osmania University | బేగంపేట నిఖితకు ఐదు గోల్డ్ మెడల్స్

Fire Accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం






