ARCI | ఏఆర్‌సీఐలో అసిస్టెంట్, టెక్నీషియన్ ఉద్యోగాలు..
ARCI | హైదరాబాద్‌లోని అంతర్జాతీయ అధునాతన పరిశోధన కేంద్రం ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటల్లర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ARCI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిఫిక్, టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్, సపోర్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ARCI | త్రినేత్ర న్యూస్: హైదరాబాద్‌లోని అంతర్జాతీయ అధునాతన పరిశోధన కేంద్రం ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటల్లర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ARCI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిఫిక్, టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్, సపోర్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 29 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. అర్హులైనవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోచ్చు. నవంబర్ 21న గడువు ముగియనుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. నెలకు రూ.39,970 నుంచి రూ.1,18,110 వరకు జీతం ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 29
ఇందులో సైంటిస్ట్- బీ 4, ఆఫీసర్-బీ 1, టెక్నికల్ అసిస్టెంట్-ఏ 7, అసిస్టెంట్-ఏ 6, టెక్నీషియన్- ఏ 9, డ్రైవర్-ఏ- 2
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుంచి టెన్త్, ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రిషియన్ ట్రేడ్‌లో ఐటీఐ. సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీలో బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంబీఏ ఫైనాన్స్ ఉత్తీర్ణులై ఉండాలి. 27 నుంచి 56 ఏండ్ల మధ్య వయస్కులవ్వాలి..
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CWE), ట్రేడ్ లేదా స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా. పరీక్ష 300 మార్కులకు ఉంటుంది. 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. 3 గంటల్లో పరీక్ష పూర్తి చేయాలి. పరీక్ష కేంద్రం హైదరాబాద్‌లో మాత్రమే ఉంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ఫీజు: సైంటిస్ట్, ఆఫీసర్ పోస్టులకు రూ.600, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, మహిళలు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు రూ.400. మిగిలిన పోస్టులకు రూ.500, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, మహిళలు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు రూ.300.
దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 21
వెబ్‌సైట్: https://arci.res.in/careers/vacancies
సంబంధిత వార్తలు

Headquarters Bar and Restaurant | బిల్లు డబ్బులు తిరిగివ్వకుంటే కాల్చేస్తా.. బార్లో రివాల్వర్‌తో యువకుడి వార్నింగ్
అక్టోబర్ 24, 2026

Sunil Bansal | హైదరాబాద్ ఆఫీస్‌లో తిరిగితే సరిపోదు.. నియోజకవర్గాలకెళ్లి పని చేసుకోండి
అక్టోబర్ 24, 2026

Protest against SIR | సర్‌కు వ్యతిరేకంగా భారీ నిరసన.. ఓటర్ల తొలగింపుపై నినాదాలు
అక్టోబర్ 24, 2026
తాజావార్తలు
- ●Horoscope | అక్టోబర్ 25 రాశిఫలాలు.. ఈ రాశివారు గృహ సౌఖ్యాన్ని ఆస్వాదిస్తారు!
- ●Headquarters Bar and Restaurant | బిల్లు డబ్బులు తిరిగివ్వకుంటే కాల్చేస్తా.. బార్లో రివాల్వర్‌తో యువకుడి వార్నింగ్
- ●Sunil Bansal | హైదరాబాద్ ఆఫీస్‌లో తిరిగితే సరిపోదు.. నియోజకవర్గాలకెళ్లి పని చేసుకోండి
- ●HMWSSB | మొదటిసారి రూ.5 వేల జరిమానా.. రెండోసారైతే రిజిస్ట్రేషన్ రద్దే ఇక
- ●Telangana | తెలంగాణ సంస్కృతిని అర్థం చేసుకోవడానికి సంస్కారం కావాలి - 'ఇడుపుకాయితం' విమర్శలపై దర్శకుడి కౌంటర్
- ●Protest against SIR | సర్‌కు వ్యతిరేకంగా భారీ నిరసన.. ఓటర్ల తొలగింపుపై నినాదాలు

Horoscope | అక్టోబర్ 25 రాశిఫలాలు.. ఈ రాశివారు గృహ సౌఖ్యాన్ని ఆస్వాదిస్తారు!

Headquarters Bar and Restaurant | బిల్లు డబ్బులు తిరిగివ్వకుంటే కాల్చేస్తా.. బార్లో రివాల్వర్‌తో యువకుడి వార్నింగ్

Sunil Bansal | హైదరాబాద్ ఆఫీస్‌లో తిరిగితే సరిపోదు.. నియోజకవర్గాలకెళ్లి పని చేసుకోండి

HMWSSB | మొదటిసారి రూ.5 వేల జరిమానా.. రెండోసారైతే రిజిస్ట్రేషన్ రద్దే ఇక



