త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Speeding Truck | బాలిక‌ను ఢీకొట్టి.. ఆపై పోలీసుల‌పైకి దూసుకెళ్లి.. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో లారీ బీభ‌త్సం

Speeding Truck | ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని మొహ్లా మాన్‌పూర్ జిల్లాలో లారీ బీభ‌త్సం (Speeding Truck) సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన లారీ గుంద‌ర్‌దేహీ (Gundardehi) గ్రామంలో 11 ఏండ్ల బాలిక‌ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయ‌ప‌డిన బాలిక‌ అక్క‌డిక‌క్క‌డే మృతిచెందింది.

G

National | Published On Jun 27, 2026, 11.38 am IST

Speeding Truck | బాలిక‌ను ఢీకొట్టి.. ఆపై పోలీసుల‌పైకి దూసుకెళ్లి.. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో లారీ బీభ‌త్సం
Advertisement

Speeding Truck | త్రినేత్ర‌.న్యూస్‌: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని మొహ్లా మాన్‌పూర్ జిల్లాలో లారీ బీభ‌త్సం (Speeding Truck) సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన లారీ గుంద‌ర్‌దేహీ (Gundardehi) గ్రామంలో 11 ఏండ్ల బాలిక‌ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయ‌ప‌డిన బాలిక‌ అక్క‌డిక‌క్క‌డే మృతిచెందింది. అయిన‌ప్ప‌టికీ లారీని ఆప‌కుండా డ్రైవ‌ర్ అలాగే వెళ్లిపోయాడు. దీంతో స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు ర‌హ‌దారి వెంట ప‌లుచోట్ల బారికేడ్లు (Police Barricades) ఏర్పాటు చేశాసి లారీని ఆపేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే బారికేడ్ల‌పై నుంచే లారీ తీసుకెళ్లిన డ్రైవ‌ర్ మ‌హారాష్ట్ర (Maharashtra) వైపు వెళ్లిపోయాడు. దీంతో 60 కిలోమీట‌ర్ల దూరంపాటు లారీని వెంటాడిన పోలీసులు.. ఎట్ట‌కేల‌కు డ్రైవ‌ర్‌ను అరెస్టు చేశారు. మృతిచెందిన బాలిక‌ను పూణ‌మ్ (Poonam) గా గుర్తించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది.

Advertisement
Advertisement