Droupadi Murmu | ఆ సబ్‌మెరైన్‌లో ప్రయాణించిన ద్రౌపది ముర్ము.. తొలి రాష్ట్రపతిగా రికార్డ్
ఐఎన్ఎస్ వాఘ్‌షీర్ సబ్‌మెరైన్‌ను కల్వరి క్లాస్ సబ్‌మెరైన్ అంటారు. ఇది డీజిల్, ఎలక్ట్రిసిటీతో నడుస్తుంది. దీన్ని ముంబైలోని మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్లు నిర్మించారు. ఫ్రాన్స్‌కి చెందిన నేవీ గ్రూప్ ద్వారా లైసెన్స్ తీసుకొని ఈ సబ్‌మెరైన్‌ని నిర్మించారు.
Droupadi Murmu | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సరికొత్త రికార్డు నెలకొల్పారు. భారత్‌కి చెందిన జలాంతర్గామి ఐఎన్ఎస్ వాఘ్‌షీర్(S26) లో ప్రయాణించారు. భారత్‌కి చెందిన కల్వరీ క్లాస్‌కి చెందిన ఆరో సబ్‌మెరైన్ అది. కర్ణాటకలోని కర్వార్ నావల్ బేస్ నుంచి ఈ సబ్‌మెరైన్‌లో ఆమె ప్రయాణించారు. భారత నేవీకి చెందిన పలువురు ఆఫీసర్లు, నేవీ స్టాఫ్ చీఫ్ దినేశ్ కే త్రిపాఠి సారథ్యంలో సముద్ర అంతర్గామి ప్రయాణాన్ని రాష్ట్రపతి విజయవంతంగా చేశారు. కల్వరీ క్లాస్‌కి చెందిన సబ్‌మెరైన్‌లో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా ఆమె నిలిచారు. ఇప్పటికే 2006 లో ఏపీలోని విశాఖపట్టణంలో మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్ కలాం జలాంతర్గామిలో ప్రయాణించారు. కలాం తర్వాత సబ్‌మెరైన్‌లో ప్రయాణించిన రెండో రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రికార్డు నెలకొల్పారు.
ఇప్పటికే ద్రౌపది ముర్ము భారత ఎయిర్ ఫోర్స్‌కి చెందిన రెండు ఫైటర్ జెట్‌లలో ప్రయాణించారు. ఏప్రిల్ 2023 లో సుఖోయ్ ఎస్‌యూ 30 ఎంకేఐ ఫైటర్ జెట్‌లో అస్సాంలోని తేజ్‌పూర్‌లో ఉన్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో ప్రయాణించారు.

ఆ తర్వాత 29 అక్టోబర్ 2025 న రాఫెల్ ఫైటర్ జెట్‌లో ప్రయాణించారు. హర్యానాలోని అంబాలాలో ఉన్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో రాష్ట్రపతి ఈ ఫైటర్ జెట్‌ని ఎక్కారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన రెండు యుద్ధ విమానాల్లో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా ఆమె మరో రికార్డు నెలకొల్పారు.
ఐఎన్ఎస్ వాఘ్‌షీర్ ప్రత్యేకత ఏంటి?
ఐఎన్ఎస్ వాఘ్‌షీర్ సబ్‌మెరైన్‌ను కల్వరి క్లాస్ సబ్‌మెరైన్ అంటారు. ఇది డీజిల్, ఎలక్ట్రిసిటీతో నడుస్తుంది. దీన్ని ముంబైలోని మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్లు నిర్మించారు. ఫ్రాన్స్‌కి చెందిన నేవీ గ్రూప్ ద్వారా లైసెన్స్ తీసుకొని ఈ సబ్‌మెరైన్‌ని నిర్మించారు. సముద్ర ఉపరితలం, లోపల జరిగే ఆపరేషన్ల కోసం దీన్ని ఇండియన్ నేవీ ఉపయోగిస్తుంది. ఐఎస్ఆర్ మిషన్స్ కోసం కూడా దీన్ని వినియోగిస్తారు.
సంబంధిత వార్తలు

Keralam Election Results | కాంగ్రెస్‌కు బూస్ట్.. కేరళంలో యూడీఎఫ్ కూటమి జయకేతనం..!
మే 4, 2026

Raghav Chadha | రాష్ట్రపతిని కలువనున్న రాఘవ్ చద్దా.. పంజాబ్ ఆప్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసేందుకే..!
మే 3, 2026

Onion Capital of India | భారతదేశపు ఉల్లిగడ్డల రాజధాని అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?
మే 2, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



