త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Encounter | పోలీసులు, గ్యాంగ్‌స్ట‌ర్ల మ‌ధ్య భీక‌ర కాల్పులు.. న‌లుగురు నేర‌స్థులు హ‌తం

Encounter | గురుగ్రామ్ (Gurugram)లో పోలీసులు, గ్యాంగ్‌స్ట‌ర్ల మ‌ధ్య భీక‌ర పోరు జ‌రిగింది. ఇరు వ‌ర్గాలు 60 రౌండ్ల కాల్పులు జ‌రుపుకున్నారు. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో దీప‌క్ నంద‌ల్ ముఠాకు (Deepak Nandal Gang) చెందిన న‌లుగురు నేర‌స్థులు హ‌త‌మ‌య్యారు. ముగ్గురు పోలీసులు గాయ‌ప‌డ్డారు.

D

National | Published On Jul 10, 2026, 11.20 am IST

Encounter | పోలీసులు, గ్యాంగ్‌స్ట‌ర్ల మ‌ధ్య భీక‌ర కాల్పులు.. న‌లుగురు నేర‌స్థులు హ‌తం
Advertisement

Encounter | హ‌ర్యాణాలోని గురుగ్రామ్ (Gurugram)లో తుపాకుల మోత మోగింది. గురువారం రాత్రి పోలీసులు, గ్యాంగ్‌స్ట‌ర్ల మ‌ధ్య భీక‌ర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇరు వ‌ర్గాలు ఏకంగా 60 రౌండ్ల కాల్పులు జ‌రుపుకున్నారు. ఈ ఎన్‌కౌంట‌ర్ (Encounter)లో గ్యాంగ్‌స్ట‌ర్ దీప‌క్ నంద‌ల్ ముఠాకు (Deepak Nandal Gang) చెందిన న‌లుగురు నేర‌స్థులు హ‌త‌మ‌య్యారు. ముగ్గురు పోలీసులు గాయ‌ప‌డ్డారు.

గురుగ్రామ్ క్రైమ్ బ్రాంచ్‌ పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. గురుగ్రామ్‌లోని సుశాంత్ లోక్ ఫేజ్-2 ప్రాంతంలో (Sushant Lok Phase-2 area) ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. రాత్రి 9:30 గంట‌ల స‌మ‌యంలో కొంద‌రు సాయుధులు ఎస్‌యూవీ వాహ‌నంలో అనుమానాస్ప‌దంగా వెళ్తున్న‌ట్లు క్రైమ్ బ్రాంచ్‌కి స‌మాచారం అందింది. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన పోలీసు బృందాలు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్నారు. అక్క‌డ సాయుధులు ఓ వ్యాపార‌వేత్త ఇంటిపై కాల్పులు జ‌రిపేందుకు ప్ర‌య‌త్నించారు.

అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు నిందితుల‌ను చుట్టుముట్టారు. లొంగిపోవాల‌ని కోర‌గా.. నిందితులు త‌ప్పించుకునేందుకు పోలీసుల‌పై విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపారు. పోలీసులు సైతం ఎదురు కాల్పులకు దిగారు. రెండు వ‌ర్గాల మ‌ధ్య కాసేపు తీవ్ర పోరు సాగింది. దాదాపు 60 రౌండ్ల కాల్పులు జ‌రిగాయి. ఈ కాల్పుల్లో నంద‌ల్ గ్యాంగ్‌కు చెందిన ఐదుగురికి బుల్లెట్ గాయాల‌య్యాయి. పోలీసులు వారిని స‌మీపంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే, వారిలో న‌లుగురు అప్ప‌టికే ప్రాణాలు కోల్పోయిన‌ట్లు వైద్యులు తెలిపారు. మ‌రో నిందితుడు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక ఈ ఎన్‌కౌంట‌ర్‌లో ముగ్గురు పోలీసు సిబ్బందికి కూడా బుల్లెట్ గాయాల‌య్యాయి. వారికి కూడా ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘ‌ట‌న‌పై చ‌ట్ట‌ప్ర‌కారం త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు పోలీసులు ఈ సంద‌ర్భంగా తెలిపారు. ఎన్‌కౌంట‌ర్‌లో హ‌త‌మైన‌, గాయ‌ప‌డిన నిందితుల వివ‌రాలు, వారి నేర చ‌రిత్ర‌కు సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని చెప్పారు. నిందితుల నుంచి ఐదు విదేశీ త‌యారీ పిస్ట‌ళ్ల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు వివ‌రించారు.

Advertisement
Advertisement