NPCIL | న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో టెక్నీషియన్ పోస్టులు.. 15 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు షురూ..
NPCIL | తమిళనాడులోని కుడంకుళంలో (Kudankulam) ఉన్న న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) వివిధ విభాగాల్లో స్టైపెండరీ ట్రైనీ (Stipendiary Trainee), టెక్నీషియన్ ఖాళీల (Technician)భర్తీకి దరఖాస్తులు కోరుతున్నది.
NPCIL | త్రినేత్ర.న్యూస్: తమిళనాడులోని కుడంకుళంలో (Kudankulam) ఉన్న న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) వివిధ విభాగాల్లో స్టైపెండరీ ట్రైనీ (Stipendiary Trainee), టెక్నీషియన్ ఖాళీల (Technician)భర్తీకి దరఖాస్తులు కోరుతున్నది. అర్హులైనవారు ఆగస్టు 4 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. అకడమిక్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రెండేండ్ల పాటు శిక్ష ఇస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని టెక్నీషియన్- బీగా పరిగణిస్తారు. శిక్షణ కాలంలో మొదటి ఏడాది ప్రతినెల రూ.20 వేలు, రెండో సంవత్సరం రూ.22 వేలు చెల్లిస్తారు. ప్లాంట్ ఆపరేటర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, వెల్డర్ వంటి ఖాళీలు ఉన్నాయి.
మొత్తం ఖాళీలు: 225
ఇందులో జనరల్ 85, ఓబీసీ 77, ఈడబ్ల్యూఎస్ 20, ఎస్సీ 25, ఎస్టీ 19 చొప్పున ఉన్నాయి.
అర్హతలు
ప్లాంట్ ఆపరేటర్: 50 శాతం మార్కులతో 10+2 లేదా ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఐఎస్‌సీ ఉత్తీర్ణులై ఉండాలి.
మిగిలిన ఖాళీలకు 50 శాతం మార్కులతో పదో తరగతి, రెండేండ్ల ఐటీఐ చేసి ఉండాలి. కోర్సు అనంతరం సంబంధిత ట్రేడ్‌లో ఏడాదిపాటు పనిచేసిన అనుభవం తప్పనిసరి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్లు ప్రారంభం: జూలై 15
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 4
వెబ్‌సైట్: npcilcareers.co.in or npcil.nic.in
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●BC Reservations | ప్రతి కులానికి ‘యూనిక్ కోడ్’ కేటాయించాల్సిందే
- ●Nepal | మూడు రోజులుగా వరద బురదలోనే.. అయినా బతికింది..
- ●Gosula Srinivas Yadav | ఉద్యమకారులను బెదిరిస్తే తగిన బుద్ధి చెబుతాం : గోసుల శ్రీనివాస్ యాదవ్
- ●Uttam Kumar Reddy | ప్రజాస్వామ్యం, సంక్షేమం, అభివృద్ధికి వెయ్యి రోజులు
- ●CV Anand | డీజీపీ సీవీ ఆనంద్ సెంచరీ..
- ●NEET PG | నీట్-పీజీ ఆల్ ఇండియా కోటాను 50 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలి

BC Reservations | ప్రతి కులానికి ‘యూనిక్ కోడ్’ కేటాయించాల్సిందే

Nepal | మూడు రోజులుగా వరద బురదలోనే.. అయినా బతికింది..

Gosula Srinivas Yadav | ఉద్యమకారులను బెదిరిస్తే తగిన బుద్ధి చెబుతాం : గోసుల శ్రీనివాస్ యాదవ్

Uttam Kumar Reddy | ప్రజాస్వామ్యం, సంక్షేమం, అభివృద్ధికి వెయ్యి రోజులు






