CV Anand | ఆ అధికారిని సస్పెండ్ చేయండి.. సైబరాబాద్ సీపీకి డీజీపీ ఆదేశం..
CV Anand | నిర్లక్ష్యంగా ఆరేండ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తూ ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం కలిగించిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్ (CV Anand) ఆదేశించారు. అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ సీపీ (Cyberabad CP) డాక్టర్ ఎం. రమేశ్‌కి సూచించారు.
CV Anand | త్రినేత్ర.న్యూస్: నిర్లక్ష్యంగా ఆరేండ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తూ ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం కలిగించిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్ (CV Anand) ఆదేశించారు. అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ సీపీ (Cyberabad CP) డాక్టర్ ఎం. రమేశ్‌కి సూచించారు.

మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని అవగాహన కల్పించాల్సిన ఓ ఎస్ఐ రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్షాకోట్ డివిజన్ గంధంగూడలో తన మనవరాలితో కారును నడిపించారు. దీంతో గంధంగూడ-బైరాగిగూడ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డుపై ఓ కారు అస్తవ్యస్తంగా వెళ్లుండటంతో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతున్నది. దీంతో కారు వద్దకు వెళ్లి చూడగా డ్రైవింగ్ సీటులో ఓ బాలిక ఉండటం చూసి ఆశ్చర్యపోయన తోటి వాహనదారులు.. బాలికతో డ్రైవింగ్ చేయించడం సరికాదని సూచించారు. దీంతో ఆ బాలిక `మా తాత పోలీస్.. మీకేంటి? మమ్మల్ని ఆపడానికి మీరెవరు?` అని ప్రశ్నించింది.
A police officer faced the ire of the public after he was caught with his minor granddaughter who was behind the wheel in Hyderabad.
The incident occurred on Sunday on the Gandhamguda–Bairagiguda main road, which falls under Cyberabad Traffic Police limits. The child was driving… pic.twitter.com/BG3IzKaGzV
— The Siasat Daily (@TheSiasatDaily) July 12, 2026
పక్క సీటులో ఉన్న సదరు ఎస్ఐని కూడా నిలదీయగా.. ఇది ఆటో గేర్ కారు. పూర్తిగా నా కంట్రోల్‌లోనే ఉంది అంటూ నిర్లక్ష్యంగా బదులిచ్చాడు. కారు చిన్నారి నడిపినా ఎలాంటి ప్రమాదం జరగలేదు కదా? అని బాధ్యత మరిచి మాట్లాడాడు. చివరకు వాహనదారులందరూ ఎస్ఐని నిలదీయడంతో.. `నా ఇష్టం, నన్ను అడగడానికి మీరెవరు` అంటూ దబాయించాడు. జనం తమ ఫోనులో దీనిని చిత్రీకరిస్తుండగా.. కారు నంబర్ కూడా రికార్డు చేసుకో అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో నార్సింగ్ పోలీసులు సుమోటాగా తీసుఉని బీఎన్ఎస్ సెక్షన్ 125, మోటారు వాహనాల చట్టం 180, 184 కింద కేసు నమోదుచేశారు. కాగా, మనవరాలితో కారు నడిపించిన తాతను పుజారి తిరుపతిగా (Pujari Thirupathi) గుర్తించారు. ఆయన నగరంలోని ఓ పీఎస్‌లో సబ్ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు.
I have asked the @CPCyberabad to suspend the concerned officer and start a departmental enquiry on this indiscretion. https://t.co/nqnBfxC4qm
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) July 13, 2026
సంబంధిత వార్తలు

Rangareddy | ఎస్ఐ నిర్వాకం.. మెయిన్ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్
జులై 12, 2026

DGP CV Anand | ప్రజలకు చేరువగా పోలీసింగ్.. సాంకేతికతతో సమర్థవంతమైన సేవలు : డీజీపీ సీవీ ఆనంద్
జులై 3, 2026

Hyderabad | ఈగల్ టీమ్ శ్రమ వృథా.. 30 రోజులు గాలించి పట్టుకుంటే.. తెల్లారేసరికి నిందితుడు పరార్
జులై 2, 2026
తాజావార్తలు
- ●Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!

Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం



