Hyderabad | కూతురికి మాటలు రావట్లేదని.. 12వ అంతస్తు పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య
Hyderabad | హైదరాబాద్‌లోని (Hyderabad) కొండాపూర్‌లో విషాదం చోటుచేసుకున్నది. ఆరేండ్ల కూతురికి మాటలు రావడం లేదని మనస్థాపానికి గురైన ఓ మహిళ 12వ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నది.
Hyderabad | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లోని (Hyderabad) కొండాపూర్‌లో విషాదం చోటుచేసుకున్నది. ఆరేండ్ల కూతురికి మాటలు రావడం లేదని మనస్థాపానికి గురైన ఓ మహిళ 12వ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నది.
బీహార్‌కు చెందిన అన్మోల్ కుమార్, అపర్ణ అన్మోల్ అరుణ్ (36) దంపతులు కొండాపూర్ (Kondapur) ఎస్‌ఎంఆర్ వినయ్ ఐకానియా అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్నారు. అన్మోల్ ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్నారు. అపర్ణ గృహిణి. వారికి ఆరేండ్ల కుమార్తె ఉన్నది. ఆమె ఆటిజంతో బాధపడుతున్నది. కుమార్తె విషయంలో భార్యభర్తలు తరచూ గొడవ పడేవారు. ఈ క్రమంలో మనస్థాపంతో అపర్ణ అపార్టుమెంటు (Apartment) 12వ అంతస్తు పైనుంచి దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఘటన జరిగిన సమయంలో అన్మోల్ ఇంట్లోనే ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. కుమార్తెకు మాటలు రాకపోవడంతో అపర్ణ తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉందని, ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

కాగా, అపర్ణ సోదరుడు అవినాశ్ ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో తన బావపై ఎలాంటి అనుమానం లేదని అందులో పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | మట్టి కుండలోనే బోనం చేద్దాం.. చేతివృత్తులను ప్రోత్సహిద్దాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Alka Lamba | బీజేపీది.. చందా చోర్ సర్కార్.. మహిళా వ్యతిరేక సర్కార్
- ●Drunk and Drive | సైబరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్.. 190 మందిపై కేసులు
- ●Vande Bharat Express | భారీ వర్షాలకు నీట మునిగిన పట్టాలు.. దూసుకెళ్లిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. వీడియో
- ●KTR | బీఆర్ఎస్ కన్నేపల్లి పంప్‌హౌస్ సందర్శన.. కేటీఆర్ బృందాన్ని జనగామ వద్ద అడ్డుకున్న పోలీసులు
- ●Drinking Water | నేడు, రేపు ఈ ప్రాంతాల్లో మంచి నీళ్లు బంద్..

Ponnam Prabhakar | మట్టి కుండలోనే బోనం చేద్దాం.. చేతివృత్తులను ప్రోత్సహిద్దాం: మంత్రి పొన్నం ప్రభాకర్

Alka Lamba | బీజేపీది.. చందా చోర్ సర్కార్.. మహిళా వ్యతిరేక సర్కార్

Drunk and Drive | సైబరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్.. 190 మందిపై కేసులు

Vande Bharat Express | భారీ వర్షాలకు నీట మునిగిన పట్టాలు.. దూసుకెళ్లిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. వీడియో





