Fire Accident | కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగసిపడిన మంటలు..
Fire Accident | హైదరాబాద్ కూకట్‌పల్లిలోని (Kukatpally) ఆస్బెస్టాస్ కాలనీలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident ) జరిగింది. సోమవారం తెల్లవారుజామున పేపర్ టీ కప్పులు, ప్లేట్స్ తయారుచేసే కంపెనీలో (Paper Tea Cup Industry) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Fire Accident | త్రినేత్ర న్యూస్: హైదరాబాద్ కూకట్‌పల్లిలోని (Kukatpally) ఆస్బెస్టాస్ కాలనీలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident ) జరిగింది. సోమవారం తెల్లవారుజామున పేపర్ టీ కప్పులు, ప్లేట్స్ తయారుచేసే కంపెనీలో (Paper Tea Cup Industry) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి కంపెనీ మొత్తం వ్యాపించాయి. దీంతో పక్కనే ఉన్న నెయ్యి, కుర్‌కురే, హల్దీరామ్ స్టాక్ గోదాములకు విస్తరించడంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగ కమ్మేసింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. నాలుగు ఫైర్‌ఇంజిన్లతో మంటలు అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్‌తో (Short Circuit) ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ, భారీగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- ●Horoscope | నవంబర్ 9 రాశిఫలాలు.. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త!
- ●Nalgonda Fake Death Certificate Scam | రిటైర్డ్ ఉద్యోగి డ్యూటీలోనే చనిపోయినట్లు ఫేక్ డెత్ సర్టిఫికెట్.. రూ.16 లక్షల డీల్.. ప్రభుత్వ జాబ్ కొట్టారు
- ●Nagole Missing Boys | నాగోల్‌లో ఇద్దరు చిన్నారుల మిస్సింగ్ కేసు.. 9 రోజులైనా దొరకని ఆచూకీ, రూ.20 వేల రివార్డ్!
- ●Naroda Murder Case | "కూర రుచిగా లేదు" అన్నందుకు ఇంత దారుణమా? కిచెన్ నైఫ్‌తో పొడిచి భర్త ప్రాణం తీసిన భార్య!
- ●Telangana Schools 5 Day Week | తెలంగాణలో ఇకపై వారానికి 5 రోజులే స్కూళ్లు?
- ●Colonel Tarunendra Pratap Singh | ఎవరీ కల్నల్ తరుణేంద్ర ప్రతాప్ సింగ్? ఐరాసలో ప్రసంగం కంటే.. చేతి మచ్చలే వైరల్..!

Horoscope | నవంబర్ 9 రాశిఫలాలు.. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త!

Nalgonda Fake Death Certificate Scam | రిటైర్డ్ ఉద్యోగి డ్యూటీలోనే చనిపోయినట్లు ఫేక్ డెత్ సర్టిఫికెట్.. రూ.16 లక్షల డీల్.. ప్రభుత్వ జాబ్ కొట్టారు

Nagole Missing Boys | నాగోల్‌లో ఇద్దరు చిన్నారుల మిస్సింగ్ కేసు.. 9 రోజులైనా దొరకని ఆచూకీ, రూ.20 వేల రివార్డ్!

Naroda Murder Case | "కూర రుచిగా లేదు" అన్నందుకు ఇంత దారుణమా? కిచెన్ నైఫ్‌తో పొడిచి భర్త ప్రాణం తీసిన భార్య!






