త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Deepavali Celebrations | దీపాలు వెలిగించి, ప‌టాకులు కాల్చి.. స్మ‌శానంలో దీపావ‌ళి వేడుక‌లు

Deepavali Celebrations | సాధార‌ణంగా దీపావ‌ళి పండుగను (Deepavali Celebrations) పిల్లా పాప‌ల‌తో క‌లిసి ఇంట్లో జ‌రుపుకుంటాం. ఇంటిముందు దీపాలు వెలిగించి, ప‌టాకులు కాల్చి సంతోషాన్ని పంచుకుంటాం. కానీ ఈ ఊరి జ‌నాలు మాత్రం వినూత్నంగా వెలుగుల‌ పండుగ చేసుకుంటున్నారు.

G

Telangana | Published On Nov 9, 2026, 8.04 am IST

Deepavali Celebrations | దీపాలు వెలిగించి, ప‌టాకులు కాల్చి.. స్మ‌శానంలో దీపావ‌ళి వేడుక‌లు
Advertisement

Deepavali Celebrations | త్రినేత్ర న్యూస్‌: సాధార‌ణంగా దీపావ‌ళి పండుగను (Deepavali Celebrations) పిల్లా పాప‌ల‌తో క‌లిసి ఇంట్లో జ‌రుపుకుంటాం. ఇంటిముందు దీపాలు వెలిగించి, ప‌టాకులు కాల్చి సంతోషాన్ని పంచుకుంటాం. కానీ ఈ ఊరి జ‌నాలు మాత్రం వినూత్నంగా వెలుగుల‌ పండుగ చేసుకుంటున్నారు. త‌మ పూర్వీకుల‌ను స్మ‌రించుకుంటూ స్మ‌శాన వాటిక‌ల్లోని (Graveyard) స‌మాధుల వ‌ద్ద దీపాలు వెలిగించి, ప‌టాకులు కాల్చారు. పెద్ద‌ల స‌మాధుల వ‌ద్ద వారికి ఇష్ట‌మైన ఆహార పదార్థాలను సమర్పిస్తారు. ఇది త‌ర‌త‌రాలుగా త‌మ‌కు సంప్ర‌దాయంగా వ‌స్తున్న ఆచార‌మ‌ని చెబుతున్నారు. ఇదంతా ఎక్క‌డ అంటారా??.. క‌రీంన‌గ‌ర్ జిల్లా కేంద్రంలోని కార్ఖానా గ‌డ్డ‌లో..

 

ప‌ట్ట‌ణంలోని కార్ఖానా గడ్డలో రెండు పెద్ద స్మశాన వాటికలు ఉన్నాయి. ఈ స్మశాన వాటికలు కిసాన్ నగర్, పసుల నారాయణ కాలనీ తదితర ప్రాంతాల్లో చనిపోయిన వారిని ఇక్కడ అంత్యక్రియ నిర్వహిస్తారు. సాధారణంగా పితృ అమావాస్య సందర్భంగా పెద్దలకు బియ్యం ఇవ్వడం ఆనవాయితీ. కానీ ఇక్కడ మాత్రం దీపావళి పర్వదినం సందర్భంగా పెద్దలను గుర్తు చేసుకుంటారు.

 

ముందుగానే సమాధులని శుభ్రం చేసి, రంగులు వేస్తారు. దీపావళి పండుగ రోజు సాయంత్రం కుటుంబ సభ్యులు అంతా వచ్చి పెద్దలను గుర్తు చేసుకుంటారు. దీపాలు వెలిగించి, వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను సమాధుల వద్ద పెడతారు. అక్కడే ప‌టాకులు కాల్చుతారు. చాలా ఏండ్లుగా ఈ సాంప్రదాయం కొనసాగుతున్న‌ద‌ని, పెద్ద‌ల‌ను గుర్తుచేసుకుంటామ‌ని అక్క‌డికి వ‌చ్చిన కుటుంబాలు వెల్ల‌డించాయి.

Advertisement
Advertisement