త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Eye Injuries | ప‌టాకులు కాల్చుతూ.. 48 మందికి కంటి గాయాలు..

Eye Injuries | దీపావ‌ళి పండుగ‌వేళ హైద‌రాబాద్‌లోని ప‌లుచోట్ల అగ్నిప్ర‌మాదాలు (Fire Accident) జ‌రిగాయి. బేగంబ‌జార్‌, కూక‌ట్‌ప‌ల్లి, జీడిమెట్ల‌, మైలార్‌దేవ్‌ప‌ల్లిలో ప్ర‌మాదాలు చోటుచేసుకున్నాయి. ఇక ప‌టాకులు కాల్చుతూ ప‌లువురు ప్ర‌మాదాలకు గుర‌య్యారు.

G

Hyderabad | Published On Nov 9, 2026, 8.38 am IST

Eye Injuries | ప‌టాకులు కాల్చుతూ.. 48 మందికి కంటి గాయాలు..
Advertisement

Eye Injuries | త్రినేత్ర న్యూస్‌: దీపావ‌ళి పండుగ‌వేళ హైద‌రాబాద్‌లోని ప‌లుచోట్ల అగ్నిప్ర‌మాదాలు (Fire Accident) జ‌రిగాయి. బేగంబ‌జార్‌, కూక‌ట్‌ప‌ల్లి, జీడిమెట్ల‌, మైలార్‌దేవ్‌ప‌ల్లిలో ప్ర‌మాదాలు చోటుచేసుకున్నాయి. ఇక ప‌టాకులు కాల్చుతూ ప‌లువురు ప్ర‌మాదాలకు గుర‌య్యారు. కంటి గాయాల‌తో (Eye Injuries) ప‌లువురు బాధితులు స‌రోజినీ దేవి కంటి ద‌వాఖాన‌కు (Sarojinidevi Eye Hospital) క్యూ క‌ట్టారు. బాంబులు పేల్చుతూ 48 మంది కంటి గాయాల‌తో హాస్పిట‌ల్‌కు వ‌చ్చిన‌ట్లు వైద్యులు వెల్ల‌డించారు. వారిలో 10 మంది మందికి చికిత్స అందిస్తున్నామ‌ని చెప్పారు. మిగిలిన‌వారికి మందులు ఇచ్చి, తదుపరి చికిత్స కోసం తిరిగి రావాలని సూచిన‌ట్లు ద‌వాఖాన ఆర్ఎంఓ డాక్టర్ ఇబ్రహీం తెలిపారు. చికిత్స పొందుతున్న వారిలో చిన్నారులు, పెద్దలు ఉన్నారని చెప్పారు. వీరిలో ఒకరు బాణసంచా (Firecracker) కారణంగా తన కుడి కంటిచూపును పూర్తిగా కోల్పోయారన్నారు.

సోమ‌వారం ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు హాస్పిట‌ల్‌లో చికిత్స అందించిన వారి సంఖ్య ఇద‌ని.. మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. వారికి చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉందని డాక్టర్ ఇబ్రహీం వెల్ల‌డించారు.

Advertisement
Advertisement