త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | బెంగాల్‌లో స‌ర్ కార్య‌క్రమం.. ప్ర‌భుత్వం, ఎన్నిక‌ల సంఘానికి సుప్రీంకోర్టు కీల‌క ఆదేశాలు..!

Supreme Court | ప‌శ్చ‌మ బెంగాల్‌లో కొన‌సాగుతున్న స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్ (SIR) ప్రక్రియపై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం మంగ‌ళ‌వారం కీల‌క ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌క్రియ‌లో పాలుపంచుకుంటున్న న్యాయ అధికారుల‌కు ఎలాంటి ఆటంకాలు లేకుండా అవ‌స‌ర‌మైన స‌దుపాయాల‌న్నీ క‌ల్పించాల‌ని బెంగాల్ ప్ర‌భుత్వంతో పాటు కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని ఆదేశించింది.

P

National | Published On Mar 10, 2026, 4.01 pm IST

Supreme Court | బెంగాల్‌లో స‌ర్ కార్య‌క్రమం.. ప్ర‌భుత్వం, ఎన్నిక‌ల సంఘానికి సుప్రీంకోర్టు కీల‌క ఆదేశాలు..!
Advertisement

Supreme Court | ప‌శ్చ‌మ బెంగాల్‌లో కొన‌సాగుతున్న స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్ (SIR) ప్రక్రియపై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం మంగ‌ళ‌వారం కీల‌క ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌క్రియ‌లో పాలు పంచుకుంటున్న న్యాయ అధికారుల‌కు ఎలాంటి ఆటంకాలు లేకుండా అవ‌స‌ర‌మైన స‌దుపాయాల‌న్నీ క‌ల్పించాల‌ని బెంగాల్ ప్ర‌భుత్వంతో పాటు కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని ఆదేశించింది. సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్, జ‌స్టిస్ ఆర్ మ‌హ‌దేవ‌న్‌, జ‌స్టిస్ జోయ్ మాల్య బాగ్చిల‌తో కూడిన ముగ్గురు న్యాయ‌మూర్తుల ధ‌ర్మాస‌నం కేసును విచారించింది.

ఓట‌ర్ల జాబితా నుంచి పేర్లు తొల‌గించారంటూ ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన అభ్యంత‌రాలు, క్లెయిమ్స్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 10.16ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తుల‌ను న్యాయాధికారులు విచారించిన‌ట్లు కోర్టు తెలిపింది. ఈ సంద‌ర్భంగా కోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. స‌ర్ ప్ర‌క్రియ‌లో కొత్త‌గా ఎలాంటి త‌ప్ప‌నిస‌రి చ‌ర్య‌ల‌ను అమ‌లు చేయ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. అలాంటి నిర్ణ‌యాలు తీసుకునే ముందు క‌ల‌క‌త్తా హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి అనుమ‌తిని త‌ప్పనిస‌రిగా తీసుకోవాల‌ని తేల్చి చెప్పింది. ఎన్నికల సంఘం పోర్టల్‌లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు మళ్లీ తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.

న్యాయాధికారులకు కొత్త లాగిన్ ఐడీలు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని, తద్వారా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతుందని కోర్టు పేర్కొంది. న్యాయాధికారులు తీసుకున్న నిర్ణయాలను ఎన్నికల సంఘంలోని పరిపాలనా అధికారులు పునః స‌మీక్షించ‌డానికి వీల్లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ ప్రక్రియకు సంబంధించి వచ్చే అప్పీళ్లను విచారించేందుకు క‌ల‌క‌త్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మాజీ ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. అప్పీల్ అధికారం ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలని కూడా ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న స‌ర్ ప్రక్రియకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై విచారణ సందర్భంగా స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఈ ఆదేశాల‌ను జారీ చేసింది.

Read Also :

త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌నున్న‌ స్పిన్న‌ర్ కుల్దీప్..! అమ్మాయి ఎవ‌రో తెలుసా..?

ఎల్పీజీ స‌ర‌ఫ‌రాపై ఆందోళ‌న‌.. ప్ర‌ధాని మోదీ కీల‌క స‌మావేశం

Advertisement
Advertisement