Kuldeep Yadav | త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న స్పిన్నర్ కుల్దీప్..! అమ్మాయి ఎవరో తెలుసా..?
Kuldeep Yadav | టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. టీ20 వరల్డ్ కప్ విజేత జట్టులో సభ్యుడైన కుల్దీప్ ఈ నెల 14న వంశికను పెళ్లి చేసుకోనున్నాడు. 17న లక్నోలోని ఓ స్టార్ హోటల్‌లో రిసెప్షన్ జరుగనున్నది.
Kuldeep Yadav | టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. టీ20 వరల్డ్ కప్ విజేత జట్టులో సభ్యుడైన కుల్దీప్ ఈ నెల 14న వంశికను పెళ్లి చేసుకోనున్నాడు. 17న లక్నోలోని ఓ స్టార్ హోటల్‌లో రిసెప్షన్ జరుగనున్నది. ఈ వేడుకలకు టీమిండియాకు చెందిన పలువురు క్రికెటర్లు హాజరయ్యే అవకాశం ఉంది. మార్చి 13న హల్దీ, మెహందితో పెళ్లి కార్యక్రమాలు మొదలవుతాయి. కుల్దీప్ తండ్రి రామ్‌సింగ్ యాదవ్ మార్చి 8న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసి వివాహం, రిసెప్షన్‌కు ఆహ్వానించారు.
వాస్తవానికి పెళ్లి వేడుకలు గతేడాది నవంబర్‌లోనే జరగాల్సి ఉన్నప్పటికీ.. పలు సిరీస్‌లతోపాటు టీ20 వరల్డ్ కప్‌కు కుల్దీప్ ఎంపిక చేయడంతో పెళ్లిని వాయిదా వేయాల్సి వచ్చింది. చివరకు ఈ నెల 14న ముస్సోరిలోని ఓ రిసార్ట్‌లో వివాహ వేడుక జరుగనున్నది. వేడుకకు రెండు కుటుంబాలతో పాటు టీమిండియాకు చెందిన మాజీ, ప్రస్తుత క్రికెటర్లు కూడా హాజరవుతారని తెలుస్తోంది. కుల్దీప్ యాదవ్ – వంశిక ఎంగేజ్‌మెంట్ గతేడాది జూన్ 4న లక్నోలోని ఓ స్టార్ హోటల్‌లో జరిగింది. ఈ ప్రైవేట్ కార్యక్రమానికి రెండు కుటుంబాల సభ్యులు, కుల్దీప్ సన్నిహితులు, క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ హాజరయ్యారు.
వంశిక ఎవరు?
వంశిక చద్దా కాన్పూర్‌లోని శ్యామ్‌నగర్ లాల్‌బంగ్లా ప్రాంతానికి చెందిన యువతి. ఆమె తండ్రి యోగేంద్ర సింగ్ చద్దా లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Life Insurance Corporation of India)లో ఉద్యోగి. ప్రస్తుతం వంశిక ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తోంది. ఆమె 2017లో సెయింట్ మేరి కాన్వెంట్ హైస్కూల్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఉన్నత చదువులు, ఉద్యోగం కోసం ఆస్ట్రేలియాకు వెళ్లింది. కుల్దీప్, వంశిక చిన్నప్పటి నుంచి స్నేహితులు, ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. త్వరలోనే పెళ్లితో ఒక్కటవనున్నారు.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






