Manasa Varanasi | మిస్ ఇండియాకు టాలీవుడ్‌లో క్రేజీ ఛాన్స్ – శర్వానంద్ జోడీగా?
కపుల్ ఫ్రెండ్లీ హీరోయిన్ మానస వారణాసి తెలుగులో మరో క్రేజీ ఛాన్స్ అందుకుంది. శర్వానంద్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా మానస వారణాసిని మేకర్స్ ఫైనల్ చేసినట్లు సమాచారం.
Entertainment | Published On May 14, 2026, 3.26 pm IST
Manasa Varanasi | మిస్ ఇండియా మానస వారణాసి తెలుగులో మరో క్రేజీ ఆఫర్ అందుకుంది. ఇటీవలే కపుల్ ఫ్రెండ్లీ సినిమాతో తొలి హిట్‌ను అందుకుంది మానస వారణాసి. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో గ్లామర్ హంగులకు దూరంగా పర్ఫార్మెన్స్ ప్రధానంగా సాగిన ఈ పాత్రలో అసమాన నటనను కనబరిచింది. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో తెలుగు ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. రెబెల్ స్టార్ ప్రభాస్ సైతం మానస నటనపై ప్రశంసలు కురిపించారు. చిన్న సినిమాగా రిలీజైన కపుల్ ఫ్రెండ్లీ కమర్షియల్‌గా హిట్టు టాక్‌ను తెచ్చుకుంది.
శర్వానంద్ సినిమాలో...
కపుల్ ఫ్రెండ్లీ హిట్‌తో మానసకు తెలుగులో మంచి ఆఫర్లే వస్తున్నాయి. తాజాగా ఈ అమ్మడు శర్వానంద్‌తో జోడీ కట్టే ఛాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం. శర్వానంద్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ రొమాంటిక్ కామెడీ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో శర్వానంద్ సరసన హీరోయిన్‌గా మానస వారణాసిని మేకర్స్ ఫిక్స్ చేశారట. కపుల్ ఫ్రెండ్లీకి భిన్నంగా కామెడీ ప్రధానంగా సాగే క్యారెక్టర్‌లో మానస కనిపించబోతున్నట్లు సమాచారం. మానస వారణాసి కంటే ముందు ఈ సినిమాలో హీరోయిన్‌గా అనంతిక సనీల్ కుమార్, రుక్మిణి వసంత్‌తో పాటు మమితా బైజు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ డేట్స్ ఇష్యూ కారణంగా వారు శర్వానంద్ సినిమా చేయలేకపోయారట. చివరకు మానస వారణాసిని ఫైనల్ చేసినట్లు సమాచారం. సినిమాల్లోకి రాకముందు మానస వారణాసి 2020లో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. ఈ అందాల పోటీలతో వచ్చిన క్రేజ్‌తోనే దేవకీ నందన వాసుదేవ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
జార్జ్ క్రిష్?..
శర్వానంద్, శ్రీనువైట్ల మూవీకి జార్జ్ క్రిష్ అనే టైటిల్‌ను అనుకుంటున్నారట. శ్రీనువైట్ల మార్కు కామెడీతో పాటు లవ్‌స్టోరీ, యాక్షన్ అంశాల కలబోతగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జార్జ్ క్రిష్‌ను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
రీఎంట్రీ...
ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్‌గా కొనసాగారు శ్రీనువైట్ల. కామెడీ కథలతో శ్రీనువైట్ల తెరకెక్కించిన పలు సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచారు. ఆగడు, బ్రూస్‌లీ పరాజయాలు శ్రీనువైట్ల కెరీర్‌ను దెబ్బతీశాయి. రీఎంట్రీ ఇచ్చేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజావార్తలు
- ●CM Revanth Reddy | నర్సు హత్య ఘటనపై మెజిస్ట్రీయల్ విచారణకు సీఎం ఆదేశం
- ●TRESA | ట్రెసా అధ్యక్షులుగా కే గౌతమ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎల్ రమణ్ రెడ్డి
- ●KCR | సాగునీటి కోసం మరో యుద్ధానికి సిద్ధం : కేసీఆర్
- ●Ananthika | మార్షల్ ఆర్ట్స్‌తో క్రమశిక్షణ : అనంతిక
- ●Harish Rao | వార్డు మెంబర్ కూడా కాని.. తిరుపతి రెడ్డికి రూ. 40 కోట్లతో భద్రత అవసరమా..?
- ●Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్.. రేవంతే రాజీనామా చేయాలి

CM Revanth Reddy | నర్సు హత్య ఘటనపై మెజిస్ట్రీయల్ విచారణకు సీఎం ఆదేశం

TRESA | ట్రెసా అధ్యక్షులుగా కే గౌతమ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎల్ రమణ్ రెడ్డి

KCR | సాగునీటి కోసం మరో యుద్ధానికి సిద్ధం : కేసీఆర్

Ananthika | మార్షల్ ఆర్ట్స్‌తో క్రమశిక్షణ : అనంతిక





