Minister Vivek | సింగరేణికి పూర్వ వైభవం : మంత్రి వివేక్ వెంకటస్వామి
Minister Vivek | సింగరేణికి పూర్వవైభవం తీసుకువస్తామని మంత్రి కార్మికశాఖ మంత్రి జీ వికేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. సంస్థ అభివృద్ధి కోసం కార్మికులు, అధికారులు సమిష్టిగా బాధ్యతగా పనిచేయాలని సూచించారు.
Flash news | Published On May 14, 2026, 3.25 pm IST
Minister Vivek | సింగరేణికి పూర్వవైభవం తీసుకువస్తామని మంత్రి కార్మికశాఖ మంత్రి జీ వికేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. సంస్థ అభివృద్ధి కోసం కార్మికులు, అధికారులు సమిష్టిగా బాధ్యతగా పనిచేయాలని సూచించారు. కార్మికులతో కాకా కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందని, సంస్థకు రూ.400 కోట్ల నిధులు ఇప్పించి లక్ష ఉద్యోగాలు కాపాడిన వ్యక్తి కాకా వెంకటస్వామి అని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కోల్ బ్లాక్ టెండర్లలో సింగరేణి సంస్థ పాల్గొనేలా చర్యలు తీసుకుంటోందన్నారు. మందమర్రి సింగరేణి ఏరియాలోని కేకే-5 గనిపై శ్రమశక్తి అవార్డు గ్రహీత ఏడుకోల పవన్ కుమార్ సన్మాన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
కార్యక్రమంలో మందమర్రి ఏరియా జీఎం ఎన్ రాధాకృష్ణ, కార్మిక సంఘాల నాయకులు, అధికారులు, కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రమశక్తి అవార్డు గ్రహీతలు పవన్ కుమార్, పుల్లూరి లక్ష్మణ్‌లను మంత్రి శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం కార్మికులతో కలిసి రక్షణ ప్రతిజ్ఞలో పాల్గొన్నారు. ప్రేక్స్‌పై ఇన్‌కమ్ ట్యాక్స్ సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి వివేక్ తెలిపారు. రిటైర్డ్ కార్మికులకు రూ.10 వేల పెన్షన్ వచ్చేలా ఎంపీ వంశీకృష్ణ పార్లమెంట్‌లో కృషి చేస్తున్నారని చెప్పారు. కొత్త గనులు ప్రారంభమైతే కొత్త ఉద్యోగాలు వస్తాయని, ఆర్కేపీ ఓపెన్‌కాస్ట్ ఫేజ్-2 ద్వారా సుమారు 5 వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఫారెస్ట్ అనుమతులు వచ్చిన వెంటనే గనిని ప్రారంభిస్తామని వెల్లడించారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాల పెంపు అంశాన్ని ముఖ్యమంత్రి అధ్యక్షతన త్వరలో పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●CM Revanth Reddy | నర్సు హత్య ఘటనపై మెజిస్ట్రీయల్ విచారణకు సీఎం ఆదేశం
- ●TRESA | ట్రెసా అధ్యక్షులుగా కే గౌతమ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎల్ రమణ్ రెడ్డి
- ●KCR | సాగునీటి కోసం మరో యుద్ధానికి సిద్ధం : కేసీఆర్
- ●Ananthika | మార్షల్ ఆర్ట్స్‌తో క్రమశిక్షణ : అనంతిక
- ●Harish Rao | వార్డు మెంబర్ కూడా కాని.. తిరుపతి రెడ్డికి రూ. 40 కోట్లతో భద్రత అవసరమా..?
- ●Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్.. రేవంతే రాజీనామా చేయాలి

CM Revanth Reddy | నర్సు హత్య ఘటనపై మెజిస్ట్రీయల్ విచారణకు సీఎం ఆదేశం

TRESA | ట్రెసా అధ్యక్షులుగా కే గౌతమ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎల్ రమణ్ రెడ్డి

KCR | సాగునీటి కోసం మరో యుద్ధానికి సిద్ధం : కేసీఆర్

Ananthika | మార్షల్ ఆర్ట్స్‌తో క్రమశిక్షణ : అనంతిక



