INDIA | సీఈసీ రాజీనామాకు డిమాండ్.. సెప్టెంబర్ 30న ఇండీ కూటమి కీలక భేటీ
INDIA | ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై తలెత్తిన వివాదాల నేపథ్యంలో విపక్ష ఇండీ కూటమి నేతలు సెప్టెంబర్ 30న సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఈసీ, సీఈసీ, సర్ వివాదాలపై భవిష్యత్తు కార్యాచరణను సంయుక్తంగా ఖరారు చేయనున్నారు.
INDIA | త్రినేత్ర న్యూస్ : ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar) రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. పార్లమెంటులో ఆయనపై అభిశంసన తీర్మానం (Impeachment Motion) ప్రవేశపెట్టేందుకు ఉమ్మడి వ్యూహాన్ని రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విపక్ష ఇండీ కూటమి పార్టీలు (Crucial Opposition Meeting) ఈనెల 30న ప్రత్యేకంగా భేటీ కానున్నాయి. ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సమావేశం కానున్నాయి. ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై తలెత్తిన వివాదాలపై భవిష్యత్తు కార్యాచరణను సంయుక్తంగా ఖరారు చేయనున్నాయి.
దేశవ్యాప్తంగా ఇప్పటికే లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ శ్రేణులు ఎన్నికల సంఘం కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చి ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సైతం సీఈసీకి 48 గంటల అల్టిమేటం జారీ చేస్తూ 'జంతర్ మంతర్ 2.0' ఆందోళనకు పిలుపునిచ్చింది. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయకపోతే అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు ముంబై వేదికగా దేశ వ్యాప్త ఆందోళనలను ప్రారంభిస్తామని హెచ్చరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇండీ కూటమి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
29న సీడబ్ల్యూసీ సమావేశం
ఇండీ కూటమి పార్టీల భేటీకి ముందు ఈనెల 29న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై తదుపరి కార్యాచరణపై ఈ మీటింగ్‌లో చర్చించనున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్, సుఖ్విందర్ సుఖు తదితరులు పాల్గొననున్నారు. ఇండీ కూటమి పార్టీలతో సమన్వయంపై సీడబ్ల్యూసీలో చర్చించే అవకాశం ఉంది.
Also Read..
ప్రతి ఐదుగురు టీనేజర్లలో ఒకరికి డ్రగ్స్ ముప్పు: సీజేఐ
సంబంధిత వార్తలు

Gyanesh Kumar | సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాల్సిందే.. బెంగాల్ బీజేపీ అధ్యక్షుడి డిమాండ్
సెప్టెంబర్ 26, 2026

UNGA | పగలు ప్రపంచ శాంతి, రాత్రి ఉగ్రవాదం.. ఇదీ దాయాది కపట బుద్ధి.. ఐరాసలో పాక్ పీఎం ప్రసంగంపై భారత్ ఘాటు సమాధానం
సెప్టెంబర్ 26, 2026

Sawan Barwal | 44 ఏండ్లలో తొలిసారి.. ఆసియా గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన మారథాన్ రన్నర్ సవాన్ బర్వాల్
సెప్టెంబర్ 26, 2026
తాజావార్తలు
- ●Vinodkumar | సీఈసీ స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి
- ●TG TET | ఇంకా 7 వేల మంది టీచర్లు 'టెట్' ఫెయిల్
- ●ATM Charges | 3 రోజులు బ్యాంకుల సమ్మె.. ఏటీఎం చార్జీలపై ఖాతాదారులకు ఊరట..
- ●CJI Surya Kant | ప్రతి ఐదుగురు టీనేజర్లలో ఒకరికి డ్రగ్స్ ముప్పు: సీజేఐ
- ●N Ramachander Rao | కుటుంబవాదం భారత ప్రజాస్వామ్యానికే ముప్పు : ఎన్ రామచందర్ రావు
- ●Satyam Srirangam | జ్ఞానేశ్ కుమార్ అక్రమాలపై రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు

Vinodkumar | సీఈసీ స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి

TG TET | ఇంకా 7 వేల మంది టీచర్లు 'టెట్' ఫెయిల్

ATM Charges | 3 రోజులు బ్యాంకుల సమ్మె.. ఏటీఎం చార్జీలపై ఖాతాదారులకు ఊరట..

CJI Surya Kant | ప్రతి ఐదుగురు టీనేజర్లలో ఒకరికి డ్రగ్స్ ముప్పు: సీజేఐ



