త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vakiti Srihari | ఆసియా క్రీడ‌ల్లో త‌రుణ్ ప‌త‌కం తేవ‌డం గ‌ర్వ‌కార‌ణం: మంత్రి వాకిటి

Vakiti Srihari | అంత‌ర్జాతీయ వేదిక‌పై ప్ర‌తిభ చాటి ప‌త‌కం తెచ్చిన తెలంగాణ క్రీడాకారుడు త‌రుణ్ మానేప‌ల్లి ఎంతో మంది యువ క్రీడాకారుల‌కు స్ఫూర్తి అని క్రీడల శాఖా మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి కొనియాడారు.

S

Telangana | Published On Sep 27, 2026, 4.39 pm IST

Vakiti Srihari | ఆసియా క్రీడ‌ల్లో త‌రుణ్ ప‌త‌కం తేవ‌డం గ‌ర్వ‌కార‌ణం: మంత్రి వాకిటి
Advertisement

Vakiti Srihari | త్రినేత్ర న్యూస్: అంత‌ర్జాతీయ వేదిక‌పై ప్ర‌తిభ చాటి ప‌త‌కం తెచ్చిన తెలంగాణ క్రీడాకారుడు త‌రుణ్ మానేప‌ల్లి ఎంతో మంది యువ క్రీడాకారుల‌కు స్ఫూర్తి అని క్రీడల శాఖా మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి కొనియాడారు. ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన తరుణ్‌కు ఆయ‌న‌ అభినందనలు తెలిపారు. ఆదివారం మంత్రి క్యాంపు కార్యాల‌యంలో త‌రుణ్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన సంద‌ర్భంగా ఆయ‌న ఘ‌నంగా స‌న్మానించి ప్ర‌శంసించారు.

ఈ సంద‌ర్భంగా వాటికి మాట్లాడారు. ఆసియా క్రీడల్లో పురుషుల బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకం సాధించాడు. అంతర్జాతీయ వేదికపై ప్రతిభ చాటి పతకం సాధించడం గర్వకారణం. క్రీడల్లో ప్రతిభ ఉన్న యువతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుంది. తెలంగాణలో క్రీడలకు మరింత ప్రాధాన్యం కల్పిస్తూ మౌలిక వసతులు, శిక్షణ సదుపాయాలను బలోపేతం చేస్తున్నాం. భవిష్యత్తులో తరుణ్ మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించాలి అని వాకిటి ఆకాంక్షించారు.

Advertisement
Advertisement