Chidambaram | సీఈసీ రాజీనామా చేయాలి: చిదంబరం
Chidambaram | కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. జ్ఞానేశ్ కుమార్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట పరిధికి అతీతంగా ఉన్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సీఈసీ పదవికి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Chidambaram | కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. జ్ఞానేశ్ కుమార్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట పరిధికి అతీతంగా ఉన్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సీఈసీ పదవికి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్‌లోని నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగా తీసుకున్నామని చెబుతున్నప్పుడు.. ఆయా నిర్ణయాలకు సంబంధించిన పత్రాలను బహిర్గతం చేయాలన్నారు. పలు సందర్భాల్లో ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అభ్యంతరాలు వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఎలక్టోరల్ రోల్స్, డేటాకు సంబంధించిన నిర్ణయాలపై గత పది నెలల్లో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు కనీసం 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనాన్ని ఉటంకిస్తూ చిదంబరం తెలిపారు.
మాజీ కేంద్రమంత్రి ఆరోపణలపై ఈసీ వివరణ
చిదంబరం ఆరోపణలపై ఎన్నికల కమిషన్ స్పందించింది. కమిషన్‌లోని సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు ఉండడం సంస్థాగత ప్రక్రియలో సాధారణమేనని తెలిపింది. అధికారిక ఉత్తర్వులు, నిర్ణయాలన్నీ చట్టబద్ధమైన ప్రక్రియకు అనుగుణంగానే జారీ అవుతున్నాయని స్పష్టం చేసింది. అంతర్గత అభిప్రాయాలు, పరిశీలనలు, విచారణలు పారదర్శకత, చట్టపరమైన నిబంధనల అమలును నిర్ధారించే ప్రక్రియలో భాగమని పేర్కొంది. పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలను విచారించే ట్రైబ్యునల్ ముందు ఎన్నికల కమిషన్ దాఖలు చేసిన అప్పీళ్లపైనా చిదంబరం ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పత్రాలను కూడా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పలు ప్రతిపక్ష పార్టీలు జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను కోరుతున్నాయని చిదంబరం పేర్కొన్నారు. ఈ డిమాండ్‌కు తాను కూడా మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలకు స్పందించిన ఎన్నికల కమిషన్.. తమ నిర్ణయాలన్నీ నిర్దేశిత చట్టపరమైన ప్రక్రియ ప్రకారమే తీసుకుంటున్నామని స్పష్టం చేసింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●India Moon Mission | 2040 నాటికి చంద్రుడిపై అడుగు.. ఇస్రో చీఫ్ నారాయణన్
- ●Ind Vs Wi | వెస్టిండీస్‌తో సిరీస్‌కు రోహిత్–కోహ్లీ సై..
- ●Pitru Paksha 2026 | రేపటి నుంచి పితృపక్షాలు.. ఈ 15 రోజులు ఇవి పాటించాలి..
- ●Shruti Haasan | ఒంటిపై టాటూతో శృతి హాసన్ ...అర్థం ఏమిటో తెలుసా?
- ●CM Revanth Reddy | ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం.. సామాజిక న్యాయమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి
- ●Anumana pakshi Review | అనుమాన పక్షి రివ్యూ - డీజే టిల్లు డైరెక్టర్ తీసిన కామెడీ మూవీ ఎలా ఉందంటే?

India Moon Mission | 2040 నాటికి చంద్రుడిపై అడుగు.. ఇస్రో చీఫ్ నారాయణన్

Ind Vs Wi | వెస్టిండీస్‌తో సిరీస్‌కు రోహిత్–కోహ్లీ సై..

Pitru Paksha 2026 | రేపటి నుంచి పితృపక్షాలు.. ఈ 15 రోజులు ఇవి పాటించాలి..

Shruti Haasan | ఒంటిపై టాటూతో శృతి హాసన్ ...అర్థం ఏమిటో తెలుసా?



