Ramayana | డివైన్ లుక్‌లో సాయిపల్లవి – రామాయణ పోస్టర్ రిలీజ్ – విమర్శలకు చెక్ పెట్టిన నాచురల్ బ్యూటీ
రామాయణ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను మేకర్స్ ఆదివారం రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో సీతారాముడిలా రణభీర్‌కపూర్, సాయిపల్లవి డివైన్ లుక్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. రామాయణ పార్ట్ వన్ దీపావళికి థియేటర్లలోకి రాబోతుంది.
Entertainment | Published On Sep 27, 2026, 4.28 pm IST
Ramayana | కెరీర్‌లో తొలిసారి మైథాలజీ కథతో సాయిపల్లవి చేస్తోన్న సినిమా రామాయణ. రణభీర్‌కపూర్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు నాలుగు వేల కోట్ల బడ్జెట్‌తో రెండు పార్ట్‌లుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి థియేటర్లలోకి రాబోతుంది. రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రావణాసురుడిగా కేజీఎఫ్ హీరో యశ్ కనిపించబోతున్నాడు. యాక్టర్‌గానే కాకుండా ఈ సినిమాకు యశ్ కో ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తోన్నాడు.
వనవాసం...
రామాయణ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సీతారాములు వనవాసం చేసిన కాలం నాటి లుక్‌తో రిలీజ్ చేసిన ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. చేతిలో విల్లుతో రాముడిగా రణభీర్‌కపూర్, కాషాయచీర ధరించి సాయిపల్లవి డివైన్ లుక్‌లో కనిపిస్తున్నారు. వారితో పాటు లక్ష్మణుడిగా రవిదూబే ఈ పోస్టర్‌లో దర్శనమిచ్చారు. వారి వెనుక దట్టమైన అడవి, ఎత్తైన రాతి కొండలు కనిపిస్తున్నాయి. రామాయణ కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హిందీ స్పీచ్...
రామాయణ సినిమాకు సంబంధించి శనివారం ముంబైలో ఓ స్పెషల్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో సాయిపల్లవి పాల్గొన్నది. రామాయణ ప్రమోషన్స్‌లో భాగంగా సాయిపల్లవి పాల్గొన్న తొలి ప్రధాన వేడుక ఇది. రామాయణ సినిమాలో సీత పాత్రలో సాయిపల్లవిని ఎంచుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. సీత పాత్రకు కావాల్సిన రాజసం అందం సాయిపల్లవిలో మిస్సయ్యిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సాయిపల్లవి హిందీ యాసను ట్రోల్ చేస్తున్నారు. ఈ విమర్శలపై ముంబై ఈవెంట్‌తో తనదైన శైలిలో రియాక్ట్ అయ్యింది సాయిపల్లవి. ఈ వేడుకలో హిందీతో పాటు ఇంగ్లీష్‌లో మాట్లాడింది. ఇక నుంచి రామాయణ ప్రమోషన్స్‌లో తాను హిందీలోనే మాట్లాడుతానని, తప్పులు ఉంటే క్షమించాలని గతంలో సాయిపల్లవి అన్నది. ఆ మాటను నిలబెట్టుకుంది. గత ఈవెంట్‌తో పోలిస్తే ఈ సారి హిందీలో చాలా స్పష్టంగా మాట్లాడింది. ఆమె హిందీ యాసలో ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తోందని నెటిజన్లు అంటున్నారు.
కాజల్...రకుల్...
రామాయణ మూవీలో సన్నీ డియోల్ , లారా దత్తా, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Vakiti Srihari | ఆసియా క్రీడల్లో తరుణ్ పతకం తేవడం గర్వకారణం: మంత్రి వాకిటి
- ●Asian Games | ఆసియా గేమ్స్‌లో భారత షట్లర్లకు చుక్కెదురు..
- ●Cockroach Janta Party | అస్సాంలో తీవ్ర ఉద్రిక్తత: మీటింగ్‌కు ముందే సీజేపీ నేతల అరెస్ట్.. సీఎం హిమంతపై తీవ్ర ఆరోపణలు
- ●Minister Seethakka | విద్యకు వయసుతో సంబంధం లేదు : మంత్రి సీతక్క
- ●Komati Reddy Rajagopal Reddy | నాకు మంత్రి పదవి ఇవ్వడం రేవంత్ చేతిలో లేదు
- ●Medaram | మేడారం మినీ జాతర తేదీలు ఖరారు.. ఎప్పుడంటే..?

Vakiti Srihari | ఆసియా క్రీడల్లో తరుణ్ పతకం తేవడం గర్వకారణం: మంత్రి వాకిటి

Asian Games | ఆసియా గేమ్స్‌లో భారత షట్లర్లకు చుక్కెదురు..

Cockroach Janta Party | అస్సాంలో తీవ్ర ఉద్రిక్తత: మీటింగ్‌కు ముందే సీజేపీ నేతల అరెస్ట్.. సీఎం హిమంతపై తీవ్ర ఆరోపణలు

Minister Seethakka | విద్యకు వయసుతో సంబంధం లేదు : మంత్రి సీతక్క






