త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Komati Reddy Rajagopal Reddy | నాకు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం రేవంత్ చేతిలో లేదు

Komati Reddy Rajagopal Reddy | త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం సీఎం రేవంత్ రెడ్డి చేతిలో లేద‌ని.. సాగునీరుపై ఒప్పుకున్నాకే శాలువా క‌ప్పాన‌ని మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి మ‌రోసారి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

S

Telangana | Published On Sep 27, 2026, 4.17 pm IST

Komati Reddy Rajagopal Reddy | నాకు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం రేవంత్ చేతిలో లేదు
Advertisement
  • మునుగోడు కోస‌మే ఇక్క‌డి నుంచి పోటీ చేశా
  • ఐలమ్మ స్ఫూర్తితో మహిళలందరూ బెల్ట్ షాపులు లేకుండా చేయాలి
  • నేటి మహిళా లోకానికి ఆమె స్ఫూర్తి కావాలి
  • చాక‌లి ఐల‌మ్మ విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి వ్యాఖ్య‌లు

Komati Reddy Rajagopal Reddy | త్రినేత్ర న్యూస్: త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం సీఎం రేవంత్ రెడ్డి చేతిలో లేద‌ని.. సాగునీరుపై ఒప్పుకున్నాకే శాలువా క‌ప్పాన‌ని మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి మ‌రోసారి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ధీర, వీర వ‌నిత చాక‌లి ఐల‌మ్మను మ‌హిళా లోకం స్ఫూర్తిగా తీసుకొని గ్రామాల్లో బెల్ట్ షాపులు లేకుండా చేయాల‌ని సూచించారు. బడుగు బలహీన వర్గాల్లో జన్మించి నాటి అన్యాయాన్ని ధిక్కరించిన వీర వనిత ఐలమ్మ అని కొనియాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంస్థాన్ నారాయణ పూర్ మండల కేంద్రంలో వెంకటేశ్వర రజక సహకార సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆదివారం ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో క‌లిసి ఆయ‌న‌ ఆవిష్క‌రించి మాట్లాడారు.

ఒప్పుకున్నాకే శాలువా క‌ప్పాను..

మునుగోడు ప్రాంతం గత కొన్ని ఏళ్ల నుంచి సాగునీరు లేక ఎడారిలా మారింది. గత ప్రభుత్వం శివన్నగూడెం రిజర్వాయర్ ఏర్పాటు చేస్తామ‌ని శంకుస్థాపన చేసి మధ్యలోనే వదిలేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డితో ఎన్నోసార్లు డీండీ ప్రాజెక్టు నుంచి వచ్చేలా ఏర్పాటు చేయాలని చెప్పాను. అదే విషయమై నకిరేకల్ సభలో సీఎంతో మాట్లాడి ఒప్పుకున్నాకే శాలువా కప్పాను. దానికి కూడా రేవంత్ రెడ్డిని మొన్నటి వరకు తిట్టి మంత్రి పదవి కోసమే కలిసానని బద్నాం చేస్తుండ్రు.

మంత్రి పదవి ఇస్తానని చెప్పిన‌ప్ప‌టికీ..

తనకు మంత్రి పదవి ఇవ్వడం అనేది సీఎం రేవంత్ రెడ్డి చేతిలో లేదు. అధిష్టానం చేతిలోనే ఉంది. ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే రేవంత్ రెడ్డితో పాటు అధిష్టానం మంత్రి పదవి ఇస్తానని చెప్పినా మునుగోడు ప్రాంతం కోసమే ఇక్కడి నుంచి పోటీ చేశా. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంతో స్థానిక ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి మాట్లాడతాం. మిగిలిన రెండు సంవత్సరాల కాలంలో నియోజకవర్గ సమస్యలని తీర్చి అభివృద్ధి చేసుకోవాలి అని రాజ‌గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Advertisement