Harbhajan Singh | బీజేపీలో చేరిన హర్భజన్ సింగ్.. సెక్యూరిటీని విత్‌డ్రా చేసుకున్న పంజాబ్ పోలీసులు..
Harbhajan Singh | ఆప్ నుంచి బీజేపీలో చేరిన హర్భజన్ సింగ్ భద్రతను పంజాబ్ పోలీసులు ఉపసంహరించుకున్నారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఆదివారం నుంచి సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని మోహరించారు.
Harbhajan Singh | చండీగఢ్‌లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ చేరిన రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్‌కు పంజాబ్ పోలీసులు అందిస్తున్న భద్రతను ఉపసంహరించుకున్నట్లు సమాచారం. సుమారు 9 నుంచి 10 మంది సిబ్బందితో ఉన్న భద్రతా ఏర్పాట్లు శనివారం నుంచి నిలిపివేసినట్లుగా పీటీఐ నివేదించింది. జలంధర్‌లోని చోటి బరదారి ప్రాంతంలో ఉన్న హర్భజన్ సింగ్ నివాసం వద్ద ఇంతకుముందు పంజాబ్ పోలీస్ సిబ్బంది విధుల్లో ఉండగా.. ఆదివారం కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సిబ్బందిని మోహరించారు.
ఇటీవల ఆప్‌కు చెందిన రాజ్యసభ సభ్యులు రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్ సహా హర్భజన్ సింగ్, అశోక్ మిట్టల్, రాజీందర్ గుప్తా, స్వాతి మాలివాల్, విక్రమజిత్ సాహ్నీ వంటి ఏడుగురు ఎంపీలు బీజేపీలో చేరడం రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో శనివారం లుధియానా, జలంధర్ నగరాల్లో ఆప్ కార్యకర్తలు హర్భజన్ సింగ్, అశోక్ మిట్టల్, రాజీందర్ గుప్తా నివాసాల ఎదుట నిరసనలు చేపట్టారు. వారి ఇళ్ల గోడలపై గద్దార్ (తిరుగుబాటుదారుడు) అని స్పే పెయింట్‌తో రాయడం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ పరిణామాలపై స్పందించిన రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ తన మూల్యాలు, సిద్ధాంతాలను వదిలేసిందని ఆరోపించారు. అందువల్లే తాము బీజేపీలో చేరాల్సి వచ్చిందని చెప్పారు.
తమ ఏడుగురు సభ్యులు ఒక వర్గంగా బీజేపీలో విలీనమయ్యామని తెలిపారు. ఇదిలా ఉండగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ పరిణామంపై తీవ్రంగా స్పందించారు. పార్టీని వీడిన నాయకులను ద్రోహులుగా అభివర్ణించారు. బీజేపీ ఆప్‌ను బలహీనపర్చే ప్రయత్నం చేస్తోందని, పంజాబ్ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. అలాగే, ‘బే-అదబీ’ చట్టం అమలు తర్వాత బీజేపీ అసౌకర్యంగా ఫీల్ అవుతోందని, పంజాబ్ భావోద్వేగాలకు సంబంధించిన అంశాలపై కఠిన చర్యలు తీసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతోందని మాన్ విమర్శించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Naveen Nicolas | ‘పది’ విద్యార్థులకు ప్రత్యేక ఆన్లైన్ డిజిటల్ క్లాసులు.. స్కూల్ ఎడ్యుకేషన్, టీ-శాట్ మధ్య కుదిరిన ఎంవోయూ
- ●Dasoju Sravan | రేవంత్ షెడ్యూల్లో ఏం తప్పులున్నాయో చెప్పాలి
- ●Vande Mataram | వందేమాతరం గొప్పదనం యువతకు తెలియాల్సిందే
- ●Bhagyashree Borse | బాలీవుడ్ సినిమాలో హీరోయిన్ భాగ్యశ్రీ కాదని.. క్లారిటీ ఇచ్చిన టీ సిరీస్..!
- ●Seva Pakhwada | మోదీ సిల్వర్ జూబ్లీ వేళ.. దేశవ్యాప్తంగా బీజేపీ సేవా పఖ్వాడా
- ●Bhatti Vikramarka | పాలకులను నిలదీసే పత్రికా స్వేచ్ఛ ఉండాలి.. విమర్శలను స్వీకరించే ధైర్యం ప్రభుత్వాలకూ ఉండాలి

Naveen Nicolas | ‘పది’ విద్యార్థులకు ప్రత్యేక ఆన్లైన్ డిజిటల్ క్లాసులు.. స్కూల్ ఎడ్యుకేషన్, టీ-శాట్ మధ్య కుదిరిన ఎంవోయూ

Dasoju Sravan | రేవంత్ షెడ్యూల్లో ఏం తప్పులున్నాయో చెప్పాలి

Vande Mataram | వందేమాతరం గొప్పదనం యువతకు తెలియాల్సిందే

Bhagyashree Borse | బాలీవుడ్ సినిమాలో హీరోయిన్ భాగ్యశ్రీ కాదని.. క్లారిటీ ఇచ్చిన టీ సిరీస్..!





