త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Security Guard | ఉద్యోగంలో చేరిన నాలుగు రోజుల‌కే.. మ‌హిళ‌పై సెక్యూరిటీ గార్డ్ అఘాయిత్యం

Security Guard | నాలుగు రోజుల క్రిత‌మే అత‌డు ఓ హౌసింగ్ సొసైటీలో సెక్యూరిటీ గార్డుగా (Security Guard) చేరాడు. సొసైటీకి (Housing Society) చెందిన ఓ మ‌హిళ‌పై క‌న్నేశాడు. ఒంట‌రిగా ఉన్న స‌మ‌యంలో ఆమెపై అఘాయిత్యానికి ఒడిగ‌ట్టాడు.

G

National | Published On Aug 10, 2026, 10.59 am IST

Security Guard | ఉద్యోగంలో చేరిన నాలుగు రోజుల‌కే.. మ‌హిళ‌పై సెక్యూరిటీ గార్డ్ అఘాయిత్యం
Advertisement

Security Guard | త్రినేత్ర‌.న్యూస్‌: నాలుగు రోజుల క్రిత‌మే అత‌డు ఓ హౌసింగ్ సొసైటీలో సెక్యూరిటీ గార్డుగా (Security Guard) చేరాడు. సొసైటీకి (Housing Society) చెందిన ఓ మ‌హిళ‌పై క‌న్నేశాడు. ఒంట‌రిగా ఉన్న స‌మ‌యంలో ఆమెపై అఘాయిత్యానికి ఒడిగ‌ట్టాడు. అనంత‌రం ఆమెను గ‌దిలో బంధించి అక్క‌డి నుంచి ఉడాయించాడు. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్ (Gujarat)లోని అహ్మ‌దాబాద్‌లో (Ahmedabad) చోటుచేసుకుంది.

ఉత్త‌రప్ర‌దేశ్‌లోని (Uttar Pradesh) హ‌ర్డోయ్ జిల్లాకు చెందిన ధ‌ర‌మ్ సింగ్ (Dharam Singh) అహ్మ‌దాబాద్‌లోని ఓ హౌసింగ్ సొసైటీలో సెక్యూరిటీ గార్డుగా నాలుగు రోజుల క్రితం ఉద్యోగంలో చేరాడు. ఆదివారం అదే సొసైటీలో నివాసం ఉంటున్న ఓ మ‌హిళ వాకింగ్ కోసం బిల్డింగ్ టెర్ర‌స్‌పైకి (Building Terrace) వెళ్లింది. గ‌మ‌నించిన అత‌డు కూడా పైకి వెళ్లాడు. బ‌లవంతంగా ఆమెను గ‌దిలోకి తీసుకెళ్లి లైంగిక‌దాడికి (Assault) పాల్ప‌డ్డాడు. అనంత‌రం ఆమెను గ‌దిలోనే ఉంచి, బ‌య‌ట గ‌డియ పెట్టి అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు. దొర‌కకుండా ఉండేందుకు ఫోన్‌ను స్విచ్ఆఫ్ చేశాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదుచేశాడు.

ఫోన్ స్విచ్ఆఫ్ చేయ‌డంతో అత‌డు వెంట‌నే దొర‌క‌లేద‌ని, నిందితుని కోసం 8 బృందాలు న‌గ‌రంలో గాలించాయ‌ని పోలీసులు తెలిపారు. అయితే ఉద‌యం 7 నుంచి 8 గంట‌ల మ‌ధ్య హెబ‌త్‌పూర్ ప్రాంతంలో నిందితుడిని అరెస్టు చేశామ‌ని వెల్ల‌డించారు. గ‌తంలో అత‌డు అహ్మ‌దాబాద్‌లోని ప‌లు కంపెనీల్లో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వ‌హించాడ‌ని చెప్పారు. అయితే హౌసింగ్ సొసైటీలో ఉద్యోగంలో చేరేట‌ప్పుడు సెక్యూరిటీ ఏజెన్సీ అత‌ని బ్యాక్‌గ్రౌండ్ చెక్‌చేయ‌లేద‌ని, స‌రైన వివ‌రాలు కూడా తీసుకోలేద‌ని పోలీసులు గుర్తించారు. దీంతో స‌ద‌రు సెక్యూరిటీ ఏజెన్సీపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. నిందితుడిపై బీఎన్ఎస్ సెక్ష‌న్ల కింద రేప్ కేసు న‌మోదుచేశామ‌ని వెల్ల‌డించారు. బాధితురాలిని వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం ద‌వాఖాన‌కు త‌ర‌లించామ‌ని చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న‌ద‌ని తెలిపారు.

Advertisement
Advertisement