త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SECL Job Notification | SECL లో ఉద్యోగాల జాత‌ర‌.. 1055 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్.. అర్హ‌త‌లు ఇవే..!

SECL Job Notification | నిరుద్యోగ అభ్య‌ర్థుల‌కు శుభ‌వార్త‌. ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి, అది కూడా కేంద్ర ప్ర‌భుత్వంలో ప‌ని చేయాల‌నుకునే వారికి SECL తీపి క‌బురు అందించింది.

S

National | Published On Apr 11, 2026, 3.17 pm IST

SECL Job Notification | SECL లో ఉద్యోగాల జాత‌ర‌.. 1055 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్.. అర్హ‌త‌లు ఇవే..!
Advertisement

SECL Job Notification | త్రినేత్ర‌.న్యూస్ : నిరుద్యోగ అభ్య‌ర్థుల‌కు శుభ‌వార్త‌. ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి, అది కూడా కేంద్ర ప్ర‌భుత్వంలో ప‌ని చేయాల‌నుకునే వారికి SECL తీపి క‌బురు అందించింది. ఛ‌త్తీస్‌గఢ్ రాష్ట్ర బిలాస్‌పూర్‌లోని కేంద్ర బొగ్గు గ‌నుల శాఖ‌కు చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ SECL లో 1055 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువడింది. ఇంట‌ర్ పాసైతే చాలు.. మైనింగ్ స‌ర్దార్, డిప్యూటీ స‌ర్వేయ‌ర్, అసిస్టెంట్ ఫోర్‌మెన్ వంటి ఉద్యోగాల‌ను కొట్టేయొచ్చు. మ‌రి ఈ ఉద్యోగాల‌కు కావాల్సిన అర్హ‌త‌లు ఏంట‌నే విష‌యం తెలుసుకుందాం.

పోస్టుల ఖాళీలు - 1055

  • మైనింగ్‌ సర్దార్‌ గ్రేడ్‌-సి: 577
  • డిప్యూటీ సర్వేయర్‌-గ్రేడ్‌-సి: 43
  • అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ (ఎలక్ట్రికల్‌) గ్రేడ్‌-సి: 435

అర్హ‌త‌లు :

  • ఇంట‌ర్ పాసై ఉండాలి. లేదా త‌త్స‌మాన ప‌రీక్ష‌లు ఉత్తీర్ణులై ఉండాలి. ఇంట‌ర్‌తో పాటు మైనింగ్ లేదా ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్‌లో సంబంధిత డిప్లొమా లేదా డిగ్రీ క‌లిగి ఉండాలి. మైనింగ్ సిర్దార్‌షిప్, గ్యాస్ టెస్టింగ్, ఫస్ట్ ఎయిడ్ లేదా సర్వేయర్ కాంపిటెన్సీ సర్టిఫికేట్లు తప్పనిసరి.

వేత‌నం :

  • నెలకు రూ.47,330

వయోపరిమితి:

  • 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:

  • కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. పరీక్షలో టెక్నికల్ నాలెడ్జ్ (80 మార్కులు), జనరల్ అవేర్‌నెస్/ఆప్టిట్యూడ్ (20 మార్కులు) కలిపి మొత్తం 100 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. నెగటివ్ మార్కులు ఉండవు.

ద‌ర‌ఖాస్తు ఫీజు :

జ‌న‌ర‌ల్, ఓబీసీ, ఈడ‌బ్ల్యూఎస్ అభ్య‌ర్థుల‌కు రూ. 1180.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మ‌హిళా అభ్య‌ర్థుల‌కు ఎలాంటి ఫీజు లేదు.

ద‌ర‌ఖాస్తులు ప్రారంభం :

  • ఏప్రిల్ 15, 2026

ద‌ర‌ఖాస్తుల స‌మ‌ర్ప‌ణ‌కు చివ‌రి తేదీ :

  • మే 14, 2026

ద‌ర‌ఖాస్తుల స‌మ‌ర్ప‌ణ‌కు ఈ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.. https://secl-cil.in/index

Advertisement

తాజావార్తలు

Advertisement