త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Woman Murder | ప‌టాన్‌చెరులో మ‌హిళ దారుణ హ‌త్య‌

Woman Murder | సంగారెడ్డి జిల్లా ప‌టాన్‌చెరు పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని రామేశ్వ‌రం బండ శివార్ల‌లో ఓ మ‌హిళ దారుణ హ‌త్య‌కు గురైంది. మృత‌దేహాన్ని గ‌మ‌నించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

S

Hyderabad | Published On Jul 16, 2026, 2.51 pm IST

Woman Murder | ప‌టాన్‌చెరులో మ‌హిళ దారుణ హ‌త్య‌
Advertisement

Woman Murder | త్రినేత్ర‌.న్యూస్ : సంగారెడ్డి జిల్లా ప‌టాన్‌చెరు పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని రామేశ్వ‌రం బండ శివార్ల‌లో ఓ మ‌హిళ దారుణ హ‌త్య‌కు గురైంది. మృత‌దేహాన్ని గ‌మ‌నించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న ప‌టాన్‌చెరు పోలీసులు మ‌హిళ మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతురాలిని ప‌టాన్‌చెరు ప‌ట్ట‌ణంలోని అంబేద్క‌ర్ కాల‌నీకి చెందిన మంజుల‌(35)గా పోలీసులు గుర్తించారు.

మృత‌దేహం ల‌భించిన స్థలంలో పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో త‌నిఖీలు నిర్వ‌హించారు. ఫోరెన్సిక్ బృందాలు ఆధారాల‌ను సేక‌రించారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీల‌ను కూడా పోలీసులు ప‌రిశీలించారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని ఇన్‌స్పెక్ట‌ర్ జీ వినాయ‌క్ రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement