Nagarjuna | అక్కినేని హీరోల మల్టీస్టారర్‌కు బ్రేక్ – బంగార్రాజు 2 ఆగిపోయిందా? ఆపేశారా?
అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్ మూవీ రాబోతున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించారు. బంగార్రాజుకు సీక్వెల్‌గా ఈ మూవీ ఉండనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ అనౌన్స్‌మెంట్‌తోనే ఈ సినిమా ఆగిపోయినట్లు సమాచారం.
Entertainment | Published On Jul 16, 2026, 2.34 pm IST
Nagarjuna | సోగ్గాడే చిన్ని నాయనా ఫ్రాంఛైజ్ నాగార్జునకు బాగా అచ్చొచ్చింది. ఈ ఫ్రాంఛైజ్‌లో ఇప్పటివరకు సోగ్గాడే చిన్ని నాయనాతో పాటు బంగార్రాజు రూపొందాయి. ఈ రెండు సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. వీటిలో బంగార్రాజు పాత్రలో నాగార్జున యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, మ్యానరిజమ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. సోగ్గాడే చిన్ని నాయనాలో నాగార్జున డ్యూయల్ రోల్‌లో నటించగా...బంగార్రాజులో నాగార్జునతో పాటు నాగచైతన్య హీరోలుగా నటించారు. ఈ ఫ్రాంఛైజ్‌లో బంగార్రాజు 2 మూవీని ఈ ఏడాది ఫిబ్రవరిలో అనౌన్స్ చేశారు.
ముగ్గురు హీరోలు...
బంగార్రాజు 2లో నాగార్జునతో పాటు అక్కినేని యంగ్ హీరోలు నాగచైతన్య, అఖిల్ హీరోలుగా నటించబోతున్నట్లు ప్రచారం జరిగింది. సంక్రాంతి సోగ్గాళ్లుకు థియేటర్లలో సందడి చేయబోతున్నారంటూ అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఫిబ్రవరిలో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. 15 జనవరి 2027 సినిమా రిలీజ్ కాబోతుందంటూ ప్రకటించారు. తండ్రీ కొడుకుల కాంబినేషన్‌లో సినిమా కావడంతో అభిమానుల్లో ఈ మల్టీస్టారర్‌పై ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమాకు సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు ఫేమ్ కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించనున్నట్లు వార్తలొచ్చాయి.
ఆగిపోయిందా?
కానీ ఫిబ్రవరిలో అనౌన్స్‌మెంట్ తర్వాత బంగార్రాజు 2పై ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఈ మల్టీస్టారర్ మూవీ ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నాగార్జున వందో సినిమాతో బిజీగా ఉన్నాడు. నాగచైతన్య వృష్ణ కర్మతో పాటు క్లాక్స్ దర్శకత్వంలో రూపొందుతోన్న నెక్స్ట్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులపై ఫోకస్ పెట్టాడు. ఇటీవలే లెనిన్‌తో తొలి సక్సెస్ అందుకున్న అఖిల్ మరో రెండు కథలకు ఓకే చెప్పాడట.
నో కాంప్రమైజ్...
ముగ్గురు హీరోలు వేర్వేరు ప్రాజెక్ట్‌లలో బిజీగా ఉండటంతో బంగార్రాజు 2కు డేట్స్ కేటాయించడం కష్టంగా మారినట్లు సమాచారం. మరోవైపు ఈ సీక్వెల్ కథ నాగార్జునకు అంతగా నచ్చలేదని ప్రచారం జరుగుతోంది. తనయులతో కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో కథ విషయంలో కాంప్రమైజ్ కాకూడదనే ఈ సీక్వెల్‌ను పక్కనపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
వంద కోట్లకు చేరువలో...
కాగా అఖిల్ హీరోగా నటించిన లెనిన్ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ వంద కోట్ల మైలురాయికి చేరువలో ఉంది. లెనిన్‌కు మురళీకృష్ణ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నాడు. మరోవైపు ఈ ఏడాదే నాగార్జున వందో మూవీతో పాటు నాగచైతన్య వృష్ణ కర్మ థియేటర్లలోకి రానున్నాయి. అక్కినేని ఫ్యామిలీకి 2026 స్పెషల్‌గా నిలవనుందని అభిమానులు చెబుతోన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●RBI | బ్యాంకులకు ఆర్బీఐ కొత్త డేటా రూల్స్.. డేటా గవర్నెన్స్ కమిటీ తప్పనిసరి..
- ●Boats Capsized | మయన్మార్ తీరంలో 500 మంది జలసమాధి..!
- ●Ramdas Athawale | ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు కచ్చితంగా ఆమోదం పొందుతాయి : కేంద్ర మంత్రి
- ●MLC Venkatarami Reddy | మా అబ్బాయి డ్రగ్స్ తీసుకోలే.. ఆ వార్తలు నిరాధారం.. అరెస్ట్ కూడా కాలేదు..
- ●Hydrogen Train | దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు.. విశేషాలు ఇవే..
- ●BRS former MLAs | మామునూర్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి ఘనత బీఆర్ఎస్దే.. అప్పుడే 253 ఎకరాలకు ఆమోదం వచ్చింది

RBI | బ్యాంకులకు ఆర్బీఐ కొత్త డేటా రూల్స్.. డేటా గవర్నెన్స్ కమిటీ తప్పనిసరి..

Boats Capsized | మయన్మార్ తీరంలో 500 మంది జలసమాధి..!

Ramdas Athawale | ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు కచ్చితంగా ఆమోదం పొందుతాయి : కేంద్ర మంత్రి

MLC Venkatarami Reddy | మా అబ్బాయి డ్రగ్స్ తీసుకోలే.. ఆ వార్తలు నిరాధారం.. అరెస్ట్ కూడా కాలేదు..






