త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SBI Recruitment | ఎస్‌బీఐ ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీస‌ర్‌.. రాత ప‌రీక్ష లేకుండానే అభ్య‌ర్థుల ఎంపిక‌..

SBI Recruitment | దేశంలోనే అతిపెద్ద ప్ర‌భుత్వ‌రంగ బ్యాంకు ఎస్‌బీఐ (SBI) ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి రిక్రూట్‌మెంట్ (SBI Recruitment) ప్ర‌క్రియ చేప‌ట్టింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 100 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది.

G

National | Published On May 14, 2026, 12.54 pm IST

SBI Recruitment | ఎస్‌బీఐ ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీస‌ర్‌.. రాత ప‌రీక్ష లేకుండానే అభ్య‌ర్థుల ఎంపిక‌..
Advertisement

SBI Recruitment | త్రినేత్ర‌.న్యూస్‌: దేశంలోనే అతిపెద్ద ప్ర‌భుత్వ‌రంగ బ్యాంకు ఎస్‌బీఐ (SBI) ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి రిక్రూట్‌మెంట్ (SBI Recruitment) ప్ర‌క్రియ చేప‌ట్టింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 100 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. జూన్ 2 వ‌రకు అర్హులై అభ్య‌ర్థులు sbi.bank.in.లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఎంపికైన అభ్య‌ర్థులు హైద‌రాబాద్‌, కోల్‌క‌తాలో ప‌నిచేయాల్సి ఉంటుంది. ఇంట‌ర్వ్యూ ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ప్ర‌తినెల రూ.64,820 జీతం అందుకోవ‌చ్చు.

మొత్తం పోస్టులు- 100
ఇందులో రెగ్యుల‌ర్ పోస్టులు 88, బ్యాక్‌లాగ్ 12 చొప్పున ఉన్నాయి.

అర్హ‌త‌లు
డిగ్రీ పూర్తి చేయాలి. ట్రేడ్ ఫైనాన్స్‌, స‌ర్టిఫికెట్ ఫ‌ర్ డాక్యుమెంట‌రీ క్రెడిట్ స్పెష‌లిస్ట్‌, ఇంట‌ర్న‌ల్ బ్యాంకింగ్‌లో స‌ర్టిఫికెట్ ఉన్న‌వారికి ప్రాధాన్యం ఉంటుంది. సంబంధిత రంగంలో రెండేండ్ల‌ అనుభ‌వం త‌ప్ప‌నిస‌రి. 2026, ఏప్రిల్ 30 నాటికి అభ్య‌ర్థులు 23 నుంచి 32 ఏండ్ల మ‌ధ్య వ‌య‌స్కులై ఉండాలి.

ఎంపిక‌
అర్హ‌త‌ల‌ను బ‌ట్టి ఎంపిక చేసిన అభ్య‌ర్థుల‌ను ఇంట‌ర్వ్యూకి (Interview) పిలుస్తారు. ఇంట‌ర్వ్యూ 100 మార్కుల‌కు ఉంటుంది. అర్హ‌త మార్కుల‌ను బ్యాంకు నిర్ణ‌యిస్తుంది. ఇంట‌ర్వ్యూకి సంబంధించిన స‌మాచారాన్ని ఈమెయిల్ లేదా బ్యాంక్ వెబ్‌సైట్‌లో చూసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి 6 నెల‌లు ప్రొబేష‌న్‌ పీరియ‌డ్ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేష‌న్ ఫీజు: రూ.750. ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ఎలాంటి ఫీజు లేదు.
వెబ్‌సైట్‌: sbi.bank.in.

 

Advertisement
Advertisement