త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SBI | ఎస్‌బీఐ స‌ర్వ‌ర్లు స‌రిగ్గా ప‌నిచేయ‌డం లేదా..? బ్యాంకు ఏం చెప్పింది..?

SBI | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గురువారం షెడ్యూల్డ్ నిర్వహణ పనుల కారణంగా యూపీఐ సహా పలు బ్యాంకింగ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. అర్ధరాత్రి 1.15 గంటల నుంచి 2 గంటల వరకు యూపీఐ సేవలు అందుబాటులో లేవు. అయితే ప్రస్తుతం అన్ని సేవలు యథావిధిగా పనిచేస్తున్నాయి.

S

Business | Published On Nov 19, 2026, 1.45 pm IST

SBI | ఎస్‌బీఐ స‌ర్వ‌ర్లు స‌రిగ్గా ప‌నిచేయ‌డం లేదా..? బ్యాంకు ఏం చెప్పింది..?
Advertisement

SBI | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గురువారం షెడ్యూల్డ్ నిర్వహణ పనుల కారణంగా యూపీఐ సహా పలు బ్యాంకింగ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. అర్ధరాత్రి 1.15 గంటల నుంచి 2 గంటల వరకు యూపీఐ సేవలు అందుబాటులో లేవు. అయితే ప్రస్తుతం అన్ని సేవలు యథావిధిగా పనిచేస్తున్నాయి.

తాత్కాలికంగా అంత‌రాయం..

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఖాతాదారులకు కీలక సమాచారం వెల్లడించింది. గురువారం షెడ్యూల్డ్ నిర్వహణ పనుల నేపథ్యంలో పలు బ్యాంకింగ్ సేవలకు తాత్కాలిక అంతరాయం కలగనుందని ప్రకటించింది. ఇందులో భాగంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) సేవలు అర్ధరాత్రి 1.15 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు, మొత్తం 45 నిమిషాల పాటు నిలిచిపోయాయి. అయితే తక్కువ మొత్తంలో చెల్లింపులు చేసేందుకు ఖాతాదారులు యూపీఐ లైట్ సేవలను వినియోగించుకునే అవకాశం కల్పించింది. షెడ్యూల్డ్ సమయం ముగిసిన తర్వాత ఉదయం నుంచి అన్ని సేవలు యథావిధిగా పనిచేస్తున్నాయని బ్యాంకు వెల్లడించింది.

https://twitter.com/TheOfficialSBI/status/2123045782219862452

ఏయే స‌మ‌యాల్లో స‌మ‌స్య‌లు వ‌చ్చాయి..?

ఎస్‌బీఐ ప్రకటించిన నిర్వహణ షెడ్యూల్ ప్రకారం.. ఆర్టీజీఎస్ సేవలు అర్ధరాత్రి 12.45 గంటల నుంచి తెల్లవారుజామున 1.30 గంటల వరకు నిలిచిపోయాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, ఐఎంపీఎస్ సేవలు 1.15 గంటల నుంచి 1.45 గంటల వరకు అందుబాటులో లేవు. యూపీఐ సేవలు 1.15 గంటల నుంచి 2 గంటల వరకు నిలిచిపోయాయి. ఏటీఎం సేవలు తెల్లవారుజామున 1.45 గంటల నుంచి 2.45 గంటల వరకు, నెఫ్ట్ సేవలు 1.55 గంటల నుంచి 2.40 గంటల వరకు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ సమయాలన్నీ భారత కాలమానం ప్రకారం ప్రకటించారు.

బ్యాంకు ఏం చెప్పింది..?

అత్యవసర చెల్లింపులు చేయాల్సిన ఖాతాదారులు నిర్వహణ సమయానికి ముందే లావాదేవీలు పూర్తి చేసుకోవాలని సూచించారు. యూపీఐ సేవలు అందుబాటులో లేని సమయంలో అవసరాన్ని బట్టి డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు, నగదు లేదా ఇతర బ్యాంకుల ఖాతాలను ఉపయోగించుకోవచ్చు. యూపీఐ లైట్ వినియోగించాలనుకునే వారు తమ చెల్లింపు యాప్‌లో ఆ సదుపాయం ఉందో లేదో ముందుగానే తనిఖీ చేసుకోవడంతోపాటు తగిన బ్యాలెన్స్ ఉంచుకోవాలి. ఒకవేళ యూపీఐ చెల్లింపు విఫలమైనట్లు లేదా పెండింగ్‌లో ఉన్నట్లు కనిపిస్తే, మళ్లీ చెల్లింపు చేసే ముందు యాప్‌లో లావాదేవీ స్థితిని పరిశీలించాలి. ముఖ్యంగా ఖాతాలో డబ్బులు డెబిట్ అయినప్పుడు ఈ జాగ్రత్తను తప్పనిసరిగా పాటించాలి.

Advertisement
Advertisement